Home
News

2021లో యూజర్లు అత్యధికంగా సందర్శించిన 10 వెబ్‌సైట్‌లు ఇవే!! మొదటి స్థానంలో టిక్‌టాక్

ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే వెబ్‌సైట్ ఏది? అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీ యొక్క సమాధానంగా మీరు గూగుల్ అని చెప్పే అవకాశం అధికంగా ఉంటుంది కదూ. అయితే క్లౌడ్ సర్వీస్ సంస్థ క్లౌడ్‌ఫ్లేర్ ప్రకారం సుందర్ పిచాయ్ CEOగా పనిచేస్తున్న కంపెనీ గూగుల్ నిజంగా 2021లో అత్యధికంగా సందర్శించిన వెబ్‌సైట్ మాత్రం కాదు. మొదటి స్థానంలో ఉన్న సంస్థ ఏది అన్న విషయానికి వస్తే కొద్దిగా ఆశ్చర్యపోక మానరు. ఎందుకంటే గత సంవత్సరం యూజర్ల యొక్క డేటాను లీక్ చేస్తున్న కారణంగా ఇండియాలోనే కాకుండా మరికొన్ని దేశాలలో నిషేదించిన చిన్న వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ TikTok మొదటి స్థానంలో ఉంది. ఇది ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే వెబ్‌సైట్‌గా అగ్రస్థానంలో ఉంది. ఈ జాబితాలో మరికొన్ని ఆశ్చర్యకరమైనవి కూడా ఉన్నాయి. వీటి గురించి మరింత తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

TikTok.com

TikTok.com

భారతదేశంలో చిన్న వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ TikTok నిషేధించబడినప్పటికీ TikTok నెలవారీ సుమారు 1 బిలియన్ వరకు క్రియాశీల వినియోగదారులను కలిగి ఉందని పేర్కొంది. ByteDance యాజమాన్యంలో ఉన్న ఈ యాప్ ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి అధిక మొత్తంలో ట్రాఫిక్‌ను సొంతం చేసుకున్నది.

Google.com

Google.com

ఆశ్చర్యం ఏమిటంటే ప్రజలు ఎటువంటి చిన్న సందేహం వచ్చిన ఆశ్రయించే గూగుల్ వెబ్‌సైట్ ఈ జాబితాలో మొదటి స్థానంలో కాకుండా రెండవ స్థానంలో ఉండడం. ఇప్పటికీ ఇది ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే రెండవ వెబ్‌సైట్‌గా తన యొక్క స్థానాన్ని దక్కించుకున్నది. ఇది నెలవారీ సుమారు 1 బిలియన్ వరకు క్రియాశీల వినియోగదారులను కలిగి ఉందని పేర్కొంది.

Facebook.com

Facebook.com

ఈ జాబితాలో ప్రముఖ ఫోటో షేరింగ్ యాప్ ఫేస్‌బుక్ తరువాతి స్థానంలో ఉంది. ఇది మెటా కంపెనీగా రీబ్రాండ్ చేయబడి ఉండవచ్చు కానీ డొమైన్ పేర్లు అలాగే ఉంటాయి. ఈ జాబితాలో ఫేస్‌బుక్ 0.8 బిలియన్ క్రియాశీల వినియోగదారులతో మూడో స్థానంలో నిలిచింది.

Microsoft

Microsoft

Microsoft కంపెనీ ఈ జాబితాలో తరువాతి స్థానంలో ఉంది. మైక్రోసాఫ్ట్ సంస్థ యొక్క సేవలు అన్ని కూడా OneDrive, Xbox మరియు ఇతర ట్రాఫిక్ లతో మిళితం చేయబడింది. ఇది చాలా మంది వ్యక్తులు వెబ్‌సైట్‌ను సందర్శించేలా చేస్తుంది.

Apple

Apple

ఈ జాబితాలో ఆపిల్ సంస్థ 5వ స్థానంలో కొనసాగడం అనేది కూడా కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. iCloud, App Store మరియు కంపెనీ యొక్క ఇతర సేవలను సందర్శించే వ్యక్తులు అధికంగా ఉన్నప్పటికీ ఈ స్థానాన్ని కలిగి ఉంది.

Amazon

Amazon

కరోనా సమయంలో చాలా మంది వ్యక్తులు ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ యొక్క ప్లాట్‌ఫారమ్ నుండి ఆన్‌లైన్ షాపింగ్ చేయడానికి అధికంగా ఇష్టపడ్డారు. ఇది 2021లో అత్యధికంగా సందర్శించిన వెబ్‌సైట్ ల జాబితాలో 6వ స్థానంలో చోటును దక్కించుకున్నది.

Netflix

Netflix

ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ జాబితాలో ఏడవ స్థానంను దక్కించుకున్నది. ఈ నెట్‌ఫ్లిక్స్ OTT యాప్ తన యొక్క ప్లాట్‌ఫారమ్ లోని విస్తృతమైన కంటెంట్ తో అధిక మందిని ఆకట్టుకొని అధిక ప్రజాదరణ పొందిన వారి యొక్క స్థానంలో చేరింది.

YouTube

YouTube

ప్రయాణ సమయాలలో మరియు విరామ సమయాలలో వినోదం కోసం అధిక మంది ఎంచుకునే వీడియో ప్లాట్‌ఫారమ్లలో యూట్యూబ్ ఈ జాబితాలో 8వ స్థానంలో ఉంది. నచ్చిన మరియు కొత్త సినిమా యొక్క ట్రైలర్ వీడియోలను చూడటానికి చాలా మంది ఈ యూట్యూబ్ ప్లాట్‌ఫారమ్‌ను ఆశ్రయించడంతో యూట్యూబ్ 8వ స్థానంలో ఉంది.

Twitter

Twitter

యాప్‌ల విషయానికి వస్తే ట్విట్టర్ అటువంటి జాబితాలను చాలా అరుదుగా చేస్తుంది కానీ వెబ్ వెర్షన్ చాలా ప్రజాదరణ పొంది ఈ జాబితాలో 9వ స్థానంను దక్కించుకున్నది.

WhatsApp

WhatsApp

మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే టాప్ 10 వెబ్‌సైట్‌ల జాబితాలో 10వ స్థానంలో ఉంది. టాప్ 10 జాబితాలో మెటా యాజమాన్యంలోని రెండు యాప్ లు ఉండడం విశేషం.

More from GizBot

Best Mobiles in India

English summary
These are The 10 Most Visited Websites by Users in 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X