భారత్‌లో లీఇకో SuperTVలకు భారీ స్పందన

లీఇకో సూపర్ టీవీలకు భారత్ మార్కెట్లో అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఈ టీవీలు మార్కెట్లో లాంచ్ అయిన నెలరోజులు పైనే కావస్తోంది.

భారత్‌లో లీఇకో  SuperTVలకు భారీ స్పందన

Read More : లేటెస్ట్ : మీ ఫోన్ Jio 4Gని సపోర్ట్ చేస్తుందో లేదో ఇక్కడ చెక్ చేసుకోండి

బిగ్ స్ర్కీన్ టీవీల విభాగంలో LeEco's సూపర్ 3 సిరీస్ టీవీలకు ఆన్‌లైన్ షాపర్లు బ్రహ్మరథం పడుతున్నారు. కంపెనీ ఇంటర్నల్ సర్వే ప్రకారం 50 ఇంచ్ ఆ తరువాతి వర్షన్ టీవీల విభాగంలో 40శాతం మార్కెట్ వాటాను లీఇకో సొంతం చేసుకున్నట్లు స్పష్టమైంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నెల రోజుల వ్యవధిలో

నెల రోజుల వ్యవధిలో చోటుచేసుకున్న SuperTVల అమ్మకాలు, లీఇకోను ఇండియన్ ఆన్‌లైన్ స్మార్ట్‌‌టీవీ మార్కెట్ విభాగంలో నెం1 స్థానంలో నిలబెట్టాయి. 4కే టీవీల విభాగంలోనూ లీఇకో నెం.1 స్థానాన్ని సొంతం చేసుకోగలిగింది.

ఉచిత మెంబర్ షిప్ ప్రోగ్రామ్‌

సూపర్ 3 సిరీస్ టీవీల పై రూ.9,800 విలువ చేసే రెండు సంవత్సరాల ఉచిత మెంబర్ షిప్ ప్రోగ్రామ్‌ను లీఇకో ఆఫర్ చేస్తోంది. ఈ మెంబర్‌షిప్‌ను పొందటం ద్వారా 2000 హైడెఫినిషన్ క్వాలిటీ సినిమాలతో పాటు 100కు పైగా శాటిలైట్ టీవీ ఛానళ్లు, 3.5 మిలియన్ల పాటలు, 50కు పైగా live concertsలను ఆస్వాదించవచ్చు. 5TB క్లౌడ్ స్టోరేజ్ స్పేస్‌ కూడా అందుబాటులో ఉంటుంది.

 

టీవీల ధరలను పరిశీలించినట్లయితే..

సూపర్3 ఎక్స్55, సూపర్3 ఎక్స్65, సూపర్3 మాక్స్65 మోడల్స్‌లో విడుదలైన లీఇకో సూపర్ టవీల ధరలను పరిశీలించినట్లయితే.. LeEco Super3X55 మోడల్ ధర రూ.59,790. LeEco Super3 X65 మోడల్ ధర రూ.99,790. LeEco Super Max65 (3డీ డిస్ ప్లే) మోడల్ ధర రూ.1,49,790.

 

రూ.9,800 విలువ చేసే

వీటి కొనుగులు పై రూ.9,800 విలువ చేసే రెండు సంవత్సరాల లీఇకో మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ఉచితంగా ఆఫర్ చేస్తున్నారు.

 

రెండు సంవత్సరాల ప్రొడక్ట్ వారంటీతో పాటు

తన SuperTVల పై రెండు సంవత్సరాల ప్రొడక్ట్ వారంటీతో పాటు 4 సంవత్సరాల ప్యానల్ వారంటీని లీఇకో ఆఫర్ చేస్తోంది.

దేశవ్యాప్తంగా 333 సేల్ సర్వీస్ పాయింట్లు

లీఇకో దేశవ్యాప్తంగా 333 సేల్ సర్వీస్ అవుట్‌లెట్‌లను కలిగి ఉంది. కాబట్టి సర్వీసింగ్ విషయంలో ఎటువంటి సమస్యలు ఉండవు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The triumphant progress of LeEco SuperTV in India. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot