వర్క్@హోమ్ యూజర్లకు రూ.1,000 కంటే తక్కువ ధర గల బెస్ట్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు ఇవే

|

ఇండియాలో ఇంటి వద్ద నుండి పని చేసే రిమోట్ వర్కింగ్ ట్రెండ్‌లు ఇంకా చాలా నెలలపాటు ఉండే అవకాశం ఉన్నందున సమర్థవంతమైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల కోసం చూస్తున్న చాలా మంది వ్యక్తులు ఉన్నారు. వినియోగదారులు చాలా మంది ఇప్పటికీ సాధారణ ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లపై ఆధారపడుతున్నారు. కానీ ఇవి బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల వలె సమర్థవంతంగా లేవు. బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లకు పేరుగాంచిన కొన్ని ప్రముఖ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లలో ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, టాటా స్కై మరియు ప్రభుత్వరంగ టెలికం బిఎస్‌ఎన్‌ఎల్ ఉన్నాయి. వినియోగదారుల కోసం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు 200 Mbps డేటా వేగాన్ని అందించే రూ.1,000 కంటే తక్కువ ధర కలిగిన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు అపరిమిత ఇంటర్నెట్ డేటాను అందిస్తున్న వాటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

వర్క్ ఫ్రమ్ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

వర్క్ ఫ్రమ్ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బ్రాడ్‌బ్యాండ్ రూ.499 ధరతో అందించే ప్లాన్ 40 Mbps ఇంటర్నెట్ స్పీడ్‌తో అపరిమిత ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది. ఇది అదనంగా వింక్ మ్యూజిక్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ మరియు షా అకాడమీ వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ ఎరోస్ నౌ, హంగామా ప్లే, వూట్ బేసిక్, షెమరూమి వాటికి అల్ట్రా యాక్సెస్‌ను అందిస్తుంది. మరోవైపు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ రూ.799 ధర వద్ద లభించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ రూ.599 ప్లాన్ వలె 70 Mbps వేగంతో అపరిమిత డేటాను మరియు ఇతర ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే రూ.999 ధర వద్ద లభించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కూడా అపరిమిత ఇంటర్నెట్‌ని 200 Mbps వేగంతో అందిస్తుంది.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ రూ .1,000 లోపు త్రైమాసిక, అర్ధ వార్షిక మరియు వార్షిక ప్రణాళికలను అందిస్తుంది. ఇందులో టాటా స్కై యొక్క మూడు నెలల వాలిడిటీ ప్లాన్ 50 Mbps వేగంతో నెలకు రూ.699 ధర వద్ద లభిస్తుంది. ఇది అదనంగా అపరిమిత ల్యాండింగ్ కాల్స్ లను కూడా అందిస్తుంది. టాటా స్కై 100 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 100 Mbps వేగంతో నెలకు రూ.950 ధర వద్ద అపరిమిత కాలింగ్‌ను అందిస్తుంది.

JioFiber
 

JioFiber రూ.399, రూ. 699 మరియు రూ .999 ధరల వద్ద బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తుంది. ఇందులో రూ.399 ప్లాన్ 30 Mbps వేగంతో అపరిమిత ఇంటర్నెట్‌ను అందిస్తుంది. అయితే రూ.699 ప్లాన్ 60 Mbps వద్ద అపరిమిత ఇంటర్నెట్‌ను అందిస్తుంది. ఈ రెండు ప్లాన్‌లు ఎటువంటి బండిల్ OTT సబ్‌స్క్రిప్షన్‌లను అందించవు కానీ అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను అందిస్తాయి. మరోవైపు రూ.999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 150 Mbps వేగంతో అపరిమిత ఇంటర్నెట్‌ను అందిస్తుంది. ఇది అమెజాన్ ప్రైమ్, సోనీ LIV, డిస్నీ+ హాట్‌స్టార్, ఆల్ట్ బాలాజీ, ZEE5 వంటి రూ.1,000 విలువైన ఇతర ప్రయోజనాలకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది.

BSNL

చివరగా BSNL రూ.449 ధర వద్ద లభించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ఇంటి వద్ద నుండి పని చేసే వారి కోసం అందిస్తుంది. రూ.1,000 లోపు ధర కలిగిన ప్లాన్‌లు ప్రచార ప్రాతిపదికన మరిన్ని అందుబాటులో ఉన్నాయి. బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థ తన వినియోగదారులకు 'ఫైబ్రో కాంబో ULD 1999 CS 311' పేరుతో 150Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌తో యూజర్లు 1500GB డేటాను పొందుతారు. దీని తరువాత దీని వేగం 2 Mbps కు తగ్గించబడుతుంది. ప్రస్తుతానికి ఈ ప్లాన్ బెంగళూరులో నివసించే ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉంది. దీనితో వినియోగదారులు అపరిమిత కాల్స్ యొక్క టెలిఫోన్ లైన్‌ను కూడా పొందుతారు. ఈ ప్లాన్ నెలకు రూ.1,999 ధర వద్ద లభిస్తుంది. రాబోయే రోజుల్లో మరిన్ని నగరాలు మరియు టెలికాం సర్కిల్‌లలో బిఎస్‌ఎన్‌ఎల్ తన 150Mbps స్పీడ్ ప్లాన్‌ను అందించనున్నది.

Best Mobiles in India

English summary
These are The Best Broadband Plans For Work @ Home Users Priced Below Rs.1,000

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X