నాలుగు Oppo స్మార్ట్‌ఫోన్‌ల మీద భారీ ధర తగ్గింపులు!!!

|

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ యొక్క స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలోని కొన్ని ఫోన్ల మీద ధరలను తగ్గించింది. ఇందులో భాగంగా ఒప్పో A12, ఒప్పో A15, ఒప్పో F17, ఒప్పో రెనో 3 ప్రో వేరియంట్ల మీద ధరలను తగ్గించింది. ఈ హ్యాండ్‌సెట్‌ల మీద సుమారు రూ.2 వేల వరకు ధర తగ్గింపు లభించింది. మహేష్ టెలికాం షేర్ చేసిన ట్వీట్ ప్రకారం ఒప్పో A12 ఫోన్ యొక్క 3GB ర్యామ్ మరియు 32GB స్టోరేజ్ ఇప్పుడు రూ.8,990 రిటైల్ ధర వద్ద లభిస్తుంది. అదేవిధంగా ఇటీవల విడుదల చేసిన ఒప్పో F17 యొక్క 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ రూ.18,490 తగ్గింపు ధర వద్ద లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ల మీద రూ.500 నుండి రూ.2000 వరకు ధర తగ్గింపును లభించాయి. మరిన్ని వివరాల కోసం ముందుకు చదవండి.

ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ల మీద ధర తగ్గింపులు - కొత్త ధరల జాబితా

ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ల మీద ధర తగ్గింపులు - కొత్త ధరల జాబితా

ఒప్పో A12 (3GB ర్యామ్ + 32GB స్టోరేజ్) - రూ.8,990 (రూ .1,000 ధర తగ్గింపు)
ఒప్పో A15 (2GB ర్యామ్ + 32GB స్టోరేజ్) - రూ .8,990 (రూ .1,000 ధర తగ్గింపు)
ఒప్పో A15 (3GB ర్యామ్ + 32GB స్టోరేజ్) - రూ .9,990 (ధర తగ్గింపు రూ .1,000)
ఒప్పో F17 (8GB ర్యామ్ + 128GB) - రూ.18,490 (రూ .500 ధర తగ్గింపు)
ఒప్పో రెనో 3 ప్రో (8GB + 128GB) - రూ.24,990 (రూ. 1,000 ధరల తగ్గింపు)
ఒప్పో రెనో 3 ప్రో (8 జిబి + 256 జిబి) - రూ .27,990 (రూ.2,000 ధరల తగ్గింపు)

ఒప్పో రెనో 3 ప్రో స్నాప్‌డ్రాగన్ 720G SoC
 

ఒప్పో రెనో 3 ప్రో స్నాప్‌డ్రాగన్ 720G SoC

ఒప్పో రెనో 3 ప్రో ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే దీని యొక్క డిస్ప్లే ఫ్రంట్‌లో రెగ్యులర్ మోడల్‌కు సమానంగా ఉంటుంది. అంటే ఇది డ్యూయల్ సిమ్ (నానో) మద్దతుతో పాటు 90HZ రిఫ్రెష్ రేట్ మరియు 180HZ టచ్ శాంప్లింగ్ రేటుతో 6.5-అంగుళాల ఫుల్-HD+ డిస్ప్లేని 1,080x2,400 పిక్సెల్స్ పరిమాణంలో లభిస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720G SoC చేత రన్ అవుతూ 8GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జత చేయబడి వస్తుంది.

 

Also Read: WhatsApp లో కొత్త డిసప్పెరింగ్ మెసేజ్ ఫీచర్ ను ప్రారంభించడం ఎలా??Also Read: WhatsApp లో కొత్త డిసప్పెరింగ్ మెసేజ్ ఫీచర్ ను ప్రారంభించడం ఎలా??

Oppo F17 స్మార్ట్‌ఫోన్ సైడ్ డిజైన్

Oppo F17 స్మార్ట్‌ఫోన్ సైడ్ డిజైన్

Oppo F17 స్మార్ట్‌ఫోన్ కుడివైపున సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ డిజైన్ ను కలిగి ఉంటుంది. పవర్ బటన్ మరియు బయోమెట్రిక్ స్కానర్ యొక్క ఇంటిగ్రేటెడ్ ప్లేస్‌మెంట్ ఒక వైపు ఉన్నందున రోజువారీ దినచర్యలో ఫోన్‌ను ఉపయోగించడం చాలా సులభంగా ఉంటుంది. భౌతిక స్కానర్ స్క్రీన్‌ స్కానర్ కంటే ఎక్కువ స్థిరంగా ఉంటుంది. మీరు హ్యాండ్‌సెట్‌ను అన్‌లాక్ చేయాలనుకున్న ప్రతిసారీ డిస్ప్లే లో మీ ఫింగర్ ను ఉంచనవసరం లేకుండా స్క్రీన్ స్మడ్జ్ లేకుండా ఉంచుతుంది.

OPPO A12 ఆర్టిఫిషల్ ఇంటెలిజన్స్ రియర్ కెమెరా సెటప్

OPPO A12 ఆర్టిఫిషల్ ఇంటెలిజన్స్ రియర్ కెమెరా సెటప్

OPPO A12 స్మార్ట్‌ఫోన్‌ యొక్క వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 13MP మరియు 2MP సెన్సార్ లతో డ్యూయల్ కెమెరాలు ఉన్నాయి. ఇది ఆర్టిఫిషల్ ఇంటెలిజన్స్ ఫీచర్ ను కలిగి ఉండి ప్రతి విషయాన్ని వివరంగా సంగ్రహిస్తుంది. AI- ఫీచర్ గల శక్తివంతమైన 13MP మెయిన్ కెమెరా ఫోటోలను క్రిస్టల్ స్పష్టమైన వివరాలతో మరియు అధిక రిజల్యూషన్‌తో తీయడానికి అనుమతిస్తుంది. అంతేకాకుండా 2MP డీప్ కెమెరా ప్రతి షాట్‌ను DSLR ఇమేజ్ లాగా చేస్తుంది. ఇది హార్డ్‌వేర్-ఆధారిత పోర్ట్రెయిట్ బోకె ప్రభావంతో జత చేస్తుంది. బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న వాటిని బ్లర్ చేస్తూ ముఖ్యమైన అంశాన్ని హైలెట్ చేసే ఫీచర్ ను కూడా కలిగి ఉంది.

 

 

Best Mobiles in India

English summary
These 4 Oppo Smartphones Price Slashed up to Rs.2,000 in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X