Home
News

మీ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అవసరమైన మెడికల్ గాడ్జెట్లు ఇవే...

కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ప్రతి ఒక్కరు బయట తిరగడానికి భయపడుతున్నారు. అలాగే తమ యొక్క ఆరోగ్యం గురించి ప్రత్యేక జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. మీ ఆరోగ్యంకు సంబందించిన డేటా గురించి ఖచ్చితమైన మరియు స్థిరమైన డేటాను మీ వైద్యుడికి అందించగలిగితే కనుక ఇది వారికి చాలా సహాయపడుతుంది. మీ ఆరోగ్యంకు సంబందించిన సరైన డేటా అందుబాటులో ఉంటే సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు, ఏదైనా అనారోగ్యం లేదా అనారోగ్యాన్ని నిర్ధారించడం వైద్యుడికి మరింత సులభం అవుతుంది.

గాడ్జెట్లు

రక్తపోటు, రక్త, ఆక్సిజన్ స్థాయిలు, శ్వాసక్రియ రేటు, పల్స్ రేటు వంటివి మీ యొక్క ఆరోగ్య సమస్యలను ట్రాక్ చేయడంలో సహాయపడటానికి తక్కువ-ధర వద్దనే కొన్ని గాడ్జెట్లు అందుబాటులో ఉన్నాయి. వ్యక్తిగత ఉపయోగం కోసం మెడికల్ గాడ్జెట్లను కొనుగోలు చేసేటప్పుడు సరైన సలహా పొందడానికి మీరు మీ వైద్యుడితో మాట్లాడటం ఉత్తమం. మీ ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా తెలుసుకోవడానికి మీ ఇంట్లో ఈ ఏడు మెడికల్ గాడ్జెట్లను ఉంచుకోవలసి ఉంటుంది.

గుండె పనితీరును ట్రాక్ చేయడానికి వ్యక్తిగత పోర్టబుల్ ECG మానిటర్

గుండె పనితీరును ట్రాక్ చేయడానికి వ్యక్తిగత పోర్టబుల్ ECG మానిటర్

స్మార్ట్‌ఫోన్ కంపానియన్ యాప్ తో పనిచేసే పోర్టబుల్ పర్సనల్ ECG మానిటర్ మీకు రోజువారీ ECGని ఎటువంటి ఇబ్బంది లేకుండా రికార్డ్ చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది మీ గుండె ఆరోగ్యాన్ని కూడా పర్యవేక్షిస్తుంది. ప్రారంభ దశలోనే ఏ విధమైన అవకతవకలను గుర్తించడానికి ఈ రికార్డింగ్‌లు వైద్యులకు సమాచార వనరుగా ఉపయోగపడతాయి. పోర్టబుల్ వ్యక్తిగత ECG మానిటర్ గురించి సిఫార్సలు మరియు సలహాల కోసం మీకు తెలిసిన వైద్య నిపుణులను అడగండి.

ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ బ్లడ్ ప్రెసర్ మానిటర్

ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ బ్లడ్ ప్రెసర్ మానిటర్

ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ రక్తపోటు మానిటర్ ను ఇంటిలో కలిగి ఉండటం అనేది ప్రస్తుత సమయంలో చాలా అవసరం. ఈ ముఖ్యమైన గాడ్జెట్ ఒక వ్యక్తి యొక్క పల్స్ రేటును ఖచ్చితంగా చూపించడానికి వీలుగా ఉంటుంది. రక్తపోటు మానిటర్ల గురించి సిఫారసుల కోసం వైద్య నిపుణులను అడగడం మాత్రం మరవకండి.

రక్తంలో ఆక్సిజన్ స్థాయిని ట్రాక్ చేయడానికి ఫింగర్‌టిప్ పల్స్ ఆక్సిమీటర్

రక్తంలో ఆక్సిజన్ స్థాయిని ట్రాక్ చేయడానికి ఫింగర్‌టిప్ పల్స్ ఆక్సిమీటర్

ఆక్సిమీటర్ మీ రక్తంలో ఆక్సిజన్ ప్రవాహాన్ని శ్వాసక్రియ రేటుతో పాటు కొలుస్తుంది. ఇది తక్కువ ధరలో లభించే అతి చిన్న పరికరం. మీరు రీడింగులను పొందడానికి మీ చూపుడు వేలికి దీనిని తగిలిస్తే సరిపోతుంది.

గ్లూకోమీటర్: రక్తంలో గ్లూకోజ్‌ను ట్రాక్ చేయడం

గ్లూకోమీటర్: రక్తంలో గ్లూకోజ్‌ను ట్రాక్ చేయడం

గ్లూకోమీటర్ గాడ్జెట్ సాయంతో మీ యొక్క రక్తంలో గ్లూకోజ్ స్థాయిని సులభంగా కొలవవచ్చు. ఇది అందరికీ అవసరం కాకపోవచ్చు కానీ మీకు లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అవసరమైతే వైద్యులు సిఫార్సు మేరకు గ్లