రూ. 27 వేలు తగ్గిన వరల్డ్ మోస్ట్ పాపులర్ స్మార్ట్‌ఫోన్

|

ఐ ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఐఫోన్ 11 సిరీస్ ఫోన్లను ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ లాంచ్ చేసింది. గతేడాది ఐఫోన్ 10 శ్రేణి ఫోన్లతో ఆకర్షించిన ఆపిల్ సంస్థ క్యుపర్టినోలోని తమ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలోని స్టీవ్ జాబ్స్ థియేటర్ లోఅట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ లను విడుదల చేసింది. అత్యంత శక్తిమంతమైన ఏ13 బయోనిక్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఈ ఫోన్ల ప్రత్యేకతగా సంస్థ పేర్కోంది. ఈ ఫోన్లు గతంలో వచ్చిన iPhone XR, iPhone XS and iPhone XS Maxలకు successors వచ్చాయి. ఈ ఫోన్లు లాంచ్ తర్వాత ఆపిల్ కంపెనీ పాల మోడల్స్ రేట్లను తగ్గించింది. కాగా కొత్త మోడల్స్ విడుదల అయిన వెంటనే పాత మోడల్స్ ధరలను తగ్గించడం కంపెనీకి ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే.

 

iPhone XR

iPhone XR

కంపెనీ 2018 రెండో అర్ధ భాగంలో ఐఫోన్ ఎక్స్ఆర్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ ఫోన్ ఎక్స్ఆర్ (64 జీబీ) ధర లాంచింగ్ సమయంలో రూ.76,900. కాగా కొన్ని రోజుల తర్వాత ఈ ఫోన్ రూ.59,900కు చేరింది. అలాగే 128 జీబీ వేరియట్ ధర రూ.81,900 నుంచి రూ.64,900కు దిగొచ్చింది. అదేసమయంలో 256 బీజీ వేరియంట్ ధర రూ.91,900 నుంచి రూ.74,900కు తగ్గింది. అయితే కంపెనీ నుంచి దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఆపిల్ కంపెనీ వెబ్ సైట్లో మాత్రం ఈ ఫోన్ Rs 49,990గా లిస్ట్ అయింది.

ఐఫోన్ ఎక్స్‌ఆర్ ఫీచర్లు

ఐఫోన్ ఎక్స్‌ఆర్ ఫీచర్లు

ఐఫోన్ ఎక్స్‌ఆర్ ఫీచర్ల విషయానికి వస్తే..6.1 అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లే, ఏ12 బయోనిక్ ప్రాసెసర్, ఐపి 67 వాటర్ డస్ట్ రెసిస్టెంట్, 12ఎంపీ రియర్‌ కెమెరా, ముందుభాగాన 7ఎంపీ ట్రూడెప్త్ సెన్సార్‌, ఫేస్ ఐడి, లాంటివి ప్రధానంగా ఉన్నాయి. కాగా స్మార్ట్‌ఫోన్లపై దిగుమతుల సుంకాల నేపథ్యంలో ఆపిల్‌ మేడ్‌ ఇన్‌ ఇండియా కాన్సెప్ట్‌తో తక్కువ ధరలతో ఐఫోన్లను అందుబాటులోకి తేవడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

ఆపిల్ ఉత్పత్తులకు తగ్గుతున్న ఆసక్తి
 

ఆపిల్ ఉత్పత్తులకు తగ్గుతున్న ఆసక్తి

ఆపిల్ ఉత్పత్తులకు మార్కెట్లో ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ధర ఎక్కువైనా ఐఫోన్ కొనుగోలు చేయడానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే ఇటీవల చైనా బ్రాండ్స్‌ అయిన ఒప్పో, వీవో, వన్ ప్లస్, రియల్ మి వంటివి ఐఫోన్లో అందించే ఫీచర్లనే అతి తక్కువ ధరకే వినియోగదారులకు ఇస్తున్నాయి. అందువల్ల ఆపిల్ ఐఫోన్ XR మోడల్ ప్రొడక్షన్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. తాజాగా ఐఫోన్ XS, XS మాక్స్ మోడళ్ల ఉత్పత్తిని కూడా నిలిపి వేసినట్లు సమాచారం. ఈ ఫోన్లకు అనుకున్న దాని కంటే చాలా తక్కువగా డిమాండ్ ఉండటం వల్ల నిలిపివేసిందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. 

ఆండ్రాయిడ్ వైపు మొగ్గు

ఆండ్రాయిడ్ వైపు మొగ్గు

ఆపిల్ సంస్థ ప్రవేశపెట్టిన ఆన్‌స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను వీవో సంస్థ 20వేల రూపాయల లోపు లభించే ఫోన్లలో అందిస్తోంది. ఒప్పో బ్రాండ్ ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫీచర్ అయిన VOOC టెక్నాలజీ ఫోన్‌ను 25 వేలకే అందిస్తోంది. దీంతో ఐఫోన్ వినియోగదారులు క్రమంగా ఆండ్రాయిడ్ వైపు మొగ్గు చూపుతున్నారని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. దీంతో మరిన్ని కొత్త ఫీచర్లను అందించే విధంగా తమ కొత్త మోడల్స్‌ను రూపొందించే పనిలో ఆపిల్ ఇంజినీర్లు కసరత్తులు చేస్తున్నారు. 

Best Mobiles in India

English summary
The world’s 'most-popular' smartphone is now cheaper by Rs 27000

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X