ప్ర‌భుత్వ ఉద్యోగులెవ‌రూ VPN ల‌ను వాడొద్దు.. కేంద్రం కీల‌క ఆదేశాలు!

|

దేశంలో సైబ‌ర్ వ్య‌వ‌స్థ‌ను మ‌రింత ప‌టిష్ఠం చేసే దిశ‌గా భార‌త ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఉద్యోగులు థ‌ర్డ్ పార్టీ వ‌ర్చువ‌ల్‌ ప్రైవేట్ నెట్‌వ‌ర్క్(VPN) స‌ర్వీసుల‌ను ఉప‌యోగించ‌వ‌ద్దు అంటూ ఆదేశించింది. ఈ మేర‌కు జాతీయ ఇన్ఫ‌ర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ఆదేశాలు జారీ చేసింది. నార్డ్ వీపీఎన్ (Nord VPN), ఎక్స్‌ప్రెస్ వీపీఎన్ (Express VPN) ఆఫ‌ర్ చేస్తున్న స‌ర్వీసుల‌ను వినియోగించ‌వ‌ద్ద‌ని ఉద్యోగుల‌కు స్ప‌ష్టం చేసింది. వాటితో పాటు టార్ స‌హా మ‌రి కొన్ని స‌ర్వీసుల‌పై ఈ కొత్త ఆదేశాల‌ను అమ‌లు చేయ‌నున్న‌ట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఆదేశాల‌ను అన్ని మంత్రిత్వ శాఖ‌ల‌కు సంబంధిత ఉద్యోగుల‌కు పంపింది.

 

ఆదేశాల ముఖ్య‌మైన అంశాలు ఏమిటంటే..

ఆదేశాల ముఖ్య‌మైన అంశాలు ఏమిటంటే..

అంతేకాకుండా ప్ర‌భుత్వానికి సంబంధించిన ముఖ్య‌మైన డేటా ఫైల్స్‌ను, అతి ముఖ్య‌మైన అంత‌ర్గత స‌మాచారాన్ని ప్ర‌భుత్వేత‌ర క్లౌడ్ విభాగాలైన గూగుల్ డ్రైవ్‌ Google Drive, డ్రాప్‌బాక్స్‌ DropBoxల‌లో స్టోర్ చేయ‌వ‌ద్ద‌ని ఆదేశాల్లో పేర్కొంది. సైబ‌ర్ దాడులు పెరుగుతున్న నేప‌థ్యంలో వాటిని నివారించ‌డాన్ని దృష్టిలో ఉంచుకుని ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు ప‌ది పేజీల‌తో కూడిన కొత్త ఆదేశాల‌ను జారీ చేసింది. " ప్ర‌భుత్వానికి సంబంధించిన ముఖ్య‌మైన డేటా ఫైల్స్‌ను, అతి ముఖ్య‌మైన అంత‌ర్గత స‌మాచారాన్ని ప్ర‌భుత్వేత‌ర క్లౌడ్ విభాగాలైన గూగుల్ డ్రైవ్‌, డ్రాప్‌బాక్స్‌ల‌లో స్టోర్ చేయ‌వ‌ద్దు" అని ఉద్యోగుల‌కు స్ప‌ష్టం చేసింది. దీనికి సైబ‌ర్ సెక్యూరిటీ గైడ్‌లైన్స్ అని పేరు పెట్టింది. ఉద్యోగులంద‌రూ ఈ రూల్స్‌కు క‌ట్టుబ‌డి ఉండాల‌ని పేర్కొంది. లేదంటే సంబంధిత డిపార్ట్‌మెంట్ హెడ్‌లు తగిన చర్యలు తీసుకోవచ్చని కేంద్రం పేర్కొంది. వీటితో పాటు అన‌ధికార రిమోట్ టూల్స్ (ఉదా.. టీమ్ వ్యూవ‌ర్‌, ఎనీడెస్క్) వంటి వాటికి దూరంగా ఉండాల‌ని పేర్కొంది. ప్ర‌భుత్వ అధికారిక‌ అకౌంట్ల పాస్‌వ‌ర్డ్ నిర్వ‌హ‌ణ‌లో కూడా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, క‌ఠిన‌మైన‌ పాస్‌వ‌ర్డ్‌ల‌ను పెట్టుకోవాల‌ని ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వం సూచించింది. ముఖ్యంగా, ప్ర‌తీ 45 రోజుల‌కు ఒక‌సారి పాస్‌వ‌ర్డ్ మార్చుకోవాల‌ని తెలిపింది.

ఉద్యోగులంతా ఈ నిబంధ‌ల‌ను పాటించాలి..
 

ఉద్యోగులంతా ఈ నిబంధ‌ల‌ను పాటించాలి..

