చందమామ చిక్కిపోతున్నాడు, నాసా సైంటిస్టుల పరిశోధనలో షాకింగ్ నిజాలు

ఆకాశంలోని చందమామ క్రమంగా కుచించుకుపోతున్నట్లు పరిశోధనలో తేలింది. ప్రతి రోజూ ఆకాశంలో కనిపిస్తూ అలరించే జాబిల్లి... రాన్రాను సైజ్ తగ్గిపోతోందట. ఎందుకో తెలుసుకునేందుకు సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో కొన్న

|

ఆకాశంలోని చందమామ క్రమంగా కుచించుకుపోతున్నట్లు పరిశోధనలో తేలింది. ప్రతి రోజూ ఆకాశంలో కనిపిస్తూ అలరించే జాబిల్లి... రాన్రాను సైజ్ తగ్గిపోతోందట. ఎందుకో తెలుసుకునేందుకు సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో కొన్ని విషయాలు తెలిశాయి. చంద్రుడిపై అంతర్గతంగా ఉన్న చల్లదనం, ఇతర కారణాల వల్ల జాబిల్లి చిక్కిపోతోందని అమెరికా పరిశోధకులు తెలిపారు. ఈ పరిణామం ఇప్పుడు మొదలైంది కాదని, కొన్ని వందల మిలియన్ల ఏళ్ల నుంచి కొనసాగుతోందని స్పష్టం చేశారు.

చందమామ చిక్కిపోతున్నాడు, నాసా సైంటిస్టుల పరిశోధనలో షాకింగ్ నిజాలు

ఇప్పటివరకు 150 అడుగుల (50మీటర్ల) కన్నా ఎక్కువ కుచించుకుపోయినట్లు తమ అధ్యయనంలో తేలిందని యూనివర్సిటీ ఆఫ్‌ మేరీలాండ్‌ ప్రొఫెసర్‌, అధ్యయనంలో పాల్గొన్న నికోలస్‌ వెల్లడించారు.

ప్రకంపనలు సంభవించే అవకాశం

ప్రకంపనలు సంభవించే అవకాశం

చందమామ చిక్కిపోవడం వల్ల మూన్ క్వేక్స్ (చందమామ ప్రకంపనలు), ఉపరితలంపై ముడతలు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.దీని కారణంగా చంద్రుడి ఉపరితలం ముడుచుకుపోవడంతో పాటు ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని అంచనా వేశారు.

మెరే ఫ్రిగోరిస్‌ వద్ద..

మెరే ఫ్రిగోరిస్‌ వద్ద..

చంద్రుడిపై పరిశోధనల కోసం నాసా పంపిన ల్యూనార్ రికాన్నైస్సన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్వో) ఎయిర్క్రాఫ్ట్ అందించిన 12 వేల ఫొటోలను, అపోలో మిషన్లలో భాగంగా చంద్రుడిపై బిగించిన సిస్మోమీటర్లు అందించిన సమాచారాన్ని శాస్త్రవేత్తలు విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చారు. చంద్రుడి ఉత్తర ధృవానికి సమీపంలోని మెరే ఫ్రిగోరిస్‌ వద్ద చందమామ బాగా కుచించుకుపోయిందని పరిశోధకులు పేర్కొన్నారు.

అపోలో -11,12,14,15,16 మిషన్లో భాగంగా

అపోలో -11,12,14,15,16 మిషన్లో భాగంగా

1969 1977 నుంచి వరకు నాసా చంద్రుడిపైకి చేపట్టిన అపోలో -11,12,14,15,16 మిషన్లో భాగంగా వ్యోమగాములు ఉపరితలంపై వేర్వేరు ప్రాంతాల్లో ఐదు సిస్మోమీటర్లను బిగించారు. ఇవి జాబిల్లి ఉపరితలంపై ఏర్పడుతున్న విపరీతములు గుర్తించాయి మొదటి సిస్మోమీటర్ మిగిలిన నాలుగు సెస్మోమీటర్లు మొత్తం 28 ప్రకంపనలను నమోదు చేశాయి.

చిత్రాలను విశ్లేషించగా

చిత్రాలను విశ్లేషించగా

నాసా శాస్త్రవేత్తలు ఇప్పుడు ఆ సమాచారాన్ని విశ్లేషించి వాటి తీవ్రత రిక్టర్ స్కేలుపై మధ్య నమోదైందని గుర్తించారు 5-8 ఎనిమిది విపరీతాల కేంద్రాలు 30 కి.మీ. పరిధిలోనే ఉన్నట్టు నిర్ధారించారు ఈ వెచ్చదనం సమయంలో ఉపరితల పొరలు మార్పులు జరిగాయి ఎల్ఆర్వో ఎయిర్ క్రాఫ్ట్లోని ద ల్యూనార్ రికాన్నైస్సన్స్ ఆర్బిటర్ కెమెరా (ఎల్ఆర్వోసీ) తీసిన చిత్రాలను విశ్లేషించగా ఈ విషయం బయటపడిందని శాస్త్రవేత్తలు తెలిపారు.

మొత్తం నలుపు రంగులోకి
కోట్ల ఏళ్లుగా సూర్యుడు, అంతరిక్షం నుంచి వెలువడే రేడియేషన్ను గ్రహించటం వల్ల చంద్రుడి శీతల ప్రాతంలో ఉన్న ఉపరితలం మొత్తం నలుపు రంగులోకి మారిపోయింది. ఇటీవల ప్రకంపనల వలన కొండచరియలు విరిగిపడినప్పుడు కింది పొరలు బహిర్గతమయ్యాయి.అవి మచ్చలు మచ్చలుగా ముడతలు పడినట్లుగా కనిపించాయని వారు చెబుతున్నారు.

 

చందమామ పై భాగంలో పగుళ్లు

చందమామ పై భాగంలో పగుళ్లు

ద్రాక్ష పండు ఎండుతున్నప్పుడు ఎలా ముడుతలు పడుతుందో, అలా చందమామపై కూడా ముడుతలు వస్తున్నాయని అంటున్నారు. దీని ఫలితంగా ఉపరితలంపై పగుళ్లు ఏర్పడే అవకాశం ఉందన్నారు. భూమిలో టెక్టోనిక్ ప్లేట్లు (లోపలి పొరలు) ఉన్నట్లుగా చందమామకు లేవు. అందువల్ల ఈ కుచించుకుపోవడం వల్ల చందమామ పై భాగంలో పగుళ్లు ఏర్పడతాయని అంచనా వేశారు.

భూకంపాల మాదిరిగా,
లోపలి పొరల్లోని పదార్థంలో కొంతభాగం ఉపరితలంవైపు చొచ్చుకొస్తున్నది. ఫలితంగా పైపొరపై ఒత్తిడి పెరిగి పగుళ్లు రావడంతోపాటు ముడుతలు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో భూకంపాల మాదిరిగా తరుచూ ప్రకంపనలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతున్నదని శాస్త్రవేత్తల బృంద సభ్యుడు థామస్ వాటర్స్ తెలిపారు.

 

 చల్లబడుతూ చిన్నగా

చల్లబడుతూ చిన్నగా

అయితే చంద్రుడు ఏర్పడిన 4.5 బిలియన్‌ సంవత్సరాల నుంచి దాని లోపల వేడి నెమ్మదిగా కోల్పోతుందని, ఫలితంగా టెక్నోటిక్‌ ప్రక్రియ మొదలైందని పరిశోధకులు తెలిపారు. మొదట్లో అది నిప్పు కణికలా మండుతూ ఉండేది. కాలం గడుస్తున్నకొద్దీ చల్లబడుతోంది. అలా చల్లబడుతూ చిన్నగా కూడా అవుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. జాబిల్లి కుచించుకుపోవడానికి ఇదే కారణమన్నారు.

Best Mobiles in India

English summary
The Moon Is Shrinking, Wrinkling Due To Earthquakes: Study

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X