Home
News

వెయ్యి సంవత్సరాల్లో ఒకసారి జరిగే పెళ్లి : అంబానీ ఇంట పెళ్లిలో టెక్నాలజీని ఎంతలా వినియోగించారో తెలుసా?

భారత్‌లో అత్యంత ధనిక కుటుంబం పెళ్లి అంటే.. ఏర్పా్ట్లు అత్యంత వైభవంగా ఉండడం సహజం. కానీ అనంత్‌ అంబానీ - రాధికా మెర్చంట్ పెళ్లి కోసం అంబానీ కుటుంబం చేసిన ఏర్పాట్లు అంబరాన్ని అంటినట్లు ఉండడమే కాకుండా... టెక్నాలజీకి పెద్ద పీట వేశారు. సింపుల్‌గా చెప్పాలంటే టెక్నాలజీని ఇలా కూడా వాడొచ్చా అనేలా చేశారు. డ్రోన్‌ షోలు, ప్రాజెక్షన్‌ మ్యాపింగ్‌ చేసిన మండపాలు, బయోమెట్రిక్ భద్రతా వ్యవస్థలు మరియు జియో లాజిస్టిక్స్ ఏర్పాట్లు వంటి వన్నీ కలిసి అంబానీ ఇంట పెళ్లిని సంపద్రాయాలు, టెక్నాలజీ మధ్య ఉండే గీత చెరిపేసినట్లు చేశాయి.

చాలా కాలం తర్వాత ఇండియాలో జరిగిన అత్యంత వైభవమైన పెళ్లి వేడుక.. నెక్స్ట్‌ జనరేషన్‌ టెక్నాలజీకి వేదికకగా ఎలా మారిందో చూద్దాం.

the wedding that happens once in 1000 years how ambani rewrote event tech history telugu news

ఆకట్టుకొనేలా డ్రోన్‌ షో
2024 మార్చిలో జూమ్‌నగర్‌లో జరిగిన అనంత అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుక ఒక మినీ ఫెస్టివల్‌ను తలపించింది. ఇండియా చరిత్రలోనే అతిపెద్ద డ్రోన్‌ షోలలో ఒకటిగా నిలవడమే కాకుండా.. అందరినీ ఆకట్టుకుంది. 5000 కంటే ఎక్కువ డ్రోన్‌లు ఇందులో పాల్గొన్నాయి. డ్రోన్‌ షో కేవలం ప్రదర్శనకే పరిమితం కాకుండా.. జంతువుల సంరక్షణపై అనంత్‌ అంబానికి ఉన్న మక్కువ ఈ ప్రదర్శనలో స్పష్టంగా వెల్లడయింది. ఏనుగులు, వంతారా 3D లోగో (అనంత్‌ అంబానీ వంతారా ప్రొజెక్ట్‌) వంటివి ప్రదర్శించారు.

ఈ డ్రోన్ షో వీడియోలతో సోషల్‌ మీడియా నిండిపోయింది. ఈ వేడుకల్లో అతి తక్కువ సమయంలో వైరల్‌ టెక్‌ మొమెంట్‌గా నిలిచిపోయింది. పాతకాలపు బాణా సంచా వెలుగు ప్రస్తానం ముగిసి, డ్రోన్‌ షో కొత్త ట్రెండ్‌గా నిలిచింది.

ప్రొజెక్షన్ మ్యాపింగ్‌తో పెళ్లి మండపం డ్రీమ్‌ స్కేమ్‌గా మారిపోయింది
ముంబయిలోని జియో వరల్డ్‌ కన్వెష్షన్‌ సెంటర్‌లో జరిగిన పెళ్లి వేడుక.. టెక్నాలజీ వినియోగాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లింది.

వేదిక మొత్తాన్ని 360 డిగ్రీల ప్రొజెక్షన్‌ మ్యాపింగ్ సాయంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. హల్దీ కార్యక్రమంలో దట్టమైన అడవిని తలపించేలా, ప్రకృతి సౌందర్యం వెళ్లి విరిసేలా ఏర్పాట్లు, పూజాకార్యక్రమంలో మెరిసేలే ప్రత్యేక గెలాక్సీలు, సంగీతానికి తగినట్లు ప్రతిస్పందించే విధంగా పుష్పాలు వంటి ప్రత్యేక ఏర్పాటు చేశారు. 40 కి పైగా హైఎండ్‌ ప్రొజెక్టర్లను ఉపయోగించారు. సాంకేతిక అవరోధాలు కాకుండా నివారించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇదంతా కేవలం స్క్రీన్ వర్క్‌ తరహాలో కాకుండా అతిథిలను మైమరిపోయేలా చేసింది. ఈ ఏర్పాట్లు ఓ అతిథి తన స్పందన తెలియజేశారు. కథల పుస్తకంలోకి అడుగుపెట్టినట్లు అనిపించినట్లు చెప్పారు. ఎక్కువ మంది చూసేందుకు వీలుగా అంబాని కుటుంబం రోజుల తరబడి దీనిని రన్ చేశారు.

బయోమెట్రిక్‌ చెక్‌ ఇన్‌, QR ఆహ్వానాలు, కలర్‌ కోడింగ్‌తో కూడిన గెస్ట్‌ యాక్సెస్
వేల మంది వీఐపీలు, వ్యాపారవేత్తలు, గ్లోబల్‌ ఐకాన్లు, బాలీవుడ్‌ ప్రముఖులను ఒకే చోట మర్యాదలు చేయడం అంత సులభంగా కాదు. సాధారణ వివాహం తరహా ఏర్పాట్లు అసాధ్యం.

వేడుకకు కొన్ని గంటల ముందు QR కోడ్‌తో కూడిన ఆహ్వానాలు పంపించారు. ఇవి కేవలం చెక్‌ ఇన్‌ కోసం మాత్రమే కాకుండా, ముఖ గుర్తింపు సాంకేతికతను కలిగి ఉన్నాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత వ్యవస్థల ద్వారా అతిథులను ముఖం, అతిథుల డేటా బేసే ఆధారంగా ధ్రువీకరించారు.

the wedding that happens once in 1000 years how ambani rewrote event tech history telugu news

వేడుక జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నాక.. ఎటువంటి గందరగోళం లేకుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఇందుకోసం కలర్‌ కోడింగ్‌తో కూడిన RFID బ్యాండ్‌లను ఉపయోగించారు. వాటి ద్వారా మండపం, ప్రైవేట్‌ వేడుక ప్రాంతం, రిసెప్షన్‌కు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. జియో ఫైడ్ లాజిస్టిక్స్‌ ద్వారా ఇది సాధ్యమైంది.

జియో : అంబరాన్నంటిన వేడుకకు వెన్నెముకగా నిలిచింది
జియో వరల్డ్ కన్వెష్షన్‌ సెంటర్‌ కేవలం విలాసవంతమైన వేదికగానే కాకుండా డిజిటల్‌ కోటగా తీర్దిదిద్దారు. జియో 5G ఇన్‌ఫ్రాస్టక్చర్‌ ద్వారా ఇది సాధ్యమైంది. వేల స్మార్ట్‌ఫోన్‌లు, రియల్‌టైం వీడియో స్ట్రీమింగ్‌, ఇంటర్నల్‌ సెక్యూరిటీ కమ్యూనికేషన్‌, లైవ్‌ క్లౌడ్‌ ట్రాన్స్‌ఫర్‌ వంటివి నిరంతరం జరిగాయి.

ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్‌ అప్‌లోడ్‌ చేసే అతిథులు అయినా, విదేశాల్లోని కుటుంబ సభ్యులకు లైవ్‌ కాల్‌ చేసే వారైనా, అన్ని అంతస్తుల్లో కదలికలను నిరంతరం సమన్వయం చేసే సిబ్బంది అయినా ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మెరుగైన కనెక్టివిటీని ఏర్పాటు చేశారు. జియో అనధికారిక డెమో తరహాలో అనిపించింది.

సెలబ్రిటీ కంటెంట్‌, ఆతిథ్యం సహా
AR రెహమాన్‌ స్టేజ్‌ నిర్మాణం నుంచి బొమ్మ రైళ్ల ద్వారా సరఫరా చేసే డిజెర్ట్‌ వరకు.. గతంలో ఎన్నడూ చూడని విధంగా తీర్చిదిద్దారు.

అనంతరం జరిగిన సంగీత్‌ వేడుకలో.. జస్టిన్‌ బీబర్‌ కచేరీ సమయంలో వివాహ వేదిక కంటే కచేరీలు చేసే వేదికలాగా భారీ LED లను ఏర్పాటు చేశారు. AV సిస్టమ్‌లు మరియు ప్రతి బీట్‌కు సరిపోయేలా లైటింగ్‌ను ఏర్పాటు చేశారు.

the wedding that happens once in 1000 years how ambani rewrote event tech history telugu news

కిమ్ కార్డాషియన్‌తోపాటు అనేక మంది ఇంటర్నేషనల్‌ ఇన్‌ఫ్లూయన్సర్లు తమ అనుభవాలను డాక్యమెంట్‌ చేశారు. ఈ ఫుటేజ్‌ను రాబోయే షోలలో వినియోగించే అవకాశం కూడా ఉంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. క్లౌడ్‌ స్టోరేజీ, లైవ్‌ షూటింగ్‌, మొబైల్‌ ప్రొడక్షన్‌ సెట్‌అప్‌ కూడా పనిచేసి ఉండవచ్చు.

భవిష్యత్‌లో జరిగే భారత వివాహ వేడుకలకు ఏం సూచిస్తుంది.
ఇది కేవలం పెళ్లి వేడుక మాత్రమే కాదు. భవిష్యత్‌తో లగ్జరీ ఈవెంట్‌ టెక్నాలజీపై ఏ కేస్‌ స్టడీగా నిలిచింది.

డ్రోన్‌ షో, బయోమెట్రిక్‌ యాక్సె్స్‌, ఏఐ ఆధారిత ప్లానింగ్‌, ప్రొజెక్షన్‌ మ్యాపింగ్‌ పరిసరాలు.. ఈ స్థాయి కార్యాచరణకు జియో 5G డిజిటల్ వెన్నెముకగా నిలిచింది. భవిష్యత్‌ లగ్జీరీ ఈవెంట్‌కు ఈ అంబానీ ఇంట వివాహం ఓ బ్లూప్రింట్‌గా నిలిచిపోతుంది.

ఇందులో మరో విషయం కూడా దాగి ఉంది. భారత దేశ సంప్రదాయాలు మరియు ఆధునికత ఒకదానికొకటి వేర్వేరుగా ఉండాల్సిన అవసరం లేదని స్పష్టమైంది. సంప్రదాయానికి అనుకూలంగా అన్ని రీతులు యథాతథంగా కొనసాగాయి. కానీ వాటన్నింటినీ ఆవిష్కరించిన విధానం భవిష్యత్‌ దృష్టిలో విస్తృతంగా వినియోగించదగినదిగా రూపొందించబడింది.

ప్రతి పెళ్లీ ఇలానే ఉంటుందా అంటే? కాదు. కానీ ఈ వేడుక ద్వారా అంబానీ కుటుంబం.. ఆతిథ్యం, టెక్నాలజీ వినియోగం సహా అన్నింటా ఉన్న అంచనాలను మించిపోయింది. ఫలితంగా Wedding Of the Millennium అనే పదానికి నిజమైన అర్థాన్ని తీసుకొచ్చారు.

More from GizBot

Best Mobiles in India

English summary
the wedding that happens once in 1000 years how ambani rewrote event tech history
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X