స్కామర్లకు రిమోట్ కీలుగా పనిచేసే ఈ యాప్లతో జాగ్రత్త

|

ఇండియాలో ఇప్పుడు చాలా మంది కరోనా సమయం నుంచి ఇంటి వద్దనే ఉంటూ పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇంటర్నెట్ ను అధికంగా వినియోగించే వినియోగదారులకు కస్టమర్ కేర్ మోసాలు అతి పెద్ద సమస్యగా మారాయి. చాలా సందర్భాల్లో ప్రజలు గూగుల్‌లో ఏదైనా సంస్థ యొక్క కస్టమర్ కేర్ నంబర్ ను శోధించి డయల్ చేసి నకిలీ స్కామ్‌స్టర్‌ల చేత మోసపోయిన సందర్బాలు చాలానే ఉన్నాయి.

రిమోట్ డెస్క్‌టాప్ యాప్

రిమోట్ డెస్క్‌టాప్ యాప్

ఈ స్కామర్లు తమ ఆండ్రాయిడ్ ఫోన్లలో రిమోట్ డెస్క్‌టాప్ యాప్ లను డౌన్‌లోడ్ చేయమని తెలిపి మీ యొక్క బ్యాంక్ అకౌంటుల నుండి డబ్బును దొంగిలించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆండ్రాయిడ్ ఫోన్‌లలో రిమోట్ డెస్క్‌టాప్ యాప్ లు ఎలా పనిచేస్తాయనే దాని గురించి తెలియక బాధితులు తమ మొత్తం మొబైల్ స్క్రీన్‌ను స్కామర్‌తో చేస్తారు. ఇది OTP లతో పాటు బ్యాంక్ లేదా UPI లాగిన్ వివరాలను బాధితుల ఫోన్‌ల నుంచి రహస్యంగా సేకరిస్తుంది. ఇటువంటి రిమోట్ యాప్ లను కలిగి ఉంటే వెంటనే డిలీట్ చేయండి.

మోసగాళ్ల చేతిలో ఆయుధంగా రిమోట్ డెస్క్‌టాప్ యాప్లు

మోసగాళ్ల చేతిలో ఆయుధంగా రిమోట్ డెస్క్‌టాప్ యాప్లు

రిమోట్ డెస్క్‌టాప్ యాప్ లు మాల్వేర్ యొక్క వైరస్ ను వ్యాపించవు కానీ మీ యొక్క ఫోన్ లను రిమోట్‌గా పర్యవేక్షించడానికి ఉపయోగపడుతుంది. ప్రజలలో ఎక్కువ మందికి డిజిటల్ పరిజ్ఞానం లేకపోవడంతో ఈ రిమోట్ యాప్ లు అనేవి మోసగాళ్ల చేతిలో ఆయుధంగా మారుతున్నాయి. మీ ఫోన్ లోని ఏదైనా సమస్యల పేరుతో మీకు సహాయపడటానికి కస్టమర్ కేర్ సపోర్ట్ బృందంతో ఇటువంటి యాప్ లను డౌన్‌లోడ్ చేయమని చాలా మంది ప్రయత్నం చేస్తూఉంటారు. ఇటువంటి మోసాలను నివారించడానికి రిమోట్ డెస్క్‌టాప్ యాప్ లను డౌన్‌లోడ్ చేయకుండా ఉండడం చాలా మంచిది. అటువంటి కొన్ని యాప్ ల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

TeamViewer QuickSupport

TeamViewer QuickSupport

టీమ్‌వ్యూయర్ క్విక్‌సపోర్ట్ అనే యాప్ ఫోన్‌లు మరియు పిసిలను రిమోట్‌గా నియంత్రించడానికి IT నిర్వాహకులు ఉపయోగించే చాలా సాధారణ యాప్. ఇది చాలా సహాయకారిగా ఉన్నప్పటికీ టీమ్‌వ్యూయర్ క్విక్‌సపోర్ట్ ఎలా పనిచేస్తుందో అన్న విషయం తెలియకపోతే కనుక దాన్ని డౌన్‌లోడ్ చేయకపోవడం చాలా ఉత్తమం. బ్యాంక్ లాగిన్ వివరాలు మరియు OTP లను దొంగిలించడానికి స్కామర్లు ఉపయోగించే అత్యంత సాధారణ యాప్ లలో ఇది ఒకటి.

Microsoft Remote desktop యాప్

Microsoft Remote desktop యాప్

మైక్రోసాఫ్ట్ రిమోట్ డెస్క్‌టాప్ యాప్ కూడా వినియోగదారులను రిమోట్ పిసి లేదా వర్చువల్ యాప్ లకు కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ఇది చాలా IT వారికి సహాయకారి యాప్ టీమ్‌వ్యూయర్ క్విక్‌సపోర్ట్ మాదిరిగానే పనిచేస్తుంది. అయినప్పటికీ రిమోట్ డెస్క్‌టాప్ యాప్ లు ఎలా పనిచేస్తాయనే దానిపై బాధితుడికి ఎటువంటి ఆధారాలు లేనట్లయితే కనుక స్కామర్‌లకు ఇది చాలా ప్రభావవంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది.

AnyDesk Remote Control యాప్

AnyDesk Remote Control యాప్

వ్యాపార వినియోగదారులకు రిమోట్ డెస్క్‌టాప్‌లను నిర్వహించడానికి ఎనీడెస్క్ రిమోట్ కంట్రోల్ అత్యంత ఇష్టపడే సాధనాల్లో ఒకటి. స్కామర్లు బాధితులను తమ యొక్క పరికరాలలో డౌన్‌లోడ్ చేయమని బలవంతం చేసే అత్యంత సాధారణ యాప్ లలో ఇది అన్నిటికన్నా ముందు వరుసలో ఉంటుంది. మీకు ఈ యాప్ యొక్క పనితీరు అర్థం కాకపోతే కనుక ఎనీడెస్క్ నుండి దూరంగా ఉండడం అన్నిటికన్నా ఉత్తమం.

Best Mobiles in India

English summary
These are The Apps That Act as Remote Keys For Scammers on your Android phones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X