2016లో సంచలనం రేపిన 4జీ డేటా, వాయిస్ ప్లాన్స్

స్మార్ట్‌ఫోన్‌ల విభాగానికి సంబంధించి ఈ ఏడాది సంచలన రేపిన విషయాల్లో 4జీ మొబైల్ నెట్‌వర్క్ ఒకటి. ముఖ్యంగా రిలయన్స్ జియో రాకతో భారత్ లో 4జీ మార్కెట్ స్వరూపమే మారిపోయింది.

2016లో సంచలనం రేపిన 4జీ డేటా, వాయిస్  ప్లాన్స్

Read More : లక్కీ గ్రాహక్ యోజన, 15,000 మంది విజేతలు

భారీ వ్యయంతో జియో లాంచ్ చేసిన 4జీ వోల్ట్ నెట్‌వర్క్ ఇతర టెల్కోలకు ముచ్చెమటలు పట్టించింది. మార్కెట్లోకి వస్తూవస్తూనే ఉచిత ఆఫర్లతో దూసుకొచ్చిన జియో 4జీ టారిఫ్ రేట్లను ఒక్కసారిగా మట్టానికి పడేసింది. దీంతో జియోతో పోటీ పడే క్రమంలో ఇతర టెల్కోలు 4జీ రేట్లను తగ్గించక తప్పలేదు. 2016కుగాను ఇండియన్ మార్కెట్లో సంచలనం రేపిన 4జీ డేటా, వాయిస్ ప్లాన్స్‌ను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రిలయన్స్ జియో ప్లాన్స్

100జీబి స్టోరేజ్‌తో Asus 4జీ ఫోన్‌, రూ.6,999కే

సెప్టంబర్ 1, 2016న మార్కెట్లో లాచ్ అయిన రిలయన్స్ జియో రూ.150 - రూ.5,000 మధ్య 10 ఆసక్తికర ప్లాన్‌లను మార్కెట్లో అనౌన్స్ చేసింది. వాయిస్ కాల్స్‌ను ఉచితంగా అదించటంతో పాటు, 1జీబి డేటాను కేవలం రూ.50కే ఆఫర్ చేస్తూ జియో నూతన శకానికి నాంది పలికింది. ప్రస్తుతానికి జియో యూజర్లు మార్చి 31, 2017 వరకు రిలయన్స్ ఉచిత బెనిఫిట్లను పొందే అవకాశం ఉంది.

ఎయిర్‌‍టెల్ అన్‌లిమిటెడ్ 4జీ డేటా

రిలయన్స్ జియో అనౌన్స్ మెంట్ తరువాత ఎయిర్‌‍టెల్ సరికొత్త 4జీ ప్లాన్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది. ఈ ప్లాన్‌లో భాగంగా రూ.1,495 చెల్లించి 90 రోజుల పాటు అపరిమితంగా 4జీ డేటాను ఉపయోగిచుకోవచ్చు. ఇదేకాకుండా మెగా సేవర్ పేరుతో మరో ప్యాక్‌ను ఎయిర్‌‍టెల్ లాంచ్ చేసింది. ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్ రూ.1,498 చెల్లించినట్లయితే 1జీబి 3జీ లేదా 4జీ డేటా 28 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది. ఈ డేటా పూర్తి అయిన నాటి నుంచి 1జీబి డేటా రూ.51 లభిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.145 ప్లాన్

రూ.9,999 నోకియా ఫోన్‌లో 4జీబి ర్యామ్..?

జియోతో పోటీపడే క్రమంలో ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ ఖాతాదారుల కోసం రెండు సరికొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఎయిర్‌టెల్ లాంచ్ చేసిన రూ.145 ప్లాన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ - ఎయిర్‌టెల్ కాల్స్ ఉచితం. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్యాక్‌లో భాగంగా 300 ఎంబీ 4జీ డేటాను కూడా ఎయిర్‌టెల్ ఆఫర్ చేస్తుంది. మీరు 4జీ యూజర్ కాకపోయినట్లయితే 50MB డేటా మాత్రమే మీకు లభిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.345 ప్లాన్‌

ఎయిర్‌టెల్ లాంచ్ చేసిన రూ.345 ప్లాన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కు అయినా 28 రోజుల పాటు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. ఎటువంటి రోమింగ్ ఛార్జీలు ఉండవు. ఈ బండిల్డ్ ప్లాన్ లో భాగంగా 1జీబి 4జీ డేటాను యూజర్ పొందగలుగుతారు.

బీఎస్ఎన్ఎల్ రూ.249 ప్లాన్

రెండు బ్యాటరీలతో చైనా ఫోన్ సంచలనం

రిలయన్స్ జియోకు పోటీగా బీఎస్ఎన్ఎల్ ఇటీవల BB 249 అన్‌లిమిటెడ్ ఉచిత ఇంటర్నెట్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా నెల మొత్తం మీద 300జీబి ఇంటర్నెట్‌ను వాడుకునే అవకాశంతో పాటు ఉచిత కాలింగ్ అందుబాటులో
ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న BB 249 పూర్తిగా అన్‌లిమిటెడ్. ఈ ప్లాన్‌లో భాగంగా బ్రౌజింగ్, డౌన్‌లోడింగ్, అప్‌లోడింగ్, కాలింగ్ అన్ని అన్‌లిమిటెడ్. బీఎస్ఎన్ఎల్ BB 249 ప్లాన్‌లో భాగంగా యూజర్‌కు నెల మొత్తం మీద వర్తించే 300జీబి ఇంటర్నెట్‌‌లో భాగంగా మొదటి 1జీబి వరకు 2 Mbps వేగం వర్తిస్తుంది. FUP లిమిట్ దాటిన తరువాత స్పీడ్ 1 Mbpsకు పడిపోతుంది. BB 249 ప్లాన్‌‌ను ఎంపిక చేసుకున్న బీఎస్ఎన్ఎల్ కొత్త కస్టమర్లు మొదటి 6 నెలలు పాటు నెలవారి చెల్లించే బిల్లు ట్యాక్సులతో కలుపుకుని రూ.287గా ఉంటుంది. BB 249 ప్లాన్‌‌లో ఉన్న యూజర్లు ఆదివారాలు రోజంతా ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా ఫోన్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. మిగతా రోజుల్లో రాత్రి తొమ్మిది నుంచి మరుసటి రోజు ఉదయం ఏడు గంటల వరకు ఉచితంగా ఫోన్‌ చేసుకునేందుకు అనుమతిస్తారు.

 

బీస్ఎన్ఎల్ రూ.149

మొబైల్ నెట్‌వర్క్ విభాగంలో వ్యూహాత్మక అడుగలతో ముందుకుసాగుతోన్న ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీస్ఎన్ఎల్ ఇటీవల రూ.149 ప్లాన్‌ను అనౌన్స్ చేసి ప్రత్యర్థులకు గట్టి షాకే ఇచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా బీఎస్ఎన్ఎల్ యూజర్లు నెల రోజలు పాటు దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కు అయినా ఉచిత కాల్స్ చేసుకునే వీలుంటుంది. ఇదే సమయంలో ఇంటర్నెట్‌ను కూడా ఉచితంగా పొందవచ్చు.

వొడాఫోన్ ఆఫర్స్

భారత దేశపు రెండవ అతిపెద్ద టెలికం నెట్‌వర్క్ ఆపరేటర్ అయిన వొడాఫోన్ రిలయన్స్ జియో దెబ్బకు దిగరాక తప్పలేదు. తాజాగా లాంచ్ చేసిన కొత్త ప్లాన్‌లో భాగంగా 1జీబి 3జీ/4జీ డేటాను రూ.55కే వొడాఫోన్ ఆఫర్ చేస్తుంది. ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలంటే..? ఈ ఆఫర్‌ను పొందాలనుకునే యూజర్లు ముందుగా రూ.1499 పెట్టి రీఛార్జ్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ రీఛార్జ్ ప్యాక్‌ను ఎక్కడి నుంచైనా పొందవచ్చు. రీఛార్జ్ విజయవంతమైన వెంటనే మీ వొడాఫోన్ అకౌంట్ లో 15జీబి 3జీ/4జీ డేటా జమవుతుంది. 28 రోజుల వ్యాలిడిటీ లోపల ఈ డేటాను వినియోగించుకోవల్సి ఉంటుంది. ఆ తరువాత నుంచి మీరు చేసుకునే ప్రతి రూ.55 రీఛార్జ్‌తో 1జీబి 3జీ/4జీ డేటాను పొందవచ్చు. 28 రోజుల వ్యాలిడిటీతో ఈ డేటా మీకు లభిస్తుంది.

వొడాఫోన్ వాయిస్ ప్లాన్స్..

ప్రపంచమంతా ఇంటర్నెట్ బంద్!

