ముష్కరమూకల పనిపట్టే ‘ఆధునిక టెక్నాలజీ’

Posted By:

మొన్న ముంబయ్.. నిన్న హైదరాబాద్.. రేపు ఎవరు టార్గెట్ ?. దేశవ్యాప్తంగా ముష్కరమూకల దాడులు రోజురోజుకు పేట్రేగిపోతున్నాయ్. ప్రాణనష్టమే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్న ఉగ్రవాదులు అబంసుబం తెలియని ప్రాణాలను బలగొంటున్నారు. తాజాగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో చోటుచేసుకున్న జంట పేలుళ్లు ఘటన అక్కడి జనజీవనాన్ని భయాందోళణకు గురి చేస్తోంది. బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. ఈ భయానక పరిస్థితుల నుంచి మన దేశానికి ఎప్పుడు విముక్తి లభిస్తుంది..?, ఉగ్రవాదాన్నిసమూలంగా తుదిముట్టించే వ్యవస్థ మన దగ్గర లేదా..?, ఈ ప్రశ్నలకు సమాధానం ఖచ్చితంగా ఉంది.

బెస్ట్ ఫోటోగ్రఫీ.. ‘స్టన్నింగ్ ఎఫెక్ట్స్'

ఉగ్రదాన్ని ఎదుర్కొనే క్రమంలో అమెరికా వంటి దేశాలు ఆధునిక టెక్నాలజీని ఉపయోంచి మిశ్రమ ఫలితాలను రాబడుతున్నాయి. ఈ తరహా టెక్నాలజీని మనం కూడా ఉపయోగించినట్లయితే ఉగ్రవాదుల వ్యూహాలను ముందుగానే పసిగట్టి ప్రాణ నష్టం వాటిల్లకుండా చూడొచ్చు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా అభివృద్ధి చెందిన దేశాల్లో లభ్యమవుతున్న హైటెక్ యాంటీ టెరర్రిజం గాడ్జెట్‌లతో పాటు ఆధునిక వర్షన్ టూల్స్ ఇంకా హార్డ్‌వేర్ టెక్నాలజీని మీముందుంచుతున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హంటర్ - కిల్లర్ డ్రోన్స్ (Hunter-Killer Drones):


ఈ ఆధునిక మిలటరీ ఆయుధాలు ప్రముఖ తీవ్రవాద నాయకులను మట్టుబెట్టటంలో కీలక పాత్ర పోషించాయి. ఈ శక్తివంతమైన డ్రోన్‌లు 2007 నుంచి అందుబాటులోకివ వచ్చాయి. తొలి డ్రోన్ ‘ఎంక్యూ-9'ను జనరల్ ఆటోమిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్ వృద్ధి చేసింది. ఈ హంటర్ కిల్లర్ డ్రోన్‌లు 5000 ఎత్తు నుంచి లక్ష్యాన్ని ధ్వంసం చేయగలవు.

పర్యవేక్షణ, భద్రత ఇంకా డిఫెన్స్ రోబోట్ (Surveillance, Security and Defense Robot ) :

పటిష్టమైన రక్షణాత్మక వ్యవస్థతో రూపొందించబడిన ఈ రోబోట్.. మనుషులు చొరబడలేని ప్రమాదకర ప్రాంతాల్లో సైతం ఆపరేషన్‌లను నిర్వహించగలదు. రోబోకు జత చేరసిన పర్యవేక్షణా కెమెరాలు సమాచారాన్ని ఎప్పటికప్పుడు దృశ్య రూపకంలో చేరవేస్తాయి. అంతేకాదండోయ్ ఈ రోబోట్ దాడుల నుంచి తనని తాను రక్షించుకోవటమే కాకుండా ఎదురుదాడికి దిగగలదు.

మిలటరీ గ్రేడ్ స్పై శాటిలైట్స్ (Military Grade Spy Satellites):


ఈ స్పై శాటిలైట్‌లు ఉగ్రవాద కేంద్రాలను పసిగట్టటంలో కీలక పాత్రోపోషిస్తాయి. అనేక ఉగ్రవాద ఆపరేషన్‌లలో ఇవి కీలక పాత్ర పోషించాయి.

విస్ఫోటక ఎంట్రీ టాక్టికల్ డిఫెన్స్ రౌండ్స్ (Explosive Entry Tactical Defense Rounds):

ఈ శక్తివంతమైన బుల్లెట్‌లను యూఎస్ రక్షణ శాఖ ఉపయోగిస్తోంది. ఈ శక్తివంతమైన బుల్లెట్‌లు శుత్రుమూకలను చీల్చి చండాడగలవు.

బాంబు- స్నిప్పింగ్ రోబోట్స్ (Bomb-Sniffing Robots):


ఈ రోబోట్‌లు బాంబులను గుర్తించటంలో కీలక పాత్ర పోషిస్తాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot