Vodafone Idea యూజర్లకు అందుబాటులో ఉన్న ఎంటర్టైన్మెంట్ ప్యాక్‌లు ఇవే...
ఇండియాలోని టెలికాం రంగంలో గల సంస్థలలో ఒకటైన వోడాఫోన్ ఐడియా యూజర్ బేస్ ను పెంచుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నది. జియో సంస్థ టెలికాం రంగంలోకి ప్రవేశించడానికి ముందు అధిక యూజర్ బేస్ ను కలిగిన వోడాఫోన్ సంస్థ మళ్ళి తన యొక్క పూర్వ వైభవాన్ని పొందడానికి ప్రతి ప్రీపెయిడ్ ప్లాన్ మీద ప్రత్యేకమైన సర్వీసులను అందిస్తున్నది. వొడాఫోన్ ఐడియా వెబ్‌సైట్‌లో లభించిన తాజా సమాచారం ప్రకారం కాలర్ ట్యూన్స్ ప్యాక్, గేమ్స్ ప్యాక్, స్పోర్ట్స్ ప్యాక్, కాంటెస్ట్ ప్యాక్ మరియు స్టార్ టాక్ టైమ్ వంటి ప్యాక్ లను రూ.100 లోపు లభించే ప్రీపెయిడ్ ప్లాన్‌లతో అందిస్తున్నది. ఈ ప్లాన్‌లన్నీ కూడా వేర్వేరు సేవలను అందిస్తున్నది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వోడాఫోన్ ఐడియా కాలర్ ట్యూన్స్ ప్యాక్ ప్రయోజనాలు
వోడాఫోన్ ఐడియా(Vi) కాలర్ ట్యూన్స్ ప్యాక్ రూ.47 మరియు రూ.78 రెండు ధరల వద్ద లభిస్థాయి. టెల్కో యొక్క ఈ ప్లాన్‌లు వరుసగా 28 మరియు 89 రోజుల చెల్లుబాటు కాలంలో ఉచిత కాలర్ ట్యూన్‌లను ఎన్నిసార్లు అయిన మార్పు చేసే ఎంపికతో అందిస్తుంది అని టెల్కో తెలిపింది. ఈ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసే Vi కస్టమర్‌లు కాలర్ ట్యూన్‌ను సెట్ చేయడానికి లేదా సవరించడానికి గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్ నుండి ‘Vi కాలర్‌ట్యూన్స్' యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

వొడాఫోన్ ఐడియా గేమ్స్ ప్యాక్ ప్రయోజనాలు
ప్రస్తుత సమయాలలో ప్రజలు వినోదం కోసం ఎంచుకునే వాటిలో గేమ్స్ కూడా ఒకటి. vi యూజర్లకు ఈ 'గేమ్స్ ప్యాక్' రూ.32 ధర వద్ద స్టాండర్డ్ గేమ్స్ ప్యాక్ మరియు రూ.62 ధర వద్ద 'గేమ్స్ లాంగ్ వాలిడిటీ' ప్యాక్ లను అందిస్తున్నది. ఈ గేమ్స్ ప్యాక్ లతో సుమారు 200 కి పైగా జనాదరణ పొందిన గేమ్ లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తున్నాయి. ఈ సర్వీస్ వివరాల కోసం వినియోగదారులు Vi మొబైల్ యాప్ నుండి live.vodafone.in/games కు వెళ్ళవచ్చు లేదా GAMES అనే పదాన్ని టైప్ చేసి 199 కు SMS పంపవచ్చు.

వొడాఫోన్ ఐడియా స్పోర్ట్స్ ప్యాక్ ప్రయోజనాలు
వొడాఫోన్ ఐడియా(Vi) స్పోర్ట్స్ ప్యాక్‌లు రూ.42 మరియు రూ.72 ధరల వద్ద వరుసగా 28 మరియు 89 రోజుల వాలిడిటీ ప్రయోజనాలతో వస్తుంది. ఈ స్పోర్ట్స్ ప్యాక్‌తో Vi కస్టమర్లు క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్, ఫార్ములా 1, హాకీ వంటి మరిన్నింటిని SMS ద్వారా పొందవచ్చు. ఈ ప్యాక్ పొందడం కోసం 545454 టోల్ ఫ్రీ నెంబర్ కు డయల్ చేయడం ద్వారా లేదా మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ప్లాన్‌లను రీఛార్జ్ చేయడం ద్వారా పొందవచ్చు.

వోడాఫోన్ ఐడియా స్టార్ టాక్ ప్యాక్ ప్రయోజనాలు
వొడాఫోన్ ఐడియా(Vi) తన యూజర్లకు ‘స్టార్ టాక్' ప్యాక్‌లను రూ.52 మరియు రూ.103 దరల వద్ద అందిస్తున్నది. ఈ ప్యాక్‌లతో Vi యూజర్లు ఎక్కడ ఉన్నా తమ అభిమాన తారలతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశాన్ని ఇస్తున్నది. Vi వినియోగదారులను సెలబ్రిటీలతో చాట్ చేయడానికి మరియు వారి సంభాషణలను వినడానికి అనుమతిస్తుంది. ఇది వాయిస్-ఆధారిత చాట్ సర్వీస్ కావున దీనిని టోల్ ఫ్రీ నంబర్- 533333 డయల్ చేయడం ద్వారా యాక్టీవేట్ చేయవచ్చు లేదా Vi యొక్క వెబ్‌సైట్ లేదా మొబైల్ అనువర్తనం ద్వారా రీఛార్జ్ చేయవచ్చు.


Click it and Unblock the Notifications








