'మొబైల్ కాంగ్రెస్ వరల్డ్' మొదటి రోజు హైలెట్స్

Posted By: Staff

'మొబైల్ కాంగ్రెస్ వరల్డ్' మొదటి రోజు హైలెట్స్

బార్సిలోనాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన మొబైల్ కాంగ్రెస్ వరల్డ్ 2012 మొదటి రోజున హైలెట్‌గా 'మొబైల్ ప్రీమియర్ అవార్డలు' నిలిచాయి. ఈ  మొబైల్ ప్రీమియర్ అవార్డలను 'ఎపిపి సర్కస్' నిర్వహించింది. సంవత్సర మొత్తంలో విడుదలైన అత్యుత్తమ బెస్ట్ మొబైల్ అప్లికేషన్‌కి అవార్డుని అంతర్జాతీయంగా ప్రకటించారు. రీజినల్ విన్నర్స్ నుండి చివరకు ఫైనల్ విన్నర్స్‌ని ఎంపిక చేశారు. ఈవెంట్ ఆర్గనైజర్స్‌తో పాటు ఆడియన్స్ అంతా ముక్తకంఠంతో 'బీర్ కేర్' కే అవార్డుని ప్రకటించారు.

బెస్ట్ ఎపిపి విన్నర్(జ్యూరీ):

బీర్ కేర్ ఇప్పుడిప్పుడే అభివృద్ది చెందుకున్న ఎఆర్ ఆధారిత ప్రీమియమ్ గేమ్. దీనికి సంబంధించిన టీజర్ మీకోసం ప్రత్యేకం.

ఆడియన్స్ అవార్డు:

ఆడియన్స్ అవార్డుని స్పానిష్‌కు చెందిన బుక్ స్టోర్ 'టచీ బుక్స్' సొంతం చేసుకుంది. దీని పేరు ఇప్పుడు ప్లే టేల్స్. చిన్నపిల్లలకు సంబంధించిన ఈ బుక్స్‌ని ఏడు భాషలలో ఇది పబ్లిష్ చేసింది.

'మొబైల్ కాంగ్రెస్ వరల్డ్' మొదటి రోజు హైలెట్స్

రింగ్ మాస్టర్స్ అవార్డు (ఆర్గనైజర్స్):

రింగ్ మాస్టర్స్ అవార్డుని 'ముఫ్తా గో' అనే యుగాండన్ అప్లికేషన్ సొంతం చేసుకుంది. ఈ అప్లికేషన్ సహాయంతో యూజర్స్ వారికి సమీపంలో ఉన్నఅతి తక్కువ ధర కలిగిన పెట్రోల్ స్టేషన్‌లను తెలియజేస్తుంది.

 

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot