కూలిపోతున్న విమానాన్ని చిత్రీకరించిన ప్రయాణీకుడు

Posted By:

ఇంజన్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఆ టూరింగ్ విమానం కొద్ది నిమిషాల్లో సముద్రంలో కూలిపోబోతోంది... ప్రమాదంలో చిక్కుకున్న ఆ విమానంలో మొత్తం 9మంది ప్యాసింజర్లు, ఒక పైలెట్ ఉన్నారు.

 కూలిపోతున్న విమానాన్ని చిత్రీకరించిన ప్రయాణీకుడు

పైలెట్ సూచనల మేరకుప్రయాణికులందరూ లైప్ జాకెట్‌లు వేసుకుని సిద్ధంగా జరగబోయే విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు... వారిలో ఫెర్డినాండ్ ప్యూన్టిస్ అనే ప్రయాణీకుడు మాత్రం జరగబోతున్న ప్రమాదాన్ని చిత్రీకరించి ప్రపంచానికి చూపేందుకు సిద్ధమైయ్యాడు. విహారయాత్ర నిమిత్తం 9మంది ప్రయాణీకులతో డిసెంబర్ 11న కలౌపాపా విమానాశ్రయం నుంచి పయనమైన ఆ టూరింగ్ విమానం నిమిషాల వ్యవధిలోనే మహాసముద్రంలో కూలిపోయింది.

 కూలిపోతున్న విమానాన్ని చిత్రీకరించిన ప్రయాణీకుడు

ప్రమాదంలో ఒక ప్రయాణీకుడు మృతి చెందగా మిగిలిన వారు సురిక్షితంగా బయటపడ్డారు. కోస్ట్ గార్డ్ రెస్క్యూబృందం 80 నిమిషాల వ్యవధిలో ప్రమాద స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టింది. ప్రమాదాన్ని చిత్రీకరించిన ఫెర్డినాండ్ ఆ దృశ్యాలను ఇంటర్నెట్‌లో విడుదల చేసారు. అంతేకాకుండా, ప్రమాద స్థలంలో తాను చిత్రీకరించుకున్న ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసాడు.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/Id6dm68NZHM?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot