విండోస్‌ 7లో షార్ట్‌కట్‌లు ఏంటి, యమ్‌యస్ ఆఫీస్‌లో ఆటోకరెక్ట్‌ ఎలా వాడాలి?

Posted By: Super

విండోస్‌ 7లో షార్ట్‌కట్‌లు ఏంటి, యమ్‌యస్ ఆఫీస్‌లో ఆటోకరెక్ట్‌ ఎలా వాడాలి?

విండోస్‌ 7 ఓఎస్‌ వాడుతుంటే చిట్కాలివిగో. విండోను కుడివైపు డాకింగ్‌ చేయాలంటే Win+Right Arrowలను కలిపి నొక్కాలి. ఎడమ వైపు డాక్‌ చేయడానికి Win+Left Arrow ఓపెన్‌ చేసిన అన్ని విండోలను మినిమైజ్‌, రీస్టోర్‌ గానీ చేయాలంటే Win+Home*Win+Mతో మొత్తం విండోలను మినిమైజ్‌ చేయవచ్చు. Alt+Wino+# కీలతో జంప్‌ లిస్ట్‌లను పొందొచ్చు. విండోస్‌ సెవెన్‌లో అన్ని ప్రోగ్రాంలకు షార్ట్‌కట్‌లను ఏర్పాటు చేయవచ్చు. అందుకు ప్రోగ్రాం ఐకాన్‌పై రైట్‌క్లిక్‌ చేసి ప్రాపర్టీస్‌లోకి వెళ్లి షార్ట్‌కట్‌ ట్యాబ్‌ను క్లిక్‌ చేసి కీబోర్డ్‌ ద్వారా కావాల్సిన కీలను షార్ట్‌కట్‌గా పెట్టుకునే వీలుంది. డేటాని Send to ఆప్షన్‌తో మరిన్ని లొకేషన్స్‌లోకి పంపాలంటే Shift నొక్కి ఉంచి సెండ్‌ చేయండి. సిస్టంలోని రంగుల్ని మార్చుకోవాలంటే కంట్రోల్‌ ప్యానల్‌లోని Disply Appletలోకి వెళ్లండి. జంప్‌ లిస్ట్‌లో ఎక్కువ ప్రోగ్రాంలు కనిపించేలా చేయాలంటే స్టార్ట్‌ బటన్‌పై రైట్‌క్లిక్‌ చేసి ప్రాపర్టీస్‌లోకి వెళ్లాలి. కస్టమైజ్‌ను క్లిక్‌ చేసి Number of items displayed in Jump Listsను మార్చొచ్చు.

మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌లో 'ఆటో కరెక్ట్‌' ఆప్షన్‌ తెలుసుగా? దీంతో ఇమేజ్‌లను కూడా ఇన్‌సర్ట్‌ చేయవచ్చు. ఉదాహరణకు డాక్యుమెంట్‌లో ఎక్కువ సార్లు కంపెనీ లోగోను పెట్టాల్పివస్తే ఆటోకరెక్ట్‌తో ఏదైనా పదాన్ని టైప్‌ చేసి స్పేస్‌ కొడితే చాలు ఇమేజ్‌ వచ్చేస్తుంది. logoఅని టైప్‌ చేసి స్పేస్‌ కొడితే కంపెనీ లోగో ఇన్‌సర్ట్‌ అవుతుందన్నమాట. అందుకు Insert-> Picture-> Clipart-> From file నుంచి ఇమేజ్‌ను డాక్యుమెంట్‌లో ఇన్‌సర్ట్‌ చేయండి. టూల్స్‌ మెనూలోకి వెళ్లి Autocorrectను సెలెక్ట్‌ చేసి ఆటోకరెక్ట్‌ ట్యాబ్‌లోకి వెళ్లాలి.Replace బాక్స్‌లో Logo పదాన్ని టైప్‌ చేయాలి. With బాక్స్‌లో ఇమేజ్‌ కనిపిస్తుంది. ఇప్పుడు Addను క్లిక్‌ చేసి టెక్ట్స్‌, లోగోను జాబితాలో పొందుపరచాలి. ఇక మీరు ఎప్పుడు Logo అని టైప్‌ చేసినా ఇమేజ్‌ వస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot