నాలుగేళ్లు పూర్తి చేసుకున్న డిజిటల్ ఇండియా, తరువాత ఏంటీ ?

By Gizbot Bureau
|

సరిగ్గా నాలుగేళ్ల క్రితం ప్రధాని నరేంద్రమోడీ డిజిటిల్ ఇండియా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అది ఎన్నో విజయాలను సాధించింది. ఇప్పటికే చాలా చోట్ల డిజిటల్ ఇండియా విజయవంతంగా దూసుకుపోతోంది. గ్రామాలు సైతం డిజిటల్ విప్లవం వైపు అడుగులు వేశాయి.

The next step in India’s digital revolution is digitizing govt processes

డిజిటల్‌ ఇండియా కార్యక్రమం ప్రారంభించి 4 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా మోడీ అనేక విషయాలను ప్రజలతో పంచుకున్నారు. డిజిటల్‌ ఇండియా'తో ప్రజలకు సాధికారత సిద్ధిస్తుందని, అవినీతి అడ్డుకట్ట పడుతోందని, దీని ద్వారా పేదలకు ప్రజా సేవలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

  డిజిటల్‌ ఇండియా బలోపేతం

డిజిటల్‌ ఇండియా బలోపేతం

'సాంకేతిక శక్తిని పెంపొందించేందుకు, సాంకేతికతను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు 4 సంవత్సరాల క్రితం డిజిటల్‌ ఇండియా ప్రారంభించాం. 'డిజిటల్‌ ఇండియా' ప్రజలను మరింత సాధికారికత వైపు నడిపించనుంది. అవినీతి గణనీయంగా తగ్గించనుంది. పేదలకు ప్రయోజనం చేకూర్చేలా ప్రజా సేవలు మరింత మెరుగుపడనున్నాయి' అని ట్వీట్‌ చేశారు.
డిజిట్‌ ఇండియా ప్రారంభం ప్రజల ఉద్యమమని, నేర్చుకోవడానికి, ఆవిష్కరించడానికి ప్రజలకు మరింత బలాన్నిస్తుందని, డిజిటల్‌ ఇండియాను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న వారందరికీ సెల్యూట్‌ చేస్తున్నానని ట్విట్‌ చేశారు. దేశాన్ని డిజిటల్‌ సాధికారికత దిశగా తీసుకెళ్లే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని జులై 1, 2015లో మోడీ ప్రారంభించారు.

 3.65 లక్షల సేవా కేంద్రాలు

3.65 లక్షల సేవా కేంద్రాలు

ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తుందని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ డిజిటల్‌ ఇండియా ద్వారా 3.65 లక్షల సేవా కేంద్రాలు ప్రారంభమయ్యాయని, 123 కోట్ల ఆధార్‌ జారీ చేశారని అన్నారు. డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా రూ. 7.45 కోట్ల నగదు బదిలీ అయిందని పేర్కొన్నారు.

ఆర్బీఐ నిర్ణయం

ఆర్బీఐ నిర్ణయం

జులై 1 నుంచీ ఆన్‌లైన్ మనీ ట్రాన్స‌క్షన్లపై ఛార్జీలు ఎత్తివేసింది రిజర్వ్‌బ్యాంక్. నెఫ్ట్, ఆర్టీజీఎస్ లావాదేవీలపై రుసుము వసూలు చేయవద్దని ఆదేశించింది. ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడం, నగదు లావాదేవీలు తగ్గించడం, డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఛార్జీలను రద్దు చేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఇండియాని డిజిటల్ రంగంలో దూసుకెళ్లేలా చేసేందుకు తీసుకునే నిర్ణయాల్లో ఇదీ ఒకటిగా చెప్పుకోవచ్చు.

అంతా ఆన్‌లైన్‌ మయం

అంతా ఆన్‌లైన్‌ మయం

ప్రస్తుతం ఇండియాలో ప్రతీ పౌరుడూ డిజిటల్ సర్వీసులు అందుకుంటున్నారు. సిమ్ కార్డ్ కావాలంటే ఆన్‌లైన్‌లో ఫామ్ ఫిలప్ చెయ్యవచ్చు. కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చెయ్యాలంటే బ్యాంకుకి వెళ్లాల్సిన పనిలేదు. ఆధార్‌తో కూడిన E-KYC విధానంలో మొబైల్ సిమ్ ద్వారా బ్యాంక్ అకౌంట్ తెరుస్తున్నారు. ప్రావిడెంట్ ఫండ్ కూడా... ఆధార్‌తో కూడిన యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ద్వారా ఈజీగా పొందేందుకు వీలవుతోంది.

ఈ-హాస్పిటల్ సర్వీసుల

ఈ-హాస్పిటల్ సర్వీసుల

దేశంలోని 322 మేజర్ హాస్పిటల్స్‌ ఈ-హాస్పిటల్ సర్వీసులను అందిస్తున్నాయి. అలాగే 18 రాష్ట్రాల్లోని 362 కేంద్ర సేవలు... 13 భాషల్లో అందుబాటులోకి వచ్చాయి. ఆన్‌లైన్ స్కాలర్‌షిప్స్, ఈ-సేవ, సాయిల్ హెల్త్ కార్డులు... ఇలా అన్నీ డిజిటల్ సేవలతో లింక్ అవుతున్నాయి.

 ఇంకా చెయ్యాల్సింది చాలా ఉంది.

ఇంకా చెయ్యాల్సింది చాలా ఉంది.

అన్ని ప్రభుత్వ కార్యాలయాల్నీ డిజిటలైజేషన్ చెయ్యాలి. ప్రభుత్వంతో ముడిపడిన అన్ని పనులకూ పేపర్ వర్క్‌ని పూర్తిగా రద్దు చెయ్యాలన్న టార్గెట్ ఉంది. ఆ దిశగా కేంద్రం చర్యలు తీసుకోబోతోంది. అలాగే ప్రతి ఒక్కరికీ డిజిటల్ లాకర్ సదుపాయం, వ్యక్తిగత సమాచార భద్రత కల్పించబోతోంది. వాట్సాప్ స్థానంలో దేశీయంగా ఓ యాప్ తయారుచేయించబోతోంది. స్కిల్ డెవలప్‌మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోనుంది.

Best Mobiles in India

English summary
The next step in India’s digital revolution is digitizing govt processes

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X