Home
News

జులైలో రూ.300 లోపు లభించే టెల్కోల ఉత్తమ ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే...

ప్రస్తుతం ఇండియాలో అందుబాటులో గల టెలికాం ఆపరేటర్లు అన్ని కూడా తమ చందాదారుల యొక్క ఇంటర్నెట్ మరియు కాలింగ్ అవసరాలను తీర్చడానికి విస్తృతమైన ప్రీపెయిడ్ ప్లాన్ లను అందిస్తున్నారు. ప్రఖ్యాత భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా(Vi) మరియు బిఎస్‌ఎన్‌ఎల్ టెలికం ఆపరేటర్లు అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌లు అనేక ప్రయోజనాలతో నిండి ఉన్నాయి. ఈ అన్ని టెలికాం దిగ్గజాలు రూ .300 లోపు గల ప్రీపెయిడ్ ప్లాన్‌లతో మంచి చెల్లుబాటు వ్యవధితో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఈ టెలికం ఆపరేటర్లు అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో రూ.149, రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్‌ల వివరాలు

రిలయన్స్ జియో రూ.149, రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్‌ల వివరాలు

మీరు ఇంటర్నెట్ ను అధికంగా వినియోగించని వినియోగదారుడు అయితే కనుక మరియు 1GB ఇంటర్నెట్ డేటా మీకు సరిపోతే కనుక జియో అందించే రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్‌ యూజర్లకు రోజుకు 1GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్‌ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను కూడా పొందుతారు. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు 24 రోజులు. దీనిని పొందిన వినియోగదారులు JioTV, JioCinema వంటి మరిన్ని జియో యాప్ లకు ఉచిత చందాను పొందుతారు. అలాగే రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే వినియోగదారులు రోజుకు 2GB డేటాను 28 రోజుల వాలిడిటీ కాలానికి పొందుతారు. దీనితో పాటుగా అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలు కూడా ప్యాక్‌లో చేర్చబడ్డాయి. అలాగే జియో యొక్క OTT చందాలకు ఉచిత యాక్సిస్ లభిస్తుంది.

భారతి ఎయిర్‌టెల్ రూ. 199, రూ .249 ప్రీపెయిడ్ ప్లాన్‌ల వివరాలు

భారతి ఎయిర్‌టెల్ రూ. 199, రూ .249 ప్రీపెయిడ్ ప్లాన్‌ల వివరాలు

భారతి ఎయిర్‌టెల్ టెల్కో రూ.199 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్ అనేక ప్రయోజనాలతో నిండి ఉంది. ఇది 1GB రోజువారి డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100SMS ప్రయోజనాలను 24 రోజుల చెల్లుబాటు కాలానికి పొందుతారు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క అదనపు ప్రయోజనాలలో వింక్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్, ఉచిత హలో ట్యూన్లు, 30 రోజుల ఉచిత అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ట్రయల్ వంటివి మరిన్ని ఉన్నాయి. మరోవైపు రూ.249 ధర వద్ద లభించే ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 1.5GB డేటాను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. దీనితో పాటుగా అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100SMS ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అలాగే వినియోగదారులకు అమెజాన్ మొబైల్ ఎడిషన్ ఫ్రీ ట్రయల్, 1 ఇయర్ షా అకాడమీ కోర్సులు, ఉచిత హలో ట్యూన్స్, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం వంటివి మరిన్ని ఉచితంగా లభిస్తాయి.

వోడాఫోన్ ఐడియా రూ 199 మరియు రూ .299 ప్రీపెయిడ్ ప్లాన్‌ల వివరాలు

వోడాఫోన్ ఐడియా రూ 199 మరియు రూ .299 ప్రీపెయిడ్ ప్లాన్‌ల వివరాలు

వోడాఫోన్ ఐడియా టెల్కో రూ.199 ధర వద్ద అందించే ప్రీపెయిడ్ ప్లాన్ రోజువారి 1GB ఇంటర్నెట్ డేటా, అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను చందాదారులకు 24 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క అదనపు ప్రయోజనాలలో Vi మూవీస్ మరియు టీవీ సేవలు కూడా ఉన్నాయి. వోడాఫోన్ ఐడియా రూ.299 ధర వద్ద అందించే మరొక ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 4GB ఇంటర్నెట్ డేటాను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. దీనితో పాటుగా చందాదారులు అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు వారాంతపు డేటా రోల్‌ఓవర్ సౌకర్యం లభిస్తుంది. డబుల్ డేటా ప్రయోజనం కూడా ప్లాన్ లో చేర్చబడింది.

బిఎస్‌ఎన్‌ఎల్ రూ .187, రూ .298 ప్రీపెయిడ్ ప్లాన్‌ల వివరాలు

బిఎస్‌ఎన్‌ఎల్ రూ .187, రూ .298 ప్రీపెయిడ్ ప్లాన్‌ల వివరాలు

ప్రభుత్వ యాజమాన్యంలోని బిఎస్‌ఎన్‌ఎల్ టెల్కో బహుళ ప్రయోజనాలతో రూ.300 ధర లోపు రెండు ప్రీపెయిడ్ ప్లాన్ లను అందిస్తుంది. బిఎస్‌ఎన్‌ఎల్ టెల్కో రూ.187 ధర వద్ద అందించే ప్రీపెయిడ్ ప్లాన్ రోజువారి 2GB ఇంటర్నెట్ డేటాను 28 రోజుల సర్వీస్ వాలిడిటీతో అందిస్తుంది. ఇందులో అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలు కూడా ప్యాక్‌లో చేర్చబడ్డాయి. BSNL యొక్క రూ.298 ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలతో సహా రోజువారి 1GB డేటాను 56 రోజుల పాటు అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క అదనపు ప్రయోజనాలలో EROS NOW సేవలు కూడా ఉన్నాయి.

Best Mobiles in India

English summary
These are The Best Prepaid Plans Available For Less Than Rs.300 in July 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X