ప్ర‌భుత్వ అధికారిక సంప్ర‌దింపులకు బ‌య‌టి ఈ మెయిల్ స‌ర్వీసులు ఉప‌యోగించ‌వ‌ద్ద‌ని తెలిపింది. దీనితో పాటు ప్ర‌భుత్వం త‌మ ఉద్యోగుల్ని మొబైల్ ఫోన్ల‌ను రూట్ (Root) లేదా జైల్ బ్రేక్ (Jail Break) చేయ‌వ‌ద్ద‌ని సూచించింది. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను సైబర్ సెక్యూరిటీ పరంగా ఏమి చేయాలి, ఏమి చేయకూడదనే దానిపై అవగాహన కల్పించడానికి, ఈ మార్గదర్శకాలు తీసుకువచ్చినట్లు ఎన్ఐసీ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. అలాగే, రిమోట్‌, వ‌ర్చువ‌ల్ స‌మావేశాల థ‌ర్డ్ పార్టీ వీడియో కాన్ఫ‌రెన్సింగ్ సేవ‌లు పొంద‌వ‌ద్ద‌ని సూచించింది. ఇప్ప‌టికే భార‌త్ 2020లో చైనాకు సంబంధించిన టిక్‌టాక్‌, ప‌బ్జీ, స‌హా ప‌లు యాప‌ల‌ను దేశంలో ర‌ద్దు చేసింది. ఆ స‌మ‌యంలోనే క్యామ్ స్కాన‌ర్ యాప్‌ను కూడా ర‌ద్దు చేసింది. అయిన‌ప్ప‌టికీ చాలా మంది ఉద్యోగులు అధికారిక డాక్యూమెంట్ల‌ను స్కాన్ చేయ‌డానికి క్యామ్ స్కాన‌ర్ యాప్ ఉప‌యోగిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఏమిటా VPN పాల‌సీ

ఏమిటా VPN పాల‌సీ

కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల నూత‌న‌ వీపీఎన్ పాల‌సీని విడుద‌ల చేసింది. భార‌త ఐటీ విభాగం ప‌లు వీపీఎన్ స‌ర్వీస్ కంపెనీల‌కు భార‌త నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా న‌డుచుకోవాల‌ని సూచించింది. ఈ విధానం ప్ర‌కారం ప్రైవేకేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల నూత‌న‌ VPN పాల‌సీని విడుద‌ల చేసింది. భార‌త ఐటీ విభాగం ప‌లు VPN స‌ర్వీస్ కంపెనీల‌కు భార‌త నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా న‌డుచుకోవాల‌ని సూచించింది. ఈ విధానం ప్ర‌కారం ప్రైవేటు VPN స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు, డేటా సెంట‌ర్లు త‌మ కేంద్రాల్లో యూజ‌ర్‌ డేటాను క‌నీసం ఐదేళ్ల పాటు స్టోర్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఇది VPN స‌ర్వీసెస్ బిజినెస్ విధానాల‌కు వ్య‌తిరేకం అని ఆయా సంస్థ‌లు భావిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే కొన్ని వీపీఎన్ సంస్థ‌లు భార‌త్‌లో త‌మ సేవ‌ల‌ను నిలిపేయాల‌ని నిర్ణ‌యించాయి.ఈ క్ర‌మంలో ఆయా వీపీఎన్ స‌ర్వీస్ కంపెనీలు భార‌త దేశంలో త‌మ స‌ర్వీసుల‌ను నిలిపి వేశాయి. కేంద్రం కొత్త రూల్స్ నేప‌థ్యంలో స‌ర్ఫ్ షార్క్‌, ఎక్స్‌ప్రెస్ వీపీఎన్‌, నార్డ్ వీపీఎన్ స‌ర్వీసుల‌ను నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. ఈ క్ర‌మంలోనే తాజా ఆదేశాలు సంచ‌ల‌నం సృష్టించాయి. టు వీపీఎన్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు, డేటా సెంట‌ర్లు త‌మ కేంద్రాల్లో యూజ‌ర్‌ డేటాను క‌నీసం ఐదేళ్ల పాటు స్టోర్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఇది వీపీఎన్ స‌ర్వీసెస్ బిజినెస్ విధానాల‌కు వ్య‌తిరేకం అని ఆయా సంస్థ‌లు భావిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే కొన్ని వీపీఎన్ సంస్థ‌లు భార‌త్‌లో త‌మ సేవ‌ల‌ను నిలిపేయాల‌ని నిర్ణ‌యించాయి.ఈ క్ర‌మంలో ఆయా వీపీఎన్ స‌ర్వీస్ కంపెనీలు భార‌త దేశంలో త‌మ స‌ర్వీసుల‌ను నిలిపి వేశాయి. కేంద్రం కొత్త రూల్స్ నేప‌థ్యంలో స‌ర్ఫ్ షార్క్‌, ఎక్స్‌ప్రెస్ వీపీఎన్‌, నార్డ్ వీపీఎన్ స‌ర్వీసుల‌ను నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. ఈ క్ర‌మంలోనే తాజా ఆదేశాలు సంచ‌ల‌నం సృష్టించాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
The Indian government has barred its employees from using third-party virtual private networks VPN

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X