Nikola Tesla గురించి సంచలన నిజాలు

సెర్బియన్ - అమెరికన్ ఇంజినీర్ ఇంకా భౌతికవేత్త నికోలా టెస్లా (1856-1943) ఓ గొప్ప శాస్త్రవేత్త. ఆధునిక ప్రపంచ నిర్మాతల్లో ఈయన కూడా ఒకరు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో టెస్లా చేపట్టిన పరిశోధనలు విప్లవాత్మక ఫలితాలను వెలుగులోకి తీసుకురావటంతో పాటు భవిష్యత్‌కు బంగారు బాటను వేసాయి.  

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రపంచపు మొట్టమొదటి AC motor

నికోలా టెస్లా, ప్రపంచపు మొట్టమొదటి Alternating current (AC) motorను సృష్టించటంతో పాటు AC జనరేషన్ అలానే ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీలను అభివృద్ధి చేసారు.

థామస్ అల్వా ఎడిసన్ వద్ద పనిచేసారు..

ప్రఖ్యాత శాస్త్రవేత్తల్లో ఒకరైన థామస్ అల్వా ఎడిసన్ వద్ద నికోలా టెస్లా పనిచేసారు. ఎడిసన్ కంపెనీలోని డీసీ మోటార్స్ అలానే డైనమోలను అభివృద్ధి చేసేందుకు నికోలా టెస్లాను ఎడిసన్ నియమించుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తటంతో టెస్లా, ఎడిసన్ కంపెనీ నుంచి బయటకు వచ్చేసారు.

అడ్వాన్సుడ్ మోటార్ మాగ్నెట్ డిజైన్..

నికోలా టెస్లా రూపొందించిన అడ్వాన్సుడ్ మోటార్ మాగ్నెట్ డిజైన్లకు కాసుల వర్షం కురిసింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తన మేధో శక్తితో నికోలా టెస్లా ప్రపంచానికి గొప్ప ఆవిష్కరణలను ఇచ్చారు. నికోలా టెస్లా 157వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి పలు ఆసక్తికర విషయాలు మీకోసం..

థామస్ అల్వా ఎడిసన్‌తో పోటాపోటీగా

1893లో చికాగోలో జరిగిన World's Expo ఈవెంట్‌లో భాగంగా ఎలక్ట్రసిటీని ఎలా ఉత్పత్తి చేయాలి, ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఎలా పంపిణి చేయాలి అన్న దాని పై నికోలస్ టెస్లా అలానే థామస్ అల్వా ఎడిసన్‌లు తమ తమ విజన్‌లను ప్రపంచానికి వినిపించారు.

నార్త్ అమెరికాలో ఇప్పటికి...

ఈ క్రమంలో నికోలా టెస్లా అభివృద్ధి చేసిన Alternating current, ఎడిసన్ అభివృద్ధి చేసిన DC currentతో పోలిస్తే అటు సేఫ్టీ పరంగానూ ఇటు కాస్ట్ పరంగానూ బెస్ట్ అనిపించింది. నార్త్ అమెరికాలో ఇప్పటికి టెస్లా సిస్టం ఆధారంగానే పవర్ జనరేషన్ అలానే డస్ట్రిబ్యూషన్ జరుగుతోంది.

fluorescent bulbలను అభివృద్ధి చేసి..

నికోలస్ టెస్లా లైట్‌ను కొనగొనలేకపోయినప్పటికి వెళుతరును ఎలా నియంత్రించవచ్చు అలానే దాన్ని ఏ విధంగా పంపిణి చేయవచ్చు అన్నదాని పై ముమ్మర పరిశోధనలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ పరిశోధనలకు గాను టెస్లా fluorescent bulbలను అభివృద్ధి చేసి వాటిని తన ల్యాబ్‌లో పరీక్షించే చూసే వారట.

X-ray టెక్నాలజీ

1800వ దశకం చివరిలో ఎలక్ట్రోమ్యాగ్నటిక్ అలానే ఐయోనైజింగ్ రేడియేషన్‌ల పై ముమ్మర పరిశోధనలు జరిగాయట. ఈ సమయంలో టెస్లా చేపట్టిన పరిశోధనలు ప్రపంచాన్నిమరింత ముందుకు నడిపించాయి. టెస్లా పరిశోధనలు ఫలితంగా పుట్టుకొచ్చిన X-ray టెక్నాలజీ భవిష్యత్‌కు బలమైన వేట వేసింది.

రేడియో సిగ్నల్స్ గురించి కూడా...

రేడియో అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది గుగ్లీల్మో మార్కోనీ. అయితే మార్కోనీ కంటే ముందే నికోలా టెస్లా రేడియో సిగ్నల్స్ గురించి 1893 ఓ ప్రెజంటేషన్ ఇచ్చారట. రేడియో సిగ్నల్స్ అనేవి మరొక ఫ్రీక్వెన్సీ మాత్రమేనని ట్రాన్స్‌మిటర్ అలానే రిసీవర్ సాయంతో ఈ ప్రక్రియ సాధ్యమవుతుందని ఆ ప్రెజంటేషన్‌లో భాగంగా మార్కోనీ వివరించారట. ఈ టెక్నాలజీకి సంబంధించి రెండు పేటెంట్లు కోసం 1897లో నికోలా టెస్లా ధరఖాస్తు చేసుకోగా 1900లో వాటికి అమోదం లభించందట. అయితే నాటకీయ పరిణామాల మధ్య వాటిని 1904లో తిరస్కరించటం జరిగింది.

రిమోట్ కంట్రోల్ సృష్టికర్త...

నికోలా టెస్లా ఆవిష్కరణల్లో రిమోట్ కంట్రోల్ కూడా ఒకటి. టెస్లా అభివృద్ధి చేసిన రిమోట్ కంట్రోల్ 1898లో మొదటి సారిగా ప్రదర్శించబడిందట. ఓ బోట్‌ను కంట్రోల్ చేసేందుకుగానే రూపొందిచబడిన ఈ రిమోట్ కంట్రోల్‌లో బ్యాటరీలతో పాటు రేడియో సిగ్నల్ కంట్రోల్డ్ స్విచ్‌లను టెస్లా వినియోగించారు. ఈ పరిశోధనకు teleautomatonగా నామరణం చేసారు.

 

ఎలక్ట్రిక్ మోటార్

నికోలా టెస్లా అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ మోటార్ అంతిమంగా ఓ కారు ద్వారా పాపులర్ అయ్యింది. టెస్లా అభివృద్ధి చేసిన మోటార్ తిరిగే అయస్కాంత క్షేత్రాలతో పనిచేస్తుంది. ఈ మోటర్ రన్ అయ్యేందుకు విద్యుత్ చాలు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The Inventions Of Nikola Tesla That Changed The World. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot