ఈ పనులు చేయాలంటే రోబోలకి సాధ్యం కాదు, మనుషులే కావాలి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనలో సాధిస్తున్న పురోగతి నేపథ్యంలో రానున్న ముప్పై ఏళ్లలో మనుషులు చేసే ప్రతీ పనిని రోబోలు చేస్తాయని, దాంతో ప్రపంచంలోని సగం కంటే ఎక్కువమందికి ఉద్యోగ ముప్పు పొంచి ఉందని నిప
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనలో సాధిస్తున్న పురోగతి నేపథ్యంలో రానున్న ముప్పై ఏళ్లలో మనుషులు చేసే ప్రతీ పనిని రోబోలు చేస్తాయని, దాంతో ప్రపంచంలోని సగం కంటే ఎక్కువమందికి ఉద్యోగ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2045నాటికి రోబోలు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గానో, వైద్యుడిగానో, డ్రైవర్‌గానో ప్రతి పనిలో, ప్రతి ఉద్యోగంలో కనిపించే పరిస్థితి ఉత్పన్నమవుతుందని అంటున్నారు. కృత్రిమ మేధస్సు పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుండటంతో ఇది సాధ్యమేననీ, దాదాపు సగం మంది తమ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముందంటున్నారు.

రాబోయే ముప్ఫై ఏళ్లలో యంత్రాలు, మరమనుషులు ఉద్యోగుల స్థానాన్ని ఆక్రమించుకుంటాయని, ఉద్యోగాలు కోల్పోయిన నిరుద్యోగులను భరించే శక్తి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఉండబోదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని ఉద్యోగాలు రోబోలు చేయలేవని అవి మనుషులు మాత్రమే చేయగలరంటే నమ్మగలరా కాని నమ్మి తీరాలి. అవేంటో చూద్దాం.

మానవ సృష్టి
రోబోలు తలకిందులై తపస్సు చేసినప్పటికీ కొన్ని పనులు చేయలేవని పరిశోధకులు చెబుతున్నారు. అందులో అత్యంత ప్రధానమైనది మానవ సృష్టి. శృంగారం విషయంలో రోబోలు ఎప్పటికీ పోటీకి రాలేవు. టెక్నాలజీ ఎంత పెరిగినా ఓ మహిళ, పురుషుడు మాత్రమే ఆ కార్యానికి అర్హుడవుతాడే తప్ప మిషన్లు ఎప్పటికీ కాజాలవు.దీనితో పాటు పలు ఉద్యోగాలను రోబోలు చేయలేవు. కేర్‌గివర్స్(సంరక్షకులు), నర్సులు, డాక్టర్లు, సేల్స్ ఉద్యోగులు చేసే పనులు. వీటిని ఎప్పటికీ రోబోలు భర్తీ చేయలేవని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. మనిషికి భావోద్వేగ బంధం చాలా ముఖ్యమని, ఆ బంధాన్ని, మానసిక ఉల్లాసాన్ని రోబోలు పంచలేవని ఘంటాపథంగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఐదు రంగాల్లో
సేల్స్ అండ్ మార్కెటింగ్ స్పెషలిస్టులు, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ జాబ్‌లు పెరుగుతాయని, పెరుగుదల కనిపించే ఐదు రంగాల్లో ముఖ్యంగా సేల్స్ సంబంధిత ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయని ‘ఫ్యూచర్ జాబ్' నివేదిక తెలిపింది. ఈ రంగంలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ అవసరమవుతాయని, రోబోలు ఈ పనులను చేయలేవు కనుక ఈ రంగంలో ఉద్యోగాలకు కొదవ ఉండదని నివేదిక పేర్కొంది.

రోబోలు,ఆటోమేషన్‌తో 800 మిలియన్ ఉద్యోగాలకు ముప్పు
ఇదిలా ఉంటే రోబోలు, ఆటోమేషన్‌తో ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉంది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ఏకంగా 80 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ప్రముఖ రీసెర్చ్ సంస్థ మెకిన్సే తాజాగా తన సర్వేలో తేల్చిచెప్పింది.ఈ సంఖ్య ప్రస్తుతం ప్రపంచంలోని మొత్తం కార్మిక సిబ్బందిలో ఐదో వంతుకు సమానం.ఈ పరిణామాలను గమనిస్తే నిరుద్యోగుల సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదు.

అభివృద్ది చెందిన దేశాలపై ప్రభావం
ఆటోమేషన్, రోబోలతో అభివృద్ధి చెందిన దేశాలు, వర్ధమాన దేశాలు రెండూ కూడా ప్రతికూల ప్రభావం ఎదుర్కొవలసి ఉంటుందని మెకిన్సే సంస్థ హెచ్చరించింది. ఆటోమేషన్ త్వరితగతిన విస్తరిస్తే మెషీన్ ఆపరేటర్లు, ఫాస్ట్ ఫుడ్ వర్కర్లు, బ్యాక్-ఆఫీస్ ఉద్యోగులు ఎక్కువగా నష్టపోతారని ఆ సంస్థ హెచ్చరించింది.

ఆటోమేషన్ విస్తరించకపోతే 40 కోట్ల మందిపై ప్రభావం
ఒకవేళ రోబోలు, ఆటోమేషన్ అనుకున్నంత వేగంగా విస్తరించకపోతే అప్పుడు వచ్చే 13 ఏళ్లలో 40 కోట్ల మంది మాత్రం కొత్త ఉద్యోగాలను వెతుక్కోవలసి ఉంటుందని తెలిపింది. ఆటోమేషన్, రోబోలు విస్తరిస్తే ఏ రకమైన ప్రభావం ఉంటుందనే విషయమై 46 దేశాల్లో మెకిన్సే సంస్థ సర్వే నిర్వహించింది.

భారత్‌లో 12 కోట్ల మందికి ఉపాధి కరువు
ఆటోమేషన్, రోబోల ప్రభావంతో ఇండియాపై తీవ్రమైన ప్రభావం ఉంటుంది. 2030 నాటికి సుమారు 12 కోట్ల మందికి ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉందని మెకిన్సే సంస్థ తేల్చి చెప్పింది. అయితే ఆటోమేషన్, రోబోల కారణంగా ఎక్కువగా ఉద్యోగాలు కోల్పోయేది చైనాలో ఉండే అవకాశం ఉందని మెకిన్సే సంస్థ అభిప్రాయపడింది. చైనాలో దాదాపు 20 కోట్ల మందిపైగా ఉపాధి కోల్పోనున్నారని తెలిపింది. అమెరికాలో 5-8 కోట్ల మంది ఉద్యోగాలకు ప్రమాదం పొంచి ఉందని ప్రకటించింది. చైనా, భారత్, అమెరికా దేశాల తర్వాత జపాన్, మెక్సికో, జర్మనీ దేశాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని అభిప్రాయపడింది.


Click it and Unblock the Notifications








