కొత్త కొత్త ఫీచర్స్‌తో యాహూ మెయిల్‌ కొత్త వెర్షన్

Posted By: Staff

కొత్త కొత్త  ఫీచర్స్‌తో యాహూ మెయిల్‌ కొత్త వెర్షన్

యాహూ మెయిల్‌ లేని వారంటూ ఎవరూ ఉండరు. ప్రస్తుతం ఉన్న పోటీ వాతావరణాన్ని తట్టుకోని నిలబడడానికి అనుగుణంగా మెయిల్ సర్వీసెస్ అన్ని తమ సర్వీసెస్‌లను కొత్త కొత్త అదనపు హాంగులు ఏర్పాటు చేస్తున్నాయి. అందులో భాగంగా యాహూ మెయిల్ అన్ని కొత్త హాంగులతో తన యాహూ మెయిల్ బీటాని విడుదల చేసింది. దానిని గనుక మీరు క్లిక్ చేస్తే అందులో ఉన్నటువంటి కొత్త ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో తెలసుకుందాం.. అందులోని కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫీచర్స్ మీ కోసం...

కొత్తగా రూపోందించినటువంటి ఈమెయిల్‌కి జవాబివ్వడానికి 'రిప్త్లె' క్లిక్‌ చేయక్కర్లేదు. సోషల్‌ నెట్‌వర్క్‌ల్లో స్క్రాప్‌లకు ఇచ్చే మాదిరిగా జావాబు పంపేయవచ్చు. మెయిల్‌ కిందే రిప్త్లె బాక్స్‌ని ఏర్పాటు చేశారు. దాంట్లో టైప్‌ చేసి 'సెండ్‌' చేస్తే సరి. కాంటాక్ట్‌లు, అప్‌డేట్స్‌, ఇతర అప్లికేషన్స్‌ని ట్యాబ్‌ విండోల్లో ఓపెన్‌ చేసుకునే వీలుంది. ఉదాహరణకు Sent ఫోల్డర్‌ను ఓపెన్‌ చేస్తే బ్రౌజర్‌లో మాదిరిగా కొత్త ట్యాబ్‌లో వస్తుంది. కొత్తగా ఇన్‌బాక్స్‌కు చేరిన మెయిల్స్‌ని చూసేందుకు Check for new emails బటన్‌ను ఏర్పాటు చేశారు. అదే ఇన్‌బాక్స్‌ పక్కన కనిపించే బాణం గుర్తు. దానిపై క్లిక్‌ చేస్తే ఇన్‌బాక్స్‌ అప్‌డేట్‌ అవుతుంది. మెయిల్‌ అడ్రస్‌లను మెనేజ్‌ చేయడానికి Contacts ట్యాబ్‌ను ఏర్పాటు చేశారు. కాంటాక్ట్స్‌ని ఇంపోర్ట్‌ చేశాక Fix Duplicate Entries బటన్‌తో ఒకటికంటే ఎక్కువ సార్లు అడ్రస్‌ల్లో చేరిన డుప్లికేట్‌ ఐడీలను తొలగించే వీలుంది.

ఇన్‌బాక్స్‌ నుంచే సోషల్‌ నెట్‌వర్క్‌ అప్‌డేట్స్‌ పొందడానికి వీలుగా My Social Networks ఏర్పాటు చేశారు. మెనూపై క్లిక్‌ చేస్తే వచ్చే కొత్త ట్యాబ్‌ ద్వారా Sobees సోషల్‌ నెట్‌వర్క్‌ ఇంటర్ఫేస్‌తో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, మైస్పేస్‌, లింక్డ్‌ఇన్‌ ఫ్రెండ్‌ఫీడ్‌... నెట్‌వర్క్‌లను పొందవచ్చు. సెర్చ్‌బాక్స్‌తో నెట్‌వర్క్‌ల్లోని అప్‌డేట్స్‌ని వెతకొచ్చు కూడా. Update Statusతో ఒకేసారి అన్ని సోషల్‌ నెట్‌వర్క్‌ల్లోని స్టేటస్‌ను మార్చే వీలుంది.

మెయిల్‌లోనే ఆన్‌లైన్‌ సర్వీసుల్ని అప్లికేషన్ల రూపంలో పొందొచ్చు. సెట్టింగ్స్‌పై క్లిక్‌ చేస్తే అప్లికేషన్ల గ్యాలరీ ఓపెన్‌ అవుతుంది. ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు All my Purchases ఉంది. Add ద్వారా ఇన్‌బాక్స్‌లోనే సర్వీసుని నిక్షిప్తం చేసుకోవచ్చు. ఫొటోలను మెయిల్‌లోనే ఎడిట్‌ చేయాలంటే గ్యాలరీలోని Picnikను యాడ్‌ చేసుకోండి. ఫొటో ఫేరింగ్‌ సర్వీసు ఫ్లిక్కర్‌ని కూడా పొందే వీలుంది. రంగు గంగుల ఫాంట్‌లతో సందేశాలు పంపడానికి My Cool Fonts ఉంది. వాటితో కంపోజ్‌ చేసి Create email క్లిక్‌ చేస్తే సరి. My Photosతో అల్బమ్‌లు తయారు చేసి పంచుకోవచ్చు.

ఎక్కువ మెమొరీ ఫైల్స్‌ని మెయిల్‌లో పంపడానికి Attach Large Files అప్లికేషన్‌ ఉంది. Yousendit ఆధారంగా ఇది పని చేస్తుంది. యాహూ ఐడీతో సైన్‌ఇన్‌ అయ్యి Select filesతో ఎంచుకోవాలి. ఉచిత వెర్షన్‌లో 100 ఎంబీ ఫైల్స్‌ పంపే వీలుంది. ప్రీమియం వెర్షన్‌ తీసుకుంటే 2 జీబీ ఫైల్స్‌ని కూడా పంపేయవచ్చు. 'నోట్‌ప్యాడ్‌'తో బ్రౌజింగ్‌లో తారసపడిన ముఖ్యమైన సమాచారాన్ని సేవ్‌ చేసుకోవచ్చు. క్లిక్‌ చేయగానే కొత్త ట్యాబ్‌ విండోలో యాహూ నోట్‌ప్యాడ్‌ ఓపెన్‌ అవుతుంది. Add Noteతో నోట్స్‌ టైప్‌ చేసుకోవచ్చు. ప్రత్యేక ఫోల్డర్లను క్రియేట్‌ చేసుకుని ఫైల్స్‌ని విభజించవచ్చు. ఎక్కడైనా వాటిని పొందే వీలుంది. ఇంకెందుకు మరి ఆలస్యం యాహూ మెయిల్ కొత్తగా విడుదల చేసినటువంటి ఈ బీటా వర్సన్‌ని సౌకర్యాలను అందిపుచ్చుకోని ఎంజాయ్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting