ఆపిల్ కొత్త ఆఫీసు వీడియోను చూశారా, కళ్లు బైర్లుగమ్మాల్సిందే మరి !

Written By:

టెక్ దిగ్గజం ఆపిల్ కొత్తగా నిర్మిస్తున్న ఆపిల్ కార్యాలయానికి సంబందించి సరికొత్త వీడియోని రిలీజ్ చేసింది. కార్యాలయం లోపల భాగం మొత్తం కవరయ్యేలా ఈ వీడియోని రూపొందించారు. ఈ సామాజ్ర్యంలోకి ఓ సారి అడుగుపెడితే మళ్లీ తిరిగిరాలేనంతగా ఆపిల్ తన కొత్త కార్యాలయాన్ని తయారుచేస్తోంది. కాగా ఇందులో స్టీవ్ జాబ్స్ ధియేటర్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

ఆపిల్ సామ్రాజ్యమా లేక స్వర్గానికి ద్వారమా..

అత్యాధునిక డ్రోన్లతో ఆకాశం నుంచి ఈ కార్యాలయాన్ని షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ వీడియోని చూసిన టెక్ విశ్లేషకులు ఓరా ఏమి ఆపిల్ సామ్రాజ్యం అని ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రకృతికి నష్టంకలగని రీతిలో, అత్యాధునిక సాంకేతిక హంగులతో, నిర్మాణరంగంలోనే ఒక అద్భుతంగా దివంగత స్టీవ్ జాబ్స్ కలల సౌధంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు.

ఇస్రో దెబ్బకి కుళ్లి కుళ్లి ఏడుస్తున్న పాకిస్తాన్, బయటపడిన వంకర బుద్ధి, కారణం ఇదే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొత్తం 176 ఎకరాల ప్రాంతాన్ని..

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం క్యుపర్టినో నగరంలో ఉన్న హెచ్‌పి ఆఫీసుకు దగ్గర్లో ఈ కార్యాలయం ఉంది. అక్కడ మొత్తం తొమ్మిది ఆఫీసులను కూడా కొనేసి మొత్తం 176 ఎకరాల ప్రాంతాన్ని తన కొత్త ఆఫీసుకోసం ఆపిల్ సిద్ధం చేసింది.

లేటెస్ట వీడియో

దివంగత స్టీవ్ జాబ్స్ కలల సౌధంగా రూపు దిద్దుకుంటున్న ఈ భవనం లేటెస్ట వీడియో ఇదే.. 176 ఎకరాల్లో భవంతుల శాతం కేవలం 20 మాత్రమే. మిగతా 80శాతమంతా పచ్చదనమే. స్టీవ్ జాబ్స్ అలోచనమేరకే ఇలా ఏర్పాటు చేశారు.

సహజసిద్ధంగా పెరిగిన రకరకాల చెట్లు..

ఆ ప్రాంతంతో సహజసిద్ధంగా పెరిగిన రకరకాల చెట్లు, పొదలకు ఎటువంటి హాని జరుగకుండా, కొన్నింటిని అలాగే ఉంచేసి, కొన్ని చెట్లను పెకలించి, వారి ల్యాండ్‌స్కేప్ డిజైనుకు అనువుగా మళ్లీ పాతించింది. ఈ వ్యవహారం కోసం ప్రత్యేకంగా ఒక చెట్ల డాక్టర్‌ను కూడా నియమించుకుంది.

డిజైన్‌

నియో-ఫ్యూచరిజం (నవీన భవిత) అనే థీమ్‌తో నిర్మించబడిన ఈ క్యాంపస్, పూర్తిగా ఆపిల్ విధానపరమైన ఆలోచనలకు అనుగుణంగా పూర్తిగా అంతరిక్ష నౌకను పోలినట్లుగా దీన్ని నిర్మించారు. గాజుపలకలతో నిర్మితమైన ఈ భవనం దాదాపు ఒక మైలు చుట్టుకొలతతో ఉంటుంది. కేవలం గాజుపలకల పొడవే 6 కిలోమీటర్లు.

సంవత్సరంలో తొమ్మిది నెలలు..

ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత కట్టడాలను డిజైన్ చేసిన ఫాస్టర్స్ అండ్ పార్ట్‌నర్స్ దీని ఆర్కిటెక్ట్ కంపెనీ. మధ్యలో ఉండే ప్రాంతమంతా పచ్చదనమే. మధ్యలో ఒక పెద్ద ఫౌంటేన్, దాని పక్కన ఒక స్టేజి నెలకొల్పారు. సంవత్సరంలో తొమ్మిది నెలలు అసలు ఏసీలు, హీటర్లు వాడకుండానే లోపల చాలా అహ్లాదంగా ఉంటుంది.

ప్రతీ స్విచ్ కూడా ఐఫోన్ బటన్లను ..

ఇక్కడ వాడబడిన ప్రతీ స్విచ్ కూడా ఐఫోన్ బటన్లను పోలివుంటుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, వైర్‌లెస్ వ్యవస్థ అంతా కూడా అత్యాధునిక సాంకేతిక, భద్రతతో నెలకొల్పారు.

రెస్టారెంట్‌

ఇక్కడి రెస్టారెంట్, ఫైవ్‌స్టార్ హోటల్ కన్నా చాలా బాగుంటుంది. గార్డెన్‌లోకి దారితీసే విధంగా దీన్ని నిర్మించారు. రెండు అంతస్థులతో, చాలా పెద్దగా ఉండే ఈ కెఫెటేరియాలో దొరకని తిండి ఉండదు. అన్నీ ఫ్రీనే. అన్నీ అన్నివేళలా అందుబాటులో ఉంటాయి. పూర్తిగా ఆపిల్ ఉద్యోగులకే ఇందులో ప్రవేశం. ఇది కాక, ప్రతీ అంతస్థులో, నాలుగైదు మినీ కెఫేలుంటాయి.

అన్నిరకాల వైద్యసేవలు, వ్యాయామకేంద్రాలు..

ఈ భవంతిలో ఏర్పాటు చేసిన అతిపెద్ద వెల్‌నెస్ సెంటర్, సిలికాన్ వ్యాలీలో పనిచేసే మొత్తం ఆపిల్ ఉద్యోగులు దాదాపు 20వేల మంది అవసరాలను తీర్చే విధంగా 75కోట్ల డాలర్లతో నెలకొల్పారు. అన్నిరకాల వైద్యసేవలు, వ్యాయామకేంద్రాలు దీని సొంతం. ఇవికాక పది అత్యాధునిక వైద్య పరికరాలున్న అంబులెన్స్‌లు కూడా ఉన్నాయి.

విద్యుత్ వినియోగం

క్యాంపస్ పూర్తి అవసరాలకు సరిపోయేవిధంగా ఒక పవర్‌ప్లాంటును కూడా ఏర్పాటు చేశారు. 100శాతం సొంత విద్యుత్తు ఇక్కడే తయారవుతుంది. దీనికోసం వర్తులాకార భవంతి పైభాగం మొత్తం భారీస్థాయిలో సౌరవిద్యుత్ పలకలు నెలకొల్పారు. ఇంకా బయోడీజిల్ లాంటి సంప్రదాయేతర ఇంధనవనరులను కూడా వాడబోతున్నారు. ప్రభుత్వ విద్యుత్ కూడా అందుబాటులో ఉంటుంది కానీ, దాన్ని బ్యాకప్ కోసం అట్టిపెట్టుకున్నారు.

పార్కింగ్‌

పార్కింగ్ సదుపాయాన్ని భవంతి మధ్యలో ఉండే గార్డెన్ కింద సెల్లార్‌లో ఏర్పాటు చేశారు. దాదాపు 14వేల కార్ల పార్కింగ్ సామర్థ్యం గల ఈ సౌలభ్యం బహుళ అంతస్తుల్లో ఉంది. వెయ్యిమంది కూర్చోగల ఒక అద్భుతమైన థియేటర్ కూడా ఈ సెల్లార్‌లోనే ఉంది.

1000 సైకిళ్లు, బైక్‌లు

ఇవేకాక, భవంతి చుట్టూ, మధ్య గార్డెన్ చుట్టూ మైళ్ల కొలదీ నడక, జాగింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు కూడా నెలకొల్పారు. క్యాంపస్ అంతా కలియతిరగడానికి ప్రధాన గేటు వద్ద 1000 సైకిళ్లు, బైక్‌లు కూడా ఉంటాయి.

నిర్మాణ విశేషాలు

మొత్తం విస్తీర్ణం - 176 ఎకరాలు
అంతస్తులు - 4
నిర్మాణశైలి - నియోఫ్యూచరిజం
భవనం - వర్తులాకారం
భూమిపూజ - 2014
గృహప్రవేశం - ఇంకా కాలేదు
భవనవిస్తీర్ణం - 28,00,000 చ.అడుగులు
మొత్తం వ్యయం - 500 కోట్ల డాలర్లు
భూమి కొనుగోలు - 16 కోట్ల డాలర్లు
ఆర్కిటెక్ట్ - ఫాస్టర్ అండ్ పార్టనర్స్
కాంట్రాక్టర్ - రుడాల్ఫ్-స్లెటెన్-హోల్డర్ కన్‌స్ట్రక్షన్స్
ఉద్యోగులు - 13,000లకు పైగానే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The Latest Drone Video of Apple Park gives us a Birds Eye View of its Massive new Water Fountain More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot