ప్రపంచంలోని అతి చిన్న స్మార్ట్‌ఫోన్ ఇదే!!! ఫీచర్స్ అదుర్స్...
ప్రపంచంలోని స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు అన్ని కూడా 6-అంగుళాల కంటే ఎక్కువ పరిమాణాలతో గల అతి పెద్ద డిస్ప్లే స్క్రీన్ ఫోన్లను తయారుచేయడం సర్వసాధారణంగా మారాయి. అయితే కొంతమంది ఇప్పటికీ చిన్న స్క్రీన్ ఫోన్లను వాడటానికి ఇష్టపడుతున్నారు. మీరు ఐఫోన్ SE లేదా పాత-తరం ఆండ్రాయిడ్ ఫోన్‌లను ఉపయోగించడానికి ఇష్టపడకపోతే కనుక మీకు ఎక్కువ మొత్తంలో ఎంపికలు లేవు. చైనాకు చెందిన ఒక సంస్థ ప్రపంచంలోని అతిచిన్న 4G ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.

ప్రపంచంలోని అతి చిన్న 4G స్మార్ట్‌ఫోన్ జెల్లీ 2
ప్రపంచంలోని అతి చిన్న స్మార్ట్‌ఫోన్ జెల్లీ 2 పేరుతో కేవలం 3-ఇంచ్ పరిమాణంలో డిస్ప్లేను కలిగి ఉంది. అంటే ఇది మీ యొక్క క్రెడిట్ లేదా డెబిట్ కార్డు సైజును కలిగి ఉంటుంది. షాంఘైకి చెందిన యునిహెర్ట్జ్ అనే చైనా కంపెనీ జెల్లీ 2 స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. 2017 లో విడుదల అయిన చిన్న స్మార్ట్‌ఫోన్ జెల్లీకి అప్ డేట్ వెర్షన్ గా ఈ ఫోన్ వస్తున్నది. యునిహెర్ట్జ్ అటామ్ వంటి కాంపాక్ట్ ఫోన్‌ల యొక్క చిన్న లైనప్‌ను కంపెనీ కలిగి ఉంది.

జెల్లీ 2 4G స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్
క్రౌడ్ ఫండింగ్ కోసం కిక్‌స్టార్టర్‌లో జాబితా చేయబడిన జెల్లీ 2 క్రెడిట్ కార్డ్-పరిమాణంలో ఉండి 4G ఫీచర్ మద్దతుతో వస్తుంది. ఇది గ్లోబల్ రేడియోలకు మద్దతు ఇవ్వడమే కాకుండా ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ అవుతుంది. ఈ ఫోన్ మునుపటి జెల్లీ ఫోన్ కంటే రెండు రెట్లు ఎక్కువ బ్యాటరీ లైఫ్ ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది అప్‌గ్రేడ్ కెమెరా సిస్టమ్ మరియు జిపిఎస్ సెన్సార్లను కూడా కలిగి ఉంది.

జెల్లీ 2 4G మినీ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్
జెల్లీ 2 4G మినీ స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే యునిహెర్ట్జ్ సంస్థ జెల్లీ 2 ను 3-అంగుళాల డిస్ప్లే పరిమాణంలో తయారుచేసింది. ఈ ఫోన్ 2,000mAh బ్యాటరీ , 8 మెగాపిక్సెల్ మరియు 16 మెగాపిక్సెల్ వంటి డ్యూయల్ కెమెరా ఫీచర్లను కలిగి ఉంది. దీనిని మీ యొక్క రెగ్యులర్ పెద్ద డిస్ప్లే స్మార్ట్‌ఫోన్ తో పాటుగా సులభంగా ఉపయోగించడానికి వీలుగా రూపొందించబడింది. ఇది వ్యాయామం సమయంలో మీ పెద్ద డిస్ప్లే స్మార్ట్‌ఫోన్ కు ప్రత్యాన్మాయంగా సులభంగా ఉపయోగించుకోవచ్చు అని కంపెనీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది .

జెల్లీ 2 4G మినీ స్మార్ట్‌ఫోన్
2017 సంవత్సరంలో విడుదల అయిన చిన్న స్మార్ట్‌ఫోన్ జెల్లీ కోసం 10,000 పైగా ఆర్డరులు నమోదు చేసినట్లు కంపెనీ తెలిపింది. అప్పటి నుండి కిక్‌స్టార్టర్‌లో నాలుగు విజయవంతమైన ప్రచారాలను ప్రారంభించింది. 70 దేశాలలో సుమారు 30,000 యూనిట్లకు పైగా ఈ ఫోన్ లను పంపిణీ చేసినట్లు కంపెనీ ధృవీకరించింది.


Click it and Unblock the Notifications








