ప్రపంచపు టెక్ బిలియనీర్స్ (టాప్ ఐదుగురు)

Posted By:

వారి నికర ఆస్తుల విలవ వేల కోట్లలోనే.. పుట్టుకతోనే కోటేశ్వరులనుకుంటే అదీ కాదు. గొప్ప విద్యావంతులు కూడా కాదు. అలా అని ఏలాంటి లాటరీలు వీళ్లను వరించలేదు. మరి ఏలా కబేరులయ్యారు? ఓ ఐడియా జీవితాన్ని మార్చేసినట్లు. ఆసక్తితో కూడిన ఓ వినూత్న ఆలోచన వాళ్లను అపరకుబేరులను చేసి టెక్ మిలియనీర్లగా నిలబెట్టింది.

కత్తిలాంటి వాల్ పేపర్లు (మీ స్మార్ట్‌ఫోన్‌ కోసం)

ఆన్‌లైన్ ప్రపంచంలో తొలి ప్రయత్నంగా వారు వేసిన కమ్యూనికేషన్ విత్తు ఇప్పుడు వటవృక్షంగా మారి ఎంతో మంది జీవితాలను మార్చేసుంది. టెక్నాలజీ విభాగంలో సంపన్నులుగా గుర్తింపుతెచ్చుకన్న బిల్ గేట్స్, మార్క్ జూకర్ బర్గ్, లారీపేజ్ తదితర ప్రముఖల ఆదాయపు వివరాలను క్రింద స్లైడ్ షోలో చూడొచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రపంచపు టెక్ బిలియనీర్స్ (టాప్ ఐదుగురు)

మార్చ్ జూకర్‌బర్గ్ (Mark Zuckerberg):

వయస్సు: 27,

కంపెనీ: ఫేస్‌బుక్,

ప్రారంభించిన సంవత్సరం: 2004,

యూజర్లు సంఖ్య: 800 మిలియన్లు,

ప్రారంభ నిధులు: $500,000

ఐపీవో విలువు: తెలియాల్సి ఉంది.

విద్యార్హత: హార్వర్డ్ విశ్వవిద్యాలయం (డ్రాప్ అవుట్),

ఫేస్‌బుక్ వార్షిక ఆదాయం: 4.27 మిలియన్ (2011లెక్కల ప్రకారం),

మార్క్ జూకర్స్ బర్గ్ వ్యక్తిగత నికర పెట్టుబడి: $17.5 బిలియన్లు.

 

ప్రపంచపు టెక్ బిలియనీర్స్ (టాప్ ఐదుగురు)

బిల్ గేట్స్ (Bill Gates):

బిల్ గేట్స్‌గా అందరికీ తెలిసిన మూడవ విలియం హెన్రీ గేట్స్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత ఇంకా గొప్ప దాత. వ్యక్తిగత ఉపయోగాలకోసం వినియోగించే కంప్యూటర్లను సామాన్యులకు అందుబాటులో తెచ్చిన వ్యక్తిగా బిల్‌గేట్స్ ఎంతో పేరు పొందాడు. ఈయన హర్వర్డ్ విశ్వవిద్యాలయంలోని చదువును మధ్యలోనే నిలిపివేశారు. అయినప్పటికి ప్రపంచ కుబేరుల్లో బిల్ గేట్స్ ఒకరు. 2012 నాటికి బిల్ గేట్స్ నికర పెట్టుబడుల విలువ $61బిలియన్‌లు.

 

ప్రపంచపు టెక్ బిలియనీర్స్ (టాప్ ఐదుగురు)

లారీ ఇల్లీసన్ (Larry Ellison):

ఒరాకిల్ సంస్థ వ్యవస్థాపకులైన లారీ ఇల్లీసన్ నికర పెట్టుబడుల విలువ $36.0 బిలియన్‌లు (2012 లెక్కల ప్రకారం). ప్రపంచ ధనికుల్లో ఇల్లీసన్ ఆరో వ్యక్తి..

 

ప్రపంచపు టెక్ బిలియనీర్స్ (టాప్ ఐదుగురు)

లారీ పేజ్ (Larry Page):

ఈయన గూగుల్ సంస్థలకు సీఈవోగా వ్యవహరిస్తున్నారు. 2012 లెక్కల ప్రకారం లారీ పేజ్ నికర పెట్టబుడుల విలువ $18.7 బిలియన్‌లు.

 

ప్రపంచపు టెక్ బిలియనీర్స్ (టాప్ ఐదుగురు)

సెర్జీ బ్రిన్ (Sergey Brin):

సెర్జీ బ్రిన్ ఇంకా లారీ పేజ్‌లు స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో కలిసి విద్యనభ్యసించారు. గూగుల్ ఆవిర్భావానికి ఈ మిత్రద్వయం అందించిన తోడ్పాటు అంతా ఇంకా కాదు. 2012కుగాను గూగుల్‌లో సెర్జీ బ్రిన్ నికర పెట్టుబడుల విలువ $18.7 బిలియన్‌లు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot