ఫేస్‌బుక్‌లో ఇరువురి మద్య మంచి సాన్నిహిత్యం..!!

Posted By: Staff

ఫేస్‌బుక్‌లో ఇరువురి మద్య మంచి సాన్నిహిత్యం..!!

అమెరికన్స్, బ్రటిష్ వారికి ఫేస్‌బుక్‌లో కామన్‌గా ప్రెండ్స్ ఎవరున్నారో ఆలోచించండి. వీరిద్దరికి(అమెరికన్స్, బ్రటిష్) కూడా ప్రపంచంలో ఉన్న వేరే దేశాల వ్యక్తులతో పొల్చితే ఫేస్‌బుక్‌లో ఇండియన్సే స్నేహితులుగా ఎక్కవగా మంది ఉన్నట్లు తెలిసింది. ఈ సంవత్సరం జులైలో ప్రపంచ వ్యాప్తంగా ఓ అప్లికేషన్‌ని ఫేస్‌బుక్ విడుదల చేసి అందులో సుమారు 225,000 జనాభా డేటాని సేకరించింది.

ఈ డేటాలో యునైటెడ్ కింగ్‌డమ్(లండన్)లో ఉన్న ఫేస్‌బుక్ యూజర్స్‌కు 11%శాతం మంది స్నేహితులు ఇండియాకి చెందిన వారే ఉన్నారు. ఒక్కో వ్యక్తికి యావరేజిగా తీసుకుంటే తన ఫేస్‌బుక్ ఎకౌంట్లో 34మంది స్నేహితులు ఇండియాకి చెందిన వారున్నారన్నమాట. అదే లండన్ ఫేస్‌బుక్ యూజర్స్‌కు మాత్రం అమెరికన్స్ యావరేజిగా 26మంది స్నేహితులు ఉన్నట్లు తెలిసింది. దీనిని బట్టి ఏమి తెలిసిందంటే బ్రిటిష్ వారికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాభాలో ఇండియా, నార్త్ అమెరికాల నుండి ఎక్కువ మంది పేస్‌బుక్ యూజర్ ప్రెండ్స్ ఉన్నట్లు తెలిసింది.

అదే విధంగా అమెరికాకు చెందిన ఫేస్‌బుక్ యూజర్స్‌కు 10.2శాతం మంది స్నేహితులు ఇండియా నుండి ఉండగా, 3.8శాతం మంది స్నేహితులు లండన్ నుండి ఉన్నట్లు తెలిసింది. దీనికి అంతటికి కారణం లండన్, అమెరికన్స్‌కి ఇండియాతో బిజినెస్ సంబంధాలు మెండుగా ఉండడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే కాబోలు ఇండియాలో ఉన్న విద్యార్దులు వారియొక్క పైచదువులకు గాను ఎక్కువగా లండన్, అమెరికా దేశాలను ఎంచుకొవడం జరుగుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot