బ్లాగ్‌ అనే పదం ఎలా వచ్చింది?

Posted By: Prashanth

బ్లాగ్‌ అనే పదం ఎలా వచ్చింది?

 

బ్లాగ్‌ అనే పదం ‘వెబ్‌లాగ్‌’ అనే పదం నుంచి పుట్టింది. 1997లో జార్న్‌ బార్జర్‌ తొలిసారిగా వెబ్‌లాగ్‌ అనే పదాన్ని వాడాడు. దాన్నే 1999లో పీటర్‌ మెర్వోల్జ్‌ అనే అతను వెబ్‌లాగ్‌ అనే పదంలో చిన్నప్రయోగం చేశాడు. "WEB LOG' ను "WE BLOG'గా విడగొ ట్టాడు. తరువాత క్రమంలో BLOGగా మారింది. 2003 నాటికి నిఘంటువుల్లో వెబ్‌లాగ్‌ అనే పదం చేరిపోయింది. బ్లాగ్‌కు వన్నె తెచ్చింది మాత్రం డేవ్‌వైనర్‌. ఈయన బ్లాగ్‌లకోసం ఏకంగా ఒక సర్వర్‌నే నెలకొల్పాడు. 2004లో స్పెయిన్‌లో బ్లాగ్‌ వాడకం ఎక్కువై వెలుగులోకి వచ్చింది. ప్రధాన స్రవంతిలో ఒక భాగమైపోయింది. నేడు వివిధ ప్రపంచ భాషల్లో్ల బ్లాగ్‌లు నడుస్తు న్నాయి. ప్రతి ఆరునెలల కీ వీటి సంఖ్య రెట్టింపు అవుతోంది(ట). అందుకే అది నెట్‌జనుల జీవితంలో ఒక భాగమైపోయింది.

ఒకే మౌస్‌తో 4 కంప్యూటర్‌లను ఆపరేట్ చేసుకోవచ్చా..?

ఒక్క మౌస్‌తో నాలుగు కంప్యూటర్‌లను ఆపరేట్ చెయ్యటం సాధ్యమేనా..? mouse without borders (మౌస్ వితవుట్ బోర్డర్స్) సాఫ్ట్‌వేర్‌తో ఈ ప్రక్రియ సాధ్యమే. ఈ సాఫ్ట్‌వేర్ సాయంతో కేవలం మౌస్‌ను మాత్రమే కాదు కీబోర్డ్‌ను నాలుగైదు పీసీలకు అనుసంధానించుకోవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడింగ్ పూర్తిగా ఉచితం. అదనపు హార్డ్‌వేర్ అవసరం లేదు. సాఫ్ట్‌వేర్‌ను పీసీల్లో ఇన్‌స్టాల్ చేసి సూచనలను పాటిస్తే సరి. ఈ అత్యాధునిక పరిజ్ఞానం సాయంతో ఒకే మౌస్, ఒకే కీబోర్డును నాలుగు కంప్యూటర్లకు షేర్ చేసుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot