Home
News

ANC టెక్నాలజీ, సరికొత్త డయాఫ్రాంతో ఒప్పో ఎన్‌కో ఎయిర్‌3 ప్రో ఇయర్‌బడ్స్‌ విడుదల

OPPO Enco Air3 Pro

ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ యుగంలో పర్యావరణ హిత పదార్ధాల వినియోగం ద్వారా అందుబాటులోకి వస్తున్న ఉత్పత్తులు చాలా అరుదు. అయితే Oppo Enco Air 3 Pro వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌లో డ్రైవర్‌ ప్లేట్‌ల కోసం టైటానియం బదులుగా సహజ వెదురు ఫైబర్‌ డయాఫ్రాంను ఉపయోగించారు. ఆడియో అవుట్‌పుట్‌లో ఎటువంటి రాజీపడలేదు. అదే శ్రేణి ఇయర్‌బడ్స్‌తో పోలిస్తే ఇందులో మెరుగైన పనితీరు కనిపిస్తుంది.

ఒప్పో నుంచి వస్తున్న ఇయర్‌బడ్స్‌ చాలా కాలంగా మెరుగైన పనితీరుకు ప్రతీకగా నిలుస్తున్నాయి. అందువల్ల సాధారణంగా నిర్వహించే పరీక్షల కంటే ఈ ఇయర్‌బడ్స్‌కు ఎక్కువ పరీక్షలు నిర్వహించారు. ఒప్పో ఎన్‌కో ఎయిర్‌ 3 ప్రో పనితీరు గురించి మాట్లాడే ముందు దీని టెక్నాలజీ గురించి కొంచెం చెప్పుకోవాలి.

OPPO Enco Air3 Pro

ప్రపంచంలోనే తొలిసారిగా ఒప్పో ఎన్‌కో ఎయిర్‌ 3 ప్రో సహజ వెదురు ఫైబర్‌ డయాఫ్రాంను కలిగి ఉంది. పురాతన కాలంలో ఉపయోగించిన పేపర్‌ తయారీ విధానం నుంచి ఇది ప్రేరణ పొందింది. ఇయర్‌బడ్స్‌లో సాంప్రదాయ టైటానియం టయాఫ్రాంలతో పోలిస్తే తాజా ఒప్పో ఎన్‌కో ఇయర్‌3 మెరుగైన ఆడియోను ఉత్పిత్తి చేస్తుంది. ప్రత్యేకించి అధిక ఫ్రీక్వెన్సీ రేంజ్‌లోనూ మంచి పనితీరును కనబరుస్తుంది.

OPPO Enco Air3 Pro

సాధారణంగా ఉపయోగించే SBC ఎన్‌కోడర్‌ కంటే మూడు రెట్లు వేగమైన ఆడియో ట్రాన్సిమిషన్‌కు సపోర్ట్‌ చేసే LDAC ఎన్‌కోడర్‌ సాయంతో ఒప్పో ఎన్‌కో ఎయిర్‌ 3 ప్రో మెరుగైన పనితీరు, ఆడియో నాణ్యతను కలిగి ఉంటుంది. సంగీతంలోని చిన్న చిన్న ధ్వని శబ్ధాలను సైతం స్పష్టంగా వినివచ్చు.

ఒప్పో ఎన్‌కో ఎయిర్‌ 3 ప్రో హియరింగ్‌ ప్రొఫైల్‌ మ్యాపింగ్‌ అనంతరం ఎన్‌కో ఎయిర్‌ 3 ప్రో.. ఒప్పో అలైవ్‌ ఆడియోను యాక్టివేట్‌ చేస్తుంది. ఫలితంగా ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ ఇయర్‌బడ్స్‌ ఒప్పో ఫోన్‌కు కనెక్ట్‌ చేస్తే.. మరింత మధురమైన, సంగీతంలో లీనమైన అనుభూతిని పొందుతారు.

OPPO Enco Air3 Pro

ఒప్పో తాజా ఇయిర్‌బడ్స్ ఎన్‌కో ఎయిర్‌ 3 ప్రోలో మరో ప్రత్యేకత ఉంది. అవసరం లేని శబ్దాలను నియంత్రించేందుకు 49dB అడాప్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ వ్యవస్థ ఉంటుంది. ఈ వ్యవస్థ పరిసరాలు బట్టి ఆటోమేటిక్‌గా నాయిస్‌ను నియంత్రిస్తుంది. ఆడియో నాణ్యతను మెరుగుపరుస్తుంది.

మరియు గాలి శబ్ధాన్ని నియంత్రించేందుకు విండ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఆల్గారిథమ్‌ను కలిగి ఉంటుంది. పరసరాల శబ్దాలను మెరుగుపరిచే పనితీరును ఈ ఆల్గారిథమ్‌ కలిగి ఉంటుంది. సంగీతం వింటున్నప్పుడు లేదా ఫోన్‌ కాల్‌ మాట్లాడుతున్న సమయంలో నాయిస్ క్యాన్సిలేషన్‌ ఫీచర్ అనవసర శబ్దాలను నియంత్రిస్తుంది.

OPPO Enco Air3 Pro

మరొక అద్భుతమైన ఫీచర్ ఎన్‌కో ఎయిర్‌ 3 ప్రో సొంతం.. రెండు వేర్వేరు డివైస్‌లతో ఈ ఇయర్‌బడ్స్‌ను కనెక్ట్ చేయవచ్చు. ఒక డివైస్‌ నుంచి మరొక డివైస్‌ను కనెక్ట్‌ చేయడం లేదా డిస్‌కనెక్ట్ చేయడం చాలా సులభం. ఒక డివైస్‌లో మ్యూజిక్ లేదా వీడియోను ప్లే, పాజ్‌, మ్యూట్‌ చేయడం కూడా చాలా సులభం. మరియు మరో డివైస్‌లో సంగీతం లేదా వీడియోను కొనసాగించవచ్చు.

OPPO Enco Air3 Pro

ఒప్పో ఎన్‌కో ఎయిర్‌3 ప్రో ఇయర్‌బడ్స్‌ కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో రెండు గంటలపాటు సంగీతం వినవచ్చు. ఇయర్‌బడ్స్‌ గరిష్టంగా 7 గంటలపాటు ప్లేటైం మరియు ఛార్జింగ్‌ కేస్‌ 30 గంటలపాటు ప్లేటైం ఇస్తుంది. మరియు గ్రేడియంట్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

47ఎంఎస్‌ ఇయర్‌ఫోన్‌ లేటెన్సీ, 94ఎంఎస్‌ ఎండ్‌ టు ఎండ్‌ లేటెన్సీతో పాటు బ్లూటూత్‌ 5.3ను సపోర్టు చేస్తుంది. ఇది గేమ్ ఆడుతున్న సమయంలో మరింత లీనమయ్యేలా చేస్తుంది. ఎన్‌కో ఎయిర్‌ 3 ప్రో కంపాక్ట్‌గా ఉంటుంది. మరియు డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌లో IP55 రేటింగ్‌ను కలిగి ఉంటుంది.

OPPO Enco Air3 Pro

ఒప్పో ఎన్‌కో ఎయిర్‌3 ప్రో ఇయర్‌బడ్స్‌ మెరుగైన ఆడియో నాణ్యతను అందిస్తాయి. వెదురు ఫైబర్‌ డయాఫ్రాం. అడాప్టివ్‌ ANC, LDAC సపోర్టు, మల్టీ డివైస్‌ సపోర్టు, నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఆల్గారిథమ్‌ వంటి అనేక ఫీచర్లు ఇందుకు దోహదం చేస్తాయి. భారత్‌లో ఒప్పో ఎన్‌కో ఎయిర్‌ 3 ఫ్రో ఇయర్‌బడ్స్‌ రూ.4999కు విడుదల చేయబడ్డాయి. ఒప్పో స్టోర్లు, రిటైల్‌ అవుట్‌లెట్‌లు సహా అమెజాన్‌, ఫ్లిప్‌కార్టులో అందుబాటులో ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
OPPO Enco Air3 Pro With its Bamboo Fibre Diaphragm Should be Your Next TWS
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X