iOS 16 అప్‌డేట్‌: ఏ iPhone ల‌లో బ్యాట‌రీ ప‌ర్సంటేజీ ఐకాన్ వ‌స్తుంది..!

|

Apple కంపెనీ ఇటీవ‌ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఐఫోన్ యూజ‌ర్ల కోసం iOS 16 ను లాంచ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ కొత్త‌ iOS 16 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ Apple బ్యాటరీ ప‌ర్సెంటేజీ ఇండికేట‌ర్ ఫీచ‌ర్‌ను తిరిగి తీసుకువచ్చింది. కానీ, ప‌లు ఓల్డ్ జ‌న‌రేష‌న్ ఐఫోన్ల వినియోగదారులు బ్యాటరీ శాతాన్ని నేరుగా స్టేటస్ బార్‌లో చూసే ఈ ఫీచ‌ర్‌ను మాత్రం కోల్పోతారని కంపెనీ ధృవీకరించింది. ప్రస్తుతానికి, ఈ పాత తరం ఐఫోన్‌లు ఈ కొత్త ఫీచర్‌ను ఎందుకు కోల్పోతాయనే విష‌యంపై ఆపిల్ అదనపు సమాచారాన్ని అందించలేదు. ఏదేమైన‌ప్ప‌టికీ.. ఈ ఫీచ‌ర్ ఏయే ఐఫోన్ల‌లో అందుబాటులోకి వ‌చ్చింది అనే విష‌యం గురించి వివ‌రంగా తెలుసుకుందాం.

 
iOS 16 అప్‌డేట్‌: ఏ iPhone ల‌లో బ్యాట‌రీ ప‌ర్సంటేజీ ఐకాన్ వ‌స్తుంది..!

బ్యాట‌రీ ప‌ర్సెంటేజీ ఐకాన్ వీటిల్లో లేదు:
MacRumors ద్వారా గుర్తించిన సపోర్ట్ డాక్యుమెంట్ ప్ర‌కారం వివ‌రాలు ఇలా ఉన్నాయి. iPhone XR, iPhone 11, iPhone 12 mini మరియు iPhone 13 mini వంటి అనేక మోడళ్లలో కొత్త బ్యాటరీ ప‌ర్సెంటేజీ ఐకాన్‌ డిస్‌ప్లే అందుబాటులో లేదని Apple పేర్కొంది.

iOS 16 అప్‌డేట్‌: ఏ iPhone ల‌లో బ్యాట‌రీ ప‌ర్సంటేజీ ఐకాన్ వ‌స్తుంది..!

బ్యాట‌రీ ప‌ర్సంటేజీ ఎక్క‌డ చూడొచ్చు!
ముందుగా, యాపిల్ కంపెనీ బ్యాట‌రీ ప‌ర్సంటేజీ ఐకాన్ డిస్‌ప్లే ఫీచ‌ర్‌ను ఈ వేస‌విలో విడుద‌ల చేసిన iOS 16 బీటా వ‌ర్ష‌న్‌లో అందించింది. ఫేస్ ఐడితో ఐఫోన్‌లో iOS 16ని ఇన్‌స్టాల్ చేసినప్పుడు, వినియోగదారులు సెట్టింగ్‌లను మార్పు చేయ‌డం ద్వారా బ్యాటరీ శాతాన్ని స్టేటస్ బార్‌లో కనిపించేలా చేయవచ్చు.

ఈ ఫీచ‌ర్ కావాలంటే సెట్టింగ్‌లలోని బ్యాటరీ విభాగంలో ఎనేబుల్ చేసుకోవాలి. తద్వారా, యోగదారులు తమ ఫోన్ బ్యాటరీ శాతాన్ని నేరుగా స్టేటస్ బార్‌లో చూసేందుకు వీలు క‌ల్పిస్తుంది. ఈ ఫీచ‌ర్ ఎనేబుల్ చేసుకున్న త‌ర్వాత ఇక బ్యాట‌రీ ప‌ర్సెంటేజీ చూడ‌టానికి సెటింగ్స్‌లోకి వెళ్లాల్సిన ప‌ని ఉండ‌దు. మీకు బ్యాట‌రీ ప‌ర్సెంటేజీ నేరుగా డిస్‌ప్లే పై కుడివైపు పై భాగంలో క‌నిపిస్తుంది.

ఏదేమైన‌ప్ప‌టికీ.. యాపిల్ నుంచి ఈ ఫీచర్ తిరిగి వచ్చినప్పటికీ, పాత మోడళ్లలో దీని అమ‌లును మిన‌హాయించ‌డం పై కాస్త ప్ర‌తికూల ప్ర‌భావం ఉంటుంద‌ని అంతా భావిస్తున్నారు. బ్యాటరీ శాతం 20% లేదా అంతకంటే తక్కువకు పడిపోయే వరకు బ్యాటరీ వైట్ క‌ల‌ర్ చిహ్నంతో పూర్తిగా నిండి ఉంటుంది. నిర్ణీత ఛార్జింగ్ కంటే త‌క్కువకు ప‌డిపోయిన‌పుడు ఐకాన్‌లో ఐదో వంతు ఎరుపు రంగులోకి మారుతుంది.

iOS 16 అప్‌డేట్‌: ఏ iPhone ల‌లో బ్యాట‌రీ ప‌ర్సంటేజీ ఐకాన్ వ‌స్తుంది..!

ఈ ఐఫోన్‌లు బ్యాటరీ పర్సంటేజ్ ఐకాన్‌ను ఇండికేట్ చేస్తాయి:
కొత్త బ్యాటరీ ప‌ర్సంటేజీ ఐకాన్ ఇండికేట‌ర్ ఫీచ‌ర్‌కు స‌పోర్ట్ చేసే ఐఫోన్ మోడల్‌లు ఇక్కడ ఉన్నాయి. వీటిలో iPhone X, iPhone XS, iPhone XS Max, iPhone 11 Pro, iPhone 11 Pro Max, iPhone 12, iPhone 12 Pro, iPhone 12 Pro Max, iPhone 13, iPhone 13 Pro, iPhone 13 Pro Max మరియు కొత్తగా ప్రారంభించబడిన iPhone 14 సిరీస్ లోని iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro మరియు iPhone 14 Pro Max మోడ‌ల్స్‌ ఉన్నాయి.

కాగా, iOS 16 అప్‌డేట్ త‌ర్వాత రాబోయే మ‌రిన్ని ఫీచ‌ర్ల గురించి కూడా తెలుసుకుందాం:
* లాక్ స్క్రీన్‌ను ఎక్కువసేపు నొక్కడం ద్వారా వినియోగదారులు వాల్‌పేపర్‌ను మార్చగ‌ల ఫీచ‌ర్‌ను పొందుతారు.
* అంతేకాకుండా, యూజ‌ర్లు స్క్రీన్‌పై విడ్జెట్లు యాడ్ చేయడానికి అవ‌కాశం ఉంటుంది.
* నోటిఫికేష‌న్లు నేరుగా లాక్ స్క్రీన్‌పైనే క‌నిపిస్తాయి. దిగువ నుండి పైకి స్వైప్ చేయడం ద్వారా వినియోగదారులు యాక్సెస్‌ను పొందగలరు.
* Apple యూజ‌ర్లు అప్‌గ్రేడెడ్ కెమెరా యాప్‌ను పొంద‌గ‌ల‌రు.
* కొత్త UI వినియోగదారులను ఫిల్టర్‌లు మరియు మోడ్‌ల మధ్య మారడానికి అనుమతిస్తుంది.
* కొంద‌రు ఐఫోన్ యూజ‌ర్లు మెరుగైన, అద్భుత‌మైన సినిమాటిక్ మోడ్‌ను పొంద‌వ‌చ్చు.
* అంతేకాకుండా, లాక్‌డౌన్ మోడ్ గా పిలిచే లాక్‌డౌన్ మోడ్‌ను పొందుతారు. ఇది పెగాసస్ వంటి స్పైవేర్ నుండి డివైజ్‌ల‌ను రక్షించడానికి రూపొందించబడింది.

Best Mobiles in India

English summary
The iPhones Which are getting battery percentage icon after iOS 16 update

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X