'IE6' కి గుడ్ బాయ్ చెప్పే దిశగా అమెరికా..

మైక్రోసాప్ట్ అందించిన సమాచారం ప్రకారం పాపులర్ 'ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 6' మార్కెట్లోకి వచ్చి ఇప్పటికి 10 సంవత్సరాలు కావస్తుడడంతో 'ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 6' కి గుడ్‌బాయ్ చెప్పాలని నిర్ణయం తీసుకుంది. ఇది మాత్రమే కాకుండా 'ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ టీమ్' తెలిపిన విషయం ఏమిటంటే 'ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 6' బ్రౌజర్‌ని వాడే వారి సంఖ్య కూడా బాగా తగ్గిందన్నారు.
'ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ టీమ్' బ్లాగులో పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం అమెరికాలో 'ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 6' బ్రౌజర్ వాడే వారి సంఖ్య 1 శాతానికి పడిపోయిందని అన్నారు. కేవలం ఒక్క అమెరికాలోనే కాకుండా ఆస్ట్రియా, పోలాండ్, స్వీడన్, డెన్మార్క్, ఫిన్ ల్యాండ్, నార్వేలో కూడా ఇదే విధంగా 1 శాతం వినియోగదారులు 'ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 6' బ్రౌజర్‌ని ఉపయోగిస్తున్నారని అన్నారు.
ఒకానోక సమయంలో అత్యంత పాపులర్ బ్రౌజర్‌గా వెలుగొందిన 'ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 6' కి ఇప్పుడు ఇలా సంభవించడం అందరిని భాదించే విషయం అయినప్పటికీ, టెక్నాలజీ అభివృద్దే ఇందుకు కారణమంటున్నారు. మైక్రోసాప్ట్ కూడా 'ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 6' ఇంత కాలం మార్కెట్లో హాల్ చల్ చేసిన సందర్బాన్ని తలచుకొని ఆశ్చర్యపోయారు.మైక్రోసాప్ట్ 'ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 10' వర్సన్‌ని విడుదల చేసింది. మైక్రోసాప్ట్ విడుదల చేసిన ఈ సెకండ్ ప్రీ రిలీజ్ 'ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 10' లో కొత్త ఫీచర్స్ చాలానే ఉన్నాయి. 'ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 10' వర్సన్‌ని విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. HTML 5 Parsar, HTML 5 Sandbox, web Workers, Media Query Listeners లాంటి అత్యాధునిక టెక్నాలన్నింటిని సపోర్ట్ చేస్తుంది.


Click it and Unblock the Notifications








