Amazon ఆఫ‌ర్: రూ.100 లోపు ధ‌ర‌లో ల‌భించే బెస్ట్ ఇయ‌ర్‌ఫోన్లు!

|

మ‌నం ట్రావెలింగ్‌లో ఉన్నా లేదా ఇంకేదైనా ప‌నిలో ఉన్నా.. మ్యూజిక్ వింటుంటే ఎంతో ఆహ్లాద‌క‌రంగా ఉంటుంది. ఈ క్ర‌మంలో మ్యూజిక్‌ను మ‌రింతగా ఆస్వాదించేందుకు చాలా మంది Earphonesను వినియోగిస్తుంటారు. సినిమాలు మరియు వీడియోలు చూడటం, సంగీతం వినడం, గేమ్‌లు ఆడటం, మన ప్రియమైన వారితో ఫోన్‌లో చాట్ చేయడం మరియు మరెన్నో కోసం ఇయర్‌ఫోన్‌లపై ఆధార ప‌డుతున్నారు. దీంతో దేశంలో బెస్ట్ Earphonesకు డిమాండ్ పెరిగింది.

 
Amazon ఆఫ‌ర్: రూ.100 లోపు ధ‌ర‌లో ల‌భించే బెస్ట్ ఇయ‌ర్‌ఫోన్లు!

అయితే, ఈ రోజు మేము Amazon ఫెస్టివ‌ల్ సేల్‌లో భాగంగా రూ.100 లోపు అందుబాటులో ఉన్న ఈ ఇయర్‌ఫోన్‌ల పూర్తి జాబితాను మీ ముందుకు తీసుకువచ్చాము. కాబట్టి మీరు Earphones కొనుగోలు కోసం వేచి ఉన్న‌ట్ల‌యితే.. ఈ జాబితాపై ఓ సారి లుక్కేయండి.

Meyaar Sunshine YS ఇయ‌ర్‌ఫోన్లు:

Meyaar Sunshine YS ఇయ‌ర్‌ఫోన్లు:

ఈ ఇయ‌ర్‌ఫోన్ల ధ‌ర రూ.99గా ఉంది. ఈ ఇయ‌ర్‌ఫోన్స్ మీకు మంచి ఆడియో అనుభూతిని క‌ల్పిస్తాయి. ఫోన్‌లో మాట్లాడటానికి, సంగీతం విన‌డంలో ఎలాంటి అంత‌రాయాలు లేకుండా అద్భుత‌మైన అనుభూతి ఉంటుంది. ఇవి బ్లాక్‌, వైట్ రెండు క‌ల‌ర్ల‌లో కొనుగోలు దారుల‌కు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా, వీటిని ఉప‌యోగించి మీరు ఒక ట్యాప్‌లో కాల్ లిఫ్ట్ చేసుకుని మ‌ళ్లీ అదేవిధంగా కాల్ డిస్క‌నెక్ట్ చేసుకునే ఫీచ‌ర్ ఉంది. దీనిక 3.5mm జాక్‌తో అమర్చబడి ఉంటుంది. పర్ఫెక్ట్ లెంగ్త్ టాంగిల్ ఫ్రీ కేబుల్‌తో వస్తుంది. దీనికి వారంటీ ఆరు నెల‌ల పాటు క‌ల్పిస్తున్నారు.

Kratos Thump వైర్డ్ ఇయర్‌ఫోన్‌లు:

Kratos Thump వైర్డ్ ఇయర్‌ఫోన్‌లు:

ఈ ఇయ‌ర్‌ఫోన్ల ధ‌ర రూ.99గా ఉంది. ఈ వైర్డ్ స్టీరియో ఇయర్‌ఫోన్‌లు చాలా భిన్న‌మైన‌వి అని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఇవి చూడటానికి చాలా ఆక‌ర్ష‌ణీయ‌మైన లుక్ క‌లిగి ఉంటాయి. అంతేకాకుండా, మంచి సుపీరియర్ సౌండ్ ను ఇవి చెవుల‌కు అందిస్తాయి. వీటికి ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్ సౌక‌ర్యం కూడా ఉంది. మెరుగైన సౌండ్ అనుభూతి, మ‌రియు ఫోన్లు మాట్లాడ‌టానికి ఉన్నతమైన అల్ట్రా-సెన్సిటివ్ రహస్య మైక్రోఫోన్‌తో వస్తుంది. ఈ హెడ్‌సెట్ తేలికైన, సౌకర్యవంతమైన డిజైన్ క‌లిగి ఉన్నాయి. ఇవి బ్లాక్‌, వైట్‌, బ్లూ, రెడ్‌, ఎల్లో క‌ల‌ర్ల‌లో అందుబాటులో ఉన్నాయి. వీటికి కంపెనీ 6 నెలల వారంటీ ఇస్తుంది.

Meyaar SPN Edition Deep Bass వైర్డ్ డ్యూరబుల్ మెటల్ ఇయ‌ర్‌ఫోన్లు:
 

Meyaar SPN Edition Deep Bass వైర్డ్ డ్యూరబుల్ మెటల్ ఇయ‌ర్‌ఫోన్లు:

ఈ Meyaar SPN Edition Deep Bass ఇయ‌ర్‌ఫోన్స్ ధ‌ర రూ.89 గా ఉంది. ఇది ఎర్గోనామిక్స్ డిజైన్‌తో వ‌స్తుంది. ఇది మైక్రోఫోన్ ను క‌లిగి ఉంది. మీరు మ్యూజిక్ వింటున్న‌ప్పుడు ట్రాక్‌లను సులభంగా మార్చడానికి, పాటలను వినడానికి సుల‌భ‌మైన ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంది. క్రిస్టల్ క్లియర్ కాల్‌లను చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. దీనికి కంపెనీ నుంచి ఒక సంవత్సరం పాటు వారంటీ ఇస్తుంది.

CANVAS EP2 వైర్డ్ డ్యూరబుల్ స్టీరియో ఇయర్‌ఫోన్స్:

CANVAS EP2 వైర్డ్ డ్యూరబుల్ స్టీరియో ఇయర్‌ఫోన్స్:

ఈ ఇయ‌ర్‌ఫోన్స్ చాలా స‌ర‌స‌మైన రూ.40 ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇవి మీకు మంచి ఆడియో అనుభూతిని క‌ల్పిస్తాయి. ఫోన్‌లో మాట్లాడటానికి, సంగీతం విన‌డంలో ఎలాంటి అంత‌రాయాలు లేకుండా అద్భుత‌మైన అనుభూతి ఉంటుంది. ధ‌ర విష‌యానికొస్తే.. ఇవి చాలా స‌ర‌స‌మైన ధ‌ర‌కు అందుబాటులో ఉన్నాయి. అదనంగా, ఇది అన్ని Android, iOS మరియు మొబైల్ పరికరాలకు సజావుగా కనెక్ట్ అవుతుంది. కానీ ఈ ఇయ‌ర్‌ఫోన్ల‌కు ఎటువంటి వారంటీ ఇవ్వ‌డం లేదు.

Dipinsure Harmony వైర్డ్ ఇయ‌ర్‌ఫోన్ విత్ మైక్‌:

Dipinsure Harmony వైర్డ్ ఇయ‌ర్‌ఫోన్ విత్ మైక్‌:

ఈ Dipinsure Harmony వైర్డ్‌ ఇయర్‌ఫోన్ మైక్‌తో పాటుగా 3డి స్టీరియో సౌండ్ వైర్డ్ ఇయర్‌ఫోన్ (1.2మీ పొడవు)తో వస్తుంది. అలాగే ఈ ఇయ‌ర్‌ఫోన్స్ వాటర్‌ప్రూఫ్ IPX5 రేటింగ్ కలిగి ఉన్నాయి. అంతేకాకుండా, హ్యాండ్స్-ఫ్రీ కాలింగ్ కోసం ఇన్-లైన్ సింగిల్ టచ్ కంట్రోల్ ఫీచ‌ర్ ఉంది. గోల్డెన్ కోటింగ్ 3.5mm జాక్‌తో అందుబాటులో ఉన్నాయి. ఈ ఇయ‌ర్‌ఫోన్లకు కంపెనీ ఒక సంవ‌త్స‌రం పాటు వారంటీ సౌక‌ర్యాన్ని అందిస్తుంది. ఈ ఇయ‌ర్‌ఫోన్ల ధ‌ర రూ.84గా ఉంది.

Best Mobiles in India

English summary
The wired earphones we can buy under Rs.100 in amazon festive sale

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X