'ఫేస్‌బుక్ పేజీ బ్రాండ్ పేజీ' కాన్పెస్ట్ చాలా బాగుంది

Posted By: Super

'ఫేస్‌బుక్ పేజీ బ్రాండ్ పేజీ' కాన్పెస్ట్ చాలా బాగుంది

 

బ్రాండ్ పేజీల కోసం ఫేస్‌బుక్ కొత్తగా ప్రవేశపెట్టబడిన ఫేస్‌బుక్ టైమ్‌లైన్ ఫీచర్‌ని, బ్రాండ్లు కొన్ని తమయొక్క చారిత్రక అభిప్రాయాల కోసం ఉపయోగించుకున్నాయి. ఇందులో మొదటగా 134 సంవత్సరాల చరిత్ర కలిగిన మాంచెస్టర్ యునైటెడ్ యొక్క పేజీని కొత్త కంటెంట్‌తో పాటు 300 ముక్కలతో 18 భాషలలో విడుదల చేసింది. అందం ఉత్పత్తులు సంస్థ డోవ్ 1957నుండి దాని దశలను బ్రాండ్ పేజీల రూపంలో విడుదల చేయగా... 1856లో ప్రారంభమైన బుర్బెర్రీ టైమ్ మెషిన్ కూడా ఫేస్‌బుక్ టైమ్‌లైన్ ఫీచర్‌లో ఉన్నాయి.

వీటన్నింటితో పాటు మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వంద సంవత్సరాల చరిత్ర కలిగిన 'ది న్యూయార్క్ టైమ్స్' కూడా తన చరిత్రను తెలియజేస్తూ పేజిని ఫేస్‌బుక్‌లో రూపొందించింది. ఈ పేజి ప్రకారం టైమ్స్ 'తాజా వార్తలు మరియు ఫీచర్స్ హబ్' గా మారింది. 1851లో న్యూయార్క్ డైలీ టైమ్స్‌గా పబ్లికేషన్‌ని మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన కొన్ని ఈవెంట్స్‌ని ఇందులో పొందుపరిచింది.

'ఫేస్‌బుక్ పేజీ బ్రాండ్ పేజీ' కాన్పెస్ట్ చాలా బాగుంది

ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఆదివారం ఎడిషన్ ప్రారంభించిన సమాచారంతో పాటు ఏప్రిల్ 15, 1865 అమెరికా అధ్యక్షుడు లింకన్ హత్యకు గురైన మొదటి పేజీని కూడా చూస్తారు. నిజంగా ఇది ఫేస్‌బుక్ అభిమానులకు ఆశ్చర్యమే. అమెరికాలో ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలను ఇప్పుడు మన కళ్లకు కట్టినట్లు చూపించడం మామూలు విషయం కాదు. నిజంగా ఫేస్‌బుక్ టైమ్‌లైన్ ఫీచర్ ఫేస్‌బుక్‌ని మరింత అందలానికి తీసుకెళ్తుందని టెక్నాలజీ నిపుణులు భావిస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot