ఇన్నోవేటివ్ 2014, యాపిల్ నుంచి సామ్‌సంగ్ వరకు

Posted By:

అంతకంతకు అభివృద్థి చెందుతోన్న మనిషి ఆలోచనలు వినూత్న ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నాయి. సంవత్సరాలు గడుస్తున్న కొద్ది టెక్నాలజీ రూపురేఖలు మారుతూనే ఉన్నాయి. ఈ 2014లో పలు క్రియేటివ్ ఆవిష్కరణలను మనం చూసాం. స్మార్ట్‌ఫోన్‌లు మొదలుకుని స్మార్ట్‌వాచ్‌ల వరకు సరికొత్త ఫీచర్లతో టెక్నాలజీ ప్రపంచాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసాయి. 2014కుగాను ఇన్నోవేటివ్ హోదాను సొంతం చేసుకున్న 10 గాడ్జెట్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇన్నోవేటివ్ 2014, యాపిల్ నుంచి సామ్‌సంగ్ వరకు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4

2014కు గాను సామ్‌సంగ్ డిజైన్ చేసిన అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌లలో గెలాక్సీ నోట్ 4 ఒకటి. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా నిలిచింది.

 

ఇన్నోవేటివ్ 2014, యాపిల్ నుంచి సామ్‌సంగ్ వరకు

యాపిల్ ఐఫోన్ 6

యాపిల్ ఐఫోన్ 6, 6 ప్లస్ ఫోన్‌లలో ఏర్పాటు చేసిన సరికొత్త కెమెరా వ్యవస్థ 2014కు  గాను ఇన్నోవేటివ్ టెక్నాలజీ ఫీచర్‌గా నిలిచింది.

 

ఇన్నోవేటివ్ 2014, యాపిల్ నుంచి సామ్‌సంగ్ వరకు

మోటో 360

గూగుల్ ఆండ్రాయిడ్ వేర్ ప్లాట్‌ఫామ్ పై మోటో 360 స్మార్ట్‌వాచ్ రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 4.3 ఆపై వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లను ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. 1.56 అంగుళాల బ్యాక్‌లైట్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320x290పిక్సల్స్, 205 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, టీఐ ఓఎమ్ఏపీ 3 ప్రాసెసర్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 512 ఎంబి ర్యామ్, బ్లూటూత్ 4.0 కనెక్టువిటీ, 320 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఇన్నోవేటివ్ 2014, యాపిల్ నుంచి సామ్‌సంగ్ వరకు

యాపిల్ సంస్థ వృద్థి చేసిన ‘యాపిల్ పే' అనే నగదు చెల్లింపు స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోన్న నేపధ్యంలో రానున్న రోజుల్లో మొబైల్ చెల్లింపు విధానం (Mobile payment systems) మరింత విస్తృతం కానుంది. ఈ తరహా యాప్‌‌కు బ్యాంక్ అకౌంట్ లేదా క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను అనుసంధానం చేసినట్లయితే అన్ని రకాల ఆన్‌లైన్ చెల్లింపులను ఈ స్మార్ట్‌ఫోన్‌ యాప్ ద్వారానే చేసేయవచ్చు. యాపిల్ పే తరహాలోనే గూగుల్ వాలెట్, పేపాల్, లెవలప్, స్కేర్ వాలెట్ వంటి యాప్స్ మొబైల్ చెల్లింపు సేవలను అందిస్తున్నాయి. అయితే ఇవి ప్రస్తుతానికి యూఎస్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే ఇవి మరిన్ని దేశాలను విస్తరించనున్నాయి.

ఇన్నోవేటివ్ 2014, యాపిల్ నుంచి సామ్‌సంగ్ వరకు

వన్ ప్లస్ వన్

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ వన్ ప్లస్ కంపెనీ ‘వన్ ప్లస్ వన్' పేరుతో మొదటి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో భారత్‌లో విడుదల కాబోతోంది. ఈ ఫోన్ 64జీబి మెమరీ వేరియంట్‌ను రూ.25,000 ధర పరిధిలో విక్రయించేందుకు కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రీఆర్డర్లు ప్రారంభమయ్యాయి. 16 ఇంకా 64జీబి ఇంటర్నల్ మెమెరీ వేరియంట్‌లలో ఈ హ్యాండ్‌సెట్‌లు అందుబాటులోకి రానున్నట్లు మార్కెట్ వర్గాల టాక్. 64జీబి మెమరీ స్టోరేజ్‌‌తో లభ్యం కానున్న వన్ ప్లస్ వన్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి. 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 ×1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 2.5 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3జీ ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపకల్పన చేయబడిన సియానోజెన్ మోడ్ 11ఎస్ ఆపరేటింగ్ సిస్టం, ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (16జీబి,64జీబి), 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఇన్నోవేటివ్ 2014, యాపిల్ నుంచి సామ్‌సంగ్ వరకు

రెటీనా డిస్‌ప్లేతో కూడిన యాపిల్ కొత్త ఐమ్యాక్

ఇన్నోవేటివ్ 2014, యాపిల్ నుంచి సామ్‌సంగ్ వరకు

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం

ఇన్నోవేటివ్ 2014, యాపిల్ నుంచి సామ్‌సంగ్ వరకు

మైక్రోసాఫ్ట్ తన లేటెస్ట్ వర్షన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌ ప్యాక్‌ను ఐప్యాడ్ ఇంకా ఐఫోన్‌ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది.

 

ఇన్నోవేటివ్ 2014, యాపిల్ నుంచి సామ్‌సంగ్ వరకు

భవిష్యత్ కంప్యూటింగ్‌ను దృష్టిలో ఉంచుకుని సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ వర్చువల్ రియాల్టీ కంపెనీ ఓకులస్ (Oculus) కంపెనీని 2 బిలియన్‌లకు కొనుగోలు చేసింది.

ఇన్నోవేటివ్ 2014, యాపిల్ నుంచి సామ్‌సంగ్ వరకు

2014లో వెలుగులోకి వచ్చిన గూగుల్ కార్డ్‌బోర్డ్ ప్రాజెక్ట్ వర్చువల్ రియాల్టీ టెక్నాలజీ పై పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తోంది. త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ టెక్నాలజీ వర్చువల్ రియాల్టీని మరింత ముందుకు తీసుకువెళ్లన్నుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The Most Innovative New Tech Products Of 2014. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot