పెరిగిన రిక్రూట్‌మెంట్‌, నౌకరీ డాట్‌ కామ్‌ అధ్యయనంలో వెల్లడి

Posted By: Super

పెరిగిన రిక్రూట్‌మెంట్‌, నౌకరీ డాట్‌ కామ్‌ అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ: జనవరి-మార్చి నెలల్లో వాహన, ఐటీ, ఐటీ ఆధారిత రంగాల్లో నియామకాలు జోరుగా ఉన్నాయి. మార్చి నెల నియామకాల్లో వృద్ధిరేటు ఇందుకు దోహదం చేశాయని నౌకరీ డాట్‌కామ్‌ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. 2011 మొదటి త్రైమాసికంలో ఉద్యోగుల రిక్రూట్‌మెంట్‌ మెరుగుపడిందని జాబ్‌ పోర్టల్‌ నౌకరీ డాట్‌కామ్‌ పేర్కొంది. నౌకరీ డాట్‌కామ్‌ ఇండెక్స్‌ ప్రకారం ఫిబ్రవరి 1,050 ఉండగా మార్చి నాటికి ఇది స్వల్పంగా పెరిగి 1,085కి చేరిందని మంగళవారం నాడు నౌకరి డాట్‌ కామ్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

వాహన, ఐటీ, ఐటీఈఎస్‌ విభాగాల్లో ఫిబ్రవరి నెలతో పోలిస్తే మార్చిలో వరుసగా 7, 6, 5 శాతం వృద్ధిరేటు నమోదు కాగా గత ఏడాది మార్చి నెలతో పోలిస్తే ఈ ఏడాది ఇదే నెలలో వరుసగా 27, 34, 10 శాతం వృద్ధి చెందినట్లు అధ్యయనం పేర్కొంది. 2008లో పోల్చుకుంటే ఈ ఏడాది మార్చి ఇండెక్స్‌ ఎక్కువడా ఉంది. ఐటిరంగంలో రిక్రూట్‌మెంట్‌ భారీగా ఉండగా... తర్వాతి రంగాలు వరుసగా ఆటో, టెలికం, బ్యాంకింగ్‌ రంగంలో కూడా ఉద్యోగుల రిక్రూట్‌మెంట్‌ బాగానే పుంజుకుందని నౌకరి డాట్‌కామ్‌ తెలిపింది. 2011-12 ఆర్థిక సంవత్సరం వ్యాపారానికి అనుకూలంగా ఉంటాయన్న ఉద్దేశ్యంతో అన్నీ రంగాలకు చెందిన పరిశ్రమలు రిక్రూట్‌మెంట్‌ చేపట్టాయి. పూనే, ఢిల్లీ -ఎన్‌సీఆర్‌, కోలకతా, బెంగళూరులో రిక్రూట్‌మెంట్‌ జోరందుకుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot