Airtel టారిఫ్ పెంపు తర్వాత రూ.300లోపు ధర వద్ద గల బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే

|

ఇండియాలోని ప్రైవేట్ టెలికాం సంస్థలు అన్ని కూడా ఇటీవల ధరలు పెంచడం చర్చనీయాంశమైంది. జియో, ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్ ఐడియా(vi) వంటి అన్ని ప్రధాన టెలికాం కంపెనీలు తమ ప్రీపెయిడ్ ప్లాన్‌లపై టారిఫ్‌లను పెంచాయి. టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ కూడా తన ప్రీపెయిడ్ ప్లాన్‌లపై టారిఫ్‌లను దాదాపు 25% వరకు పెంచింది. ఈ టారిఫ్‌లలో మార్పులు టెలికాం కంపెనీలు మధ్య కాలానికి 5G మొబైల్ సేవల్లో పెట్టుబడి పెట్టడానికి మార్గం సుగమం చేస్తాయని నివేదికలు సూచిస్తున్నాయి. ధరల పెంపు తర్వాత రూ.300లోపు Airtel అందించే అప్‌డేట్ చేయబడిన ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ టెల్కో ధరల పెంపు తరువాత రూ.300లోపు ధరలో అందించే మొదటి మరియు ప్రధానమైన ప్లాన్ రూ.155 ధర వద్ద లభిస్తుంది. ఇది నిజమైన అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఈ ప్యాక్ యొక్క చెల్లుబాటు వ్యవధి 24 రోజులు. ఈ ప్లాన్‌తో అపరిమిత కాల్‌లతో పాటు, వినియోగదారులు మొత్తం 1GB ఇంటర్నెట్ డేటాను కూడా పొందుతారు. వినియోగదారులు ఈ ప్లాన్‌తో మొత్తం 300 SMSలను పంపవచ్చు మరియు మొబైల్ ఎడిషన్ అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క ఉచిత ట్రయల్‌ను కూడా పొందవచ్చు.

ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్ నుండి లభించే తదుపరి ప్లాన్ రూ.179 ధరతో వస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటు వ్యవధికి అపరిమిత కాలింగ్ ఎంపికతో అందిస్తుంది. ఈ ప్లాన్ మొబైల్ ఎడిషన్ Amazon Prime వీడియో యొక్క ఉచిత ట్రయల్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు వినియోగదారులు మొత్తం 2GB ఇంటర్నెట్ డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 300 SMSలను కూడా పొందుతారు. పైన పేర్కొన్న రెండు ప్లాన్‌లకు 300 SMS పంపిన తర్వాత ఎయిర్‌టెల్ పంపిన ప్రతి SMSకి రూ.1 వసూలు చేస్తుందని గమనించాలి.

రూ.239 ప్లాన్

జాబితాలోని తదుపరి ప్లాన్ రూ.239 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100 SMSలను అందిస్తుంది. అంతేకాకుండా వినియోగదారులు రోజుకు 1GB ఇంటర్నెట్ డేటా ప్రయోజనంను 24 రోజుల చెల్లుబాటుకాల వ్యవధిలో అందిస్తుంది. అదనపు ప్రయోజనాలలో మొబైల్ ఎడిషన్ Amazon Prime వీడియో యొక్క ఉచిత ట్రయల్ మరియు Wynk Music యాక్సెస్ ఉన్నాయి. జాబితాలోని నాల్గవ ప్లాన్ పైన రూ.239 ప్లాన్ కు సమానంగా ఉంటుంది. ఈ ప్లాన్ రూ.265 ధరతో వస్తుంది. ఇది అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100 SMSలను కూడా అందిస్తుంది. సబ్‌స్క్రైబర్‌లు పైన పేర్కొన్న విధంగానే రోజుకు 1GB ఇంటర్నెట్ డేటాను కూడా పొందుతారు. అయితే ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ వ్యవధి 28 రోజులు. అదనపు ప్రయోజనంలో మొబైల్ ఎడిషన్ అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క అదే ఉచిత ట్రయల్ మరియు వింక్ మ్యూజిక్ యాక్సెస్ ఉన్నాయి.

చివరి ప్లాన్

రూ. 300 లోపు జాబితాలో వచ్చే చివరి ప్లాన్ రూ.299 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100 SMSలను అందిస్తుంది. అలాగే వినియోగదారులు రోజుకు 1.5GB డేటాను పొందుతారు. మరియు ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు వ్యవధి 28 రోజులు. అదనపు ప్రయోజనాలలో అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు వింక్ మ్యూజిక్‌తో పాటు, ఈ ప్లాన్ షా అకాడమీకి ఉచిత యాక్సెస్ మరియు ఉచిత హెలోట్యూన్స్ వంటి కొన్ని అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.

Airtel డేటా టాప్-అప్‌ల కొత్త ధరల వివరాలు

Airtel డేటా టాప్-అప్‌ల కొత్త ధరల వివరాలు

** రూ.48 ప్లాన్ రూ.58కి పెంపు: 3GB డేటాను ఆఫర్ చేస్తుంది.

** రూ.98 ప్లాన్ రూ.118కి పెంపు: 12GB డేటాను ఆఫర్ చేస్తుంది.

** రూ.251 ప్లాన్ రూ.301కి పెరిగింది: 50GB డేటాను ఆఫర్ చేస్తుంది.

 

Best Mobiles in India

English summary
These are The Best Prepaid Plans Below Rs.300 After Airtel Tariff Hike

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X