వొడాఫోన్ తన 2జీ, 3జీ, 4జీ ప్రీపెయిడ్ కస్టమర్స్ కోసం రెండు సరికొత్త అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ డేట్ ప్లాన్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది. మొదటి ప్లాన్ విలువ సర్కిల్‌ను బట్టి రూ.144 - రూ.149 రేంజ్‌లో అందుబాటులో ఉంటుంది. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా వొడాఫోన్ - వొడాఫోన్ మధ్య 28 రోజుల పాటు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. ఎటువంటి రోమింగ్ ఛార్జీలు ఉండవు, ఇన్‌కమింగ్ కాల్స్ పూర్తిగా ఉచితం. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ వాయస్ కాల్స్‌తో పాటు 300 ఎంబి 4జీ డేటాను కూడా వొడాఫోన్ అందిస్తోంది.

ఐడియా 4జీ ఆఫర్స్

రిలయన్స్ జియోకు పోటీగా ఐడియా సరికొత్త 4జీ ఆఫర్లను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ప్రత్యేకమైన టారిఫ్ ప్లాన్‌లో భాగంగా 1జీబి 4జీ డేటాను ఏడాది పాటు రూ.51కే పొందవచ్చు. ఈ సరికొత్త టారిఫ్ ప్లాన్‌ను ఆస్వాదించే క్రమంలో ముందుగా మీ ఐడియా నెంబర్ను రూ.1,499కే రీఛార్జ్ చేసుకోవల్సి ఉంటుంది. రీఛార్జ్ విజయవంతమైన వెంటనే మీ నెంబర్‌కు 6జీబి 4జీ డేటా క్రెడిట్ అవుతుంది. మరసటి రీఛార్జ్ నుంచి మీరు రూ.51 (ఎంపిక చేసిన సర్కిళ్లలో) చెల్లించినట్లయితే 30 రోజుల వ్యాలిడిటీతో కూడిన 1జీబి 4జీ డేటా మీకు లభిస్తుంది. ఇలా ఏడాది పాటు ఎన్నిసార్లు మీరు రూ.51(ఎంపిక చేసిర సర్కిళ్లలో) పెట్టి రీఛార్జ్ చేయించినా 30 రోజుల వ్యాలిడిటీతో కూడిన 1జీబి 4జీ డేటా మీకు లభిస్తూనే ఉంటుంది. తమిళనాడు, చెన్నై, పంజాబ్, ఒరిస్సా, మాహారాష్ట్రా, గోవా, కేరళ, హర్యానా సర్కిళ్లలోని ఐడియా యూజర్లు రూ.51 చెల్లించినట్లయితే 4జీ డేటా లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఐడియా యూజర్లు రూ.52 పెట్టి రీఛార్జ్ చేయించాల్సి ఉంటుంది. కర్ణాటక ఇంకా ఈశాన్య ప్రాంతాలకు చెందిన ఐడియా యూజర్లు రూ.48 చెల్లించటం ద్వారా 30 రోజుల వ్యాలిడిటీతో కూడిన 1జీబి 4జీ డేటాను పొందవచ్చు.

ఐడియా సెల్యులార్ వాయిస్ కాలింగ్

పోటీ మార్కెట్ నేపథ్యంలో ఐడియా సెల్యులార్ రెండు సరికొత్త అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ప్లాన్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది. రూ.148 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఐడియా - ఐడియా కాల్స్ ఉచితం. ఈ బండిల్డ్ ప్యాక్‌లో భాగంగా 300 ఎంబీ 4జీ డేటాను కూడా యూజర్ పొందే అవకాశం.

ఆర్‌కామ్ నుంచి..

అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ తన ప్రీపెయిడ్ ఖాతాదారుల కోసం రూ.148 రీఛార్జ్ ప్యాక్‌‌ను మార్కెట్లో పరిచయం చేసింది. ఈ ప్లాన్‌లో భాగంగా ఏ నెట్‌వర్క్‌కు అయినా కాల్స్ చేసుకోవచ్చు. ఈ బండిల్డ్ ప్లాన్‌లో భాగంగా 300 ఎంబి డేటాను కూడా రిలయన్స్ ఆఫర్ చేస్తోంది. ఈ డేటా బెనిఫిట్స్ అనేవి 2జీ, 3జీ, అలానే 4జీ యూజర్లకు వర్తిస్తాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Value for Money 4G Internet And Voice Plans introduced in 2016.Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot