గూగుల్ రహస్య ప్రాజెక్టులు (ఫోటో గ్యాలరీ)

|

ప్రపంచాన్ని వినూత్నంగా ఆవిష్కరించటంలో సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఎల్లప్పుడు ముందంజలో ఉంటుంది. గూగుల్ చేపడుతోన్న పలు రహస్య ప్రాజెక్టులు సాంకేతిక చరిత్రలోనే సరికొత్త అధ్యయనానికి నాంది పలికాయి. గూగుల్‌కు సంబంధించిన 10 ప్రాజెక్టుల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గూగుల్ రహస్య ప్రాజెక్టులు (ఫోటో గ్యాలరీ)

గూగుల్ రహస్య ప్రాజెక్టులు (ఫోటో గ్యాలరీ)

గూగుల్ ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న ప్రాజెక్టులలో డ్రైవర్‌లెస్ కారు ప్రాజెక్ట్ ఒకటి. గూగుల్ తయారు చేసిన ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కారులో స్టీరింగ్ వీల్, బ్రేక్స్, యాక్సిలరేటర్ ఉండవు. ఇవన్నీ కూడా కారులో ఉండే సాఫ్ట్‌వేర్, మెకానిక్స్ ద్వారా కంట్రోల్ చేయబడుతాయి. కారు పైభాగంలో మరియు ముందు వెనుక భాగాల్లో సెన్సార్లు, హెచ్‌డి సరౌండ్ కెమెరాలను ఇందులో ఉపయోగించారు. వీటితో పాటుగా మ్యాప్స్ సాయంతో కారు దానంతట అదే దిశానిర్దేశం చేసుకుంటుంది.

ఈ కారులో ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. ఇందులో కూర్చున్న వారు చేయాల్సిందల్లా రెండు సీట్లకు మధ్యలో ఉన్న స్టార్ట్/స్టాప్ బటన్‌ను ప్రెస్ చేయటమే. గూగుల్ కారు ఇంటీరియర్స్‌ను చాలా సింపుల్‌గా ఉంచారు. ఇందులో ప్యాసింజర్ సీట్ల ముందు కొంత లగేజ్ ఉంచుకునేందుకు స్థలం ఉంటుంది.

కారు ఏ రూట్లో వెళ్తుందో తెలిపేందుకు ఓ పెద్ద స్క్రీన్ ఉంటుంది. ప్రారంభ దశ కావటంతో ఈ డ్రైవర్ రహిత కారును వేగాన్ని గంటకు గరిష్టం 25 మైళ్ల (40 కెఎమ్‌పిహెచ్)కు మాత్రమే పరిమితం చేశారు. అయితే, గూగుల్ కో-ఫౌండర్ సెర్గీ బ్రిన్ తెలిపిన సమాచారం ప్రకారం, భవిష్యత్తులో ప్రొడక్షన్ మోడల్‌ను గరిష్టంగా గంటకు 100 మైళ్ల (160 కెఎమ్‌పిహెచ్) వేగంతో పరుగులు తీసేలా అభివృద్ధి చేయనున్నారు.

గూగుల్ రహస్య ప్రాజెక్టులు (ఫోటో గ్యాలరీ)

గూగుల్ రహస్య ప్రాజెక్టులు (ఫోటో గ్యాలరీ)

గూగుల్ ప్రాజెక్ట్ లూన్

ఇంటర్నెట్ యాంటెన్నాలను అమర్చిన బెలూన్‌లను ఆకాశంలోకి పంపించి వాటిద్వారా భూమ్మీద ఉన్న మారుమూల ప్రాంతాలకు సైతం అంతర్జాలం సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గూగుల్ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఇంటర్నెట్ సర్వీసులు ఆప్టికల్ ఫైబర్ తీగల ద్వారా అందుతున్నాయి. ఈ వ్యవహారం ఖరీదైనదిగా ఉండటంతో అనేక దేశాల్లో ఇంటర్నెట్ అందని ద్రాక్షగానే ఉంది. ప్రపంచ జనాభాలో 220 కోట్ల మందికి అందుబాటులో ఉండగా.. 480 కోట్ల మందకి దూరంగానే ఉంది. ఈ అంతరాన్ని తొలగించే లక్ష్యంతో గూగుల్ ఈ ప్రాజెక్టు పై పూర్తిస్థాయిలో కసరత్తులు చేస్తోంది. 18 నెలల క్రితం గూగుల్ ‘ప్రాజెక్ట్ లూన్' పేరుతో బెలూన్ ఇంటర్నెట్ ప్రయోగాన్ని అత్యంత రహస్యంగా చేపట్టంది.

గూగుల్ రహస్య ప్రాజెక్టులు (ఫోటో గ్యాలరీ)

గూగుల్ రహస్య ప్రాజెక్టులు (ఫోటో గ్యాలరీ)

స్మార్ట్ కాంటాక్ట్ లెన్స్

గూగుల్ డయాబెటిక్స్ స్మార్ట్ క్వాంటాక్ట్ లెన్స్ తయారీ పై దృష్టిసారించింది. ఈ లెన్స్ భవిష్యత్‌లో షుగర్ వ్యాధిగ్రస్తులకు మరింత ఉపయోగడనున్నాయి. రోజుకు 10 సార్లు తమ రక్తాన్ని తీుసుకుని పరీక్ష చేసుకోవచ్చు. ప్రస్తుతం నమూనా దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ త్వరలో వాస్తవరూపాన్ని అద్దుకోనుంది.

గూగుల్ రహస్య ప్రాజెక్టులు (ఫోటో గ్యాలరీ)

గూగుల్ రహస్య ప్రాజెక్టులు (ఫోటో గ్యాలరీ)

గూగుల్ లైవ్లీ

ఈ వెబ్ ఆధారిత వర్చువల్ కమ్యూనిటీ స్పేస్ ప్రాజెక్ట్‌లో భాగంగా యూజర్లు చాటింగ్‌లో భాగంగా తమ ఆన్‌లైన్ హ్యాంగవుట్ స్పేస్‌ను తమకు నచ్చినట్లు పర్సనలైజ్ చేసుకోవచ్చు. లిమిటెడ్ సెక్సెస్ అనంతరం గూగుల్ ఈ ప్రాజెక్టును 2008లో నిలిపివేసింది.

గూగుల్ రహస్య ప్రాజెక్టులు (ఫోటో గ్యాలరీ)

గూగుల్ రహస్య ప్రాజెక్టులు (ఫోటో గ్యాలరీ)

గూగుల్ ఎర్త్

గూగుల్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉత్పత్తులలో 'గూగుల్ ఎర్త్' ఒకటి. ఈ ప్రోగ్రామ్ ద్వారా గ్లోబ్‌లో మనకు నచ్చిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని మౌస్‌తో జూమ్ చేసుకుంటూ వెళితే ఆ ప్రదేశానికి సంబంధించి పరిసర ప్రాంతాలు, రోడ్లు, భవనాలు శాటిలైట్ చిత్రం రూపంలో మనకు కనిపిస్తాయి.

ఉపగ్రహ 3డి కోణంతో భూమిపై ఉన్న ప్రకృతిని మెరుగైన చిత్రాలుగా వినియోగదారులకు అందించడంలో సహాయపడుతుంది. దీని ద్వారా యూజర్స్ ఖచ్చితంగా మంచి అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. ఇందులో ఉన్న టెక్నాలజీ సహాయంతో నేరుగా వాటిని సవరించే అవకాశం లేకుండా భౌగోళిక ప్రకృతి దృశ్యాలను వినియోగదారులకు ప్రదర్శిస్తుంది.

గూగుల్ రహస్య ప్రాజెక్టులు (ఫోటో గ్యాలరీ)

గూగుల్ రహస్య ప్రాజెక్టులు (ఫోటో గ్యాలరీ)

ప్రాజెక్ట్ అరా

గూగుల్ ‘ప్రాజెక్ట్ అరా' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్ వ్యవస్థను వృద్ధి చేస్తోంది. ఈ వ్యవస్థలో భాగంగా యూజర్లు తమ హ్యాండ్‌సెట్‌లను తమకు నచ్చినట్లు కస్టమైజ్ చేసుకోవచ్చు. లిమిటెడ్ వర్షన్‌లో వీటిని గూగుల్ అందుబాటులోకి తీసుకురానుంది.

గూగుల్ రహస్య ప్రాజెక్టులు (ఫోటో గ్యాలరీ)

గూగుల్ రహస్య ప్రాజెక్టులు (ఫోటో గ్యాలరీ)

రోగాలను పసిగిట్టే పిల్

రోగాలను కనిపెట్లే ఓ మాత్రను తాము అభివృద్థి చేస్తున్నట్లు గూగుల్ ఇటీవల వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ వాస్తవ రూపాన్ని అద్దుకున్నట్లయితే ప్రమాదకర వ్యాధులను ముందుగానే

పసిగట్టవచ్చు.

గూగుల్ రహస్య ప్రాజెక్టులు (ఫోటో గ్యాలరీ)

గూగుల్ రహస్య ప్రాజెక్టులు (ఫోటో గ్యాలరీ)

ఫ్లైయింగ్ విండ్ టర్బైన్స్

ఈ ప్రాజెక్టును గూగుల్ 2013లోనే సొంతం చేసుకుంది. ఎయిర్‌బోర్న్ టర్బైన్‌ల ఆధారంగా తక్కువ ఖర్చులో శక్తిని సృష్టించటమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యం.

గూగుల్ రహస్య ప్రాజెక్టులు (ఫోటో గ్యాలరీ)

గూగుల్ రహస్య ప్రాజెక్టులు (ఫోటో గ్యాలరీ)

గూగుల్ +

గూగుల్+ పేరుతో సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌ను గూగుల్ 2011లో ఆవిష్కరించింది. ఈ సామాజిక సంబంధాల వేదికకు ప్రస్తుతం 50 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు.

గూగుల్ రహస్య ప్రాజెక్టులు (ఫోటో గ్యాలరీ)

గూగుల్ రహస్య ప్రాజెక్టులు (ఫోటో గ్యాలరీ)

గూగుల్ బుక్స్

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా గూగుల్ మిలియన్ల కొద్ది పుస్తకాలను డిజిటలైజ్ చేయనుంది. 2004లోనే ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది.

Best Mobiles in India

English summary
These Are Google’s 10 Boldest Projects Ever. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X