స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో ఆపిల్-గూగుల్‌ల మధ్య పోటీ

Posted By: Staff

స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో ఆపిల్-గూగుల్‌ల మధ్య పోటీ

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఆపిల్, గూగుల్, రీసర్చ్ ఇన్ మోషన్ ‌(రిమ్) కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ విషయాన్ని నీల్సన్ సర్వే వెల్లడించింది. ఆపిల్ మరియు గూగుల్‌లు స్మార్ట్‌ఫోన్ల తయారీలో తమ సొంత ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుండగా, ఇతర స్మార్ట్‌ఫోన్ల తయారీలో గూగుల్‌కు చెందిన ఆన్డ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను వినియోగిస్తున్నారు. అలాగే, ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్‌లో ఆన్డ్రాయిడ్ 29 శాతం, రిమ్ బ్లాక్‌బెర్రీ 27 శాతం, ఆపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ 27 శాతం కలిగియున్నాయి. విశ్లేషణ ప్రకారం తమ సొంత ఆపరేటింగ్ సిస్టమ్‌లను వినియోగించి స్మార్ట్‌ఫోన్ల తయారీ చేసి విక్రయించడంలో రిమ్ మరియు ఆపిల్ సంస్థలు ముందున్నాయి.

సర్వే ప్రకారం ఆన్డ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగిన స్మార్ట్‌ఫోన్‌లను 12శాతం మంది వినియోగిస్తుండగా మైక్రోసాప్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్‌లను 7శాతం మంది వినియోగిస్తున్నారని తెలిసింది. ఆన్డ్రాయిడ్ కలిగిన మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం 10 శాతం కాగా మైక్రోసాప్ట్ ఓయస్ కలిగిన వాటి వాటా కేవలం ఒక్క శాతం మాత్రమే. ఆన్డ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 10 శాతం స్మార్ట్‌‌ఫోన్లలో వినియోగించే నోకియాకు చెందిన సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్ లభించే ధరకే లభిస్తుంది.

తన ఆపరేటింగ్ సిస్టమ్ ఆన్డ్రాయిడ్, ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లతో పోటీపడలేకపోవటంతో నోకియా మైక్రోసాప్ట్‌తో విండోస్ పోన్7 ఉపయోగించుకోవడానికి ఒప్పందం కుదుర్చుకుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సహాయంతో నోకియా స్మార్ట్‌ఫోన్ల మార్కట్‌లో నంబర్ వన్ స్థానం కోసం పోటీపడుతున్నది. గత సంవత్సరంతో పోలిస్తే 2.4 శాతం అమ్మకాలు తగ్గినప్పటికి 123.7 మిలియన్ యూనిట్లు అమ్మిన నోకియా మొబైల్ పోన్ల అమ్మకాలలో ఈ సంవత్సరం కూడా మొదటి స్థానంలో నిలిచింది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot