ఇంటర్నెట్ మ్యాప్!

Posted By: Prashanth

ఇంటర్నెట్ మ్యాప్!

 

పై చిత్రంలోని దృశ్యం పెయింటింగ్‌లా కనిపిస్తుంది కదూ.. వాస్తవానికి ఇది పెయిటింగ్ కాదు ఓ వ్యక్తి నిర్విరామంగా శ్రమించి రూపొందించిన ఇంటర్నెట్ మ్యాప్. 198దేశాలకు చెందిన 350,000 ప్రముఖ వెబ్ సైట్లతో కూడిన ఈ మ్యాప్‌ను రస్లాన్ ఎన్‌కీవ్ అనే వ్యక్తి వృద్ధి చేశారు. ఈ విధమైన మ్యాపింగ్ ప్రపంచలోనే మొదిటదట. ఎంతో శ్రమతీసుకుని రస్లాన్ ఈ మ్యాప్‌ను డిజైన్ చేశాడు. ఇందులో దేశానికో రంగు కేటాయించబడింది. భారత్‌కు చెందిన ప్రముఖ సైట్లను చిలకాకుపచ్చరంగుతో సూచించారు. దేశం, అంశం అధారంగా గ్రూపులను విభజించారు. ఈ మ్యాప్‌లో India's #1 Language Portal ‘oneindia.in’కు చోటు దక్కింది. internetmap.net వెబ్‌సైట్‌‌లోకి లాగినై ఈ మ్యాప్‌ను మీరు చూడొచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot