ప్రపంచంలోనే అతి చిన్న వయస్సు ఖగోళ శాస్త్రవేత్త!! 7 ఏళ్లకే గ్రహశకలాలు కనుగొంది
ఖగోళశాస్త్రంపై అపారమైన ప్రేమ ఉన్న ఏడేళ్ల అమ్మాయి ఇటీవల నాసా కోసం ఏడు గ్రహశకలాలు కనుగొంది. బ్రెజిల్‌లోని అలగోవాస్‌లో నివసిస్తున్న ఏడేళ్ల నికోల్ ఒలివెరా గుర్తించిన 7 గ్రహశకలాల కారణంగా ఆమె ప్రపంచంలోనే అతి పిన్న వయస్సు ఖగోళ శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. ఆమెకు కేవలం రెండేళ్ల వయసు ఉన్నప్పుడు అంతరిక్షం మరియు ఖగోళశాస్త్రం పట్ల అధికంగా ఇంట్రెస్ట్ కలిగింది అని ఆమె తల్లిదండ్రలు తెలిపారు.

కొన్ని నివేదికల ప్రకారం ఏడేళ్ల నికోల్ ఒలివెరా చిన్నారి ఇటీవల ‘ఆస్టరాయిడ్ హంట్' పౌర విజ్ఞాన కార్యక్రమంలో పాల్గొంది. దీనిని అంతర్జాతీయ ఖగోళ శోధన మరియు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) ఇద్దరు కలిసి నిర్వహించారు. ఇందులో నికోల్ పాల్గొనడంతో పాటుగా ఏడు గ్రహశకలాలు కనుగొనటానికి దారితీసింది.

బ్రెజిల్ సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ మంత్రిత్వ శాఖ ఖగోళ శాస్త్రం మరియు ఏరోనాటిక్స్ పై 1 వ అంతర్జాతీయ సెమినార్లో ఉపన్యాసం ఇవ్వాలని ఈ చిన్న స్టార్‌ఆస్టరాయిడ్ ను అభ్యర్థించింది. దీనిని మంత్రిత్వ శాఖ స్వయంగా నిర్వహించనున్నది. ఆమె తక్కువ వయస్సును కలిగి ఉన్నపటికీ విస్తారమైన జ్ఞానంను కలిగి ఉంది అని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఒలివెరా తన పాఠశాలల్లో ఉపన్యాసాలు కూడా ఇస్తున్నారు. ఆమె అలగోవాస్ ఖగోళ అధ్యయన కేంద్రం, సెంట్రో డి ఎస్టూడోస్ ఆస్ట్రోనామికో డి అలగోవాస్ (CEAAL) లో అతి పిన్న వయస్కురాలు అని తెలుసుకున్న తరువాత బ్రెజిల్ మంత్రిత్వ శాఖ ఆమెను ఆహ్వానించింది.

ఒలివెరాకు కేవలం రెండేళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె తన తల్లిని ఒక నక్షత్రం గురించి అడిగింది మరియు ఒక బొమ్మ నక్షత్రాన్ని కూడా బహుమతి రూపంలో పొందింది. గ్రహశకలం శోధనలలో ఆమె చేసిన ఇన్పుట్లకు అంతర్జాతీయ ఖగోళ శోధన సహకారం ఆమెకు లభిస్తుందని ఆమె తల్లిదండ్రులకు అప్పుడు తెలియదు.

ఆరేళ్ల వయసులో CEAAL నిర్వహిస్తున్న కోర్సులో ఒలివెరా మొదటిసారి పాల్గొన్నారు. ఆమె తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం ఆమె అన్ని తరగతులకు హాజరై, తరువాత పరీక్ష రాసింది. ఇందులో ఆమె అరుదైన ఘనత సాధించి పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. కరోనా మహమ్మారి సమయంలో ఈ యువ ఖగోళ శాస్త్రవేత్త తన సొంత యూట్యూబ్ ఛానెల్‌ను కూడా సృష్టించింది. అక్కడ ఆమె తన ముగ్గురు ఖగోళ శాస్త్ర- ఔత్సాహికులతో కలిసి గ్రహశకలాలు మరియు వాటి యొక్క స్థానం గురించి మాట్లాడుతుంది.


Click it and Unblock the Notifications








