నెంబర్ వన్ స్దానానికి చేరుకున్నందుకు హ్యాపీ

Posted By: Staff

నెంబర్ వన్ స్దానానికి చేరుకున్నందుకు హ్యాపీ

వాషింగ్టన్‌: ఐపాడ్‌ అమ్మకాలు యాపిల్‌ కంపెనీని ఎవరికీ అందనంత ఎత్తునకు చేర్చాయి. బుధవారం నాటి స్టాక్‌ సెషన్‌లో ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్‌ విలువను కలిగివున్న ఎక్సన్‌ మొబిల్‌ను యాపిల్‌ అధిగమించింది. ఐపాడ్‌తో పాటు కంప్యూటర్‌ తదితర ఉత్పత్తుల్లో తాము పాటిస్తున్న నాణ్యత వినియోగదారులను ఎంతో ఆకర్షించిందని, అందువల్లే అమ్మకాలు గణనీయంగా పెరిగి ఈ స్థాయికి చేరామని సంస్థ తెలిపింది.

ఈ సెషన్‌లో యాపిల్‌, ఎక్సన్‌ కంపెనీల ఈక్విటీ వాటాలు పతనం కావడం గమనార్హం. ప్రస్తుతం యాపిల్‌ మార్కెట్‌ కాప్‌ 337 డాలర్ల వద్ద, ఎక్సన్‌ మార్కెట్‌ కాప్‌ 331 బిలియన్‌ డాలర్ల వద్దా కొనసాగాయి. యాపిల్‌కు చెందిన ఒక్కో ఈక్విటీ వాటా విలువ 363 డాలర్లకు చేరింది. దశాబ్దం క్రితం వరకూ జనరల్‌ ఎలక్ట్రిక్‌ ఆధీనంలోని వరల్డ్‌ నెంబర్‌ వన్‌ కంపెనీ హోదా ఆపై మైక్రోసాఫ్ట్‌కు రాగా, 2005లో ఎక్సన్‌ మొబిల్‌ టాప్‌ ర్యాంక్‌ దక్కించుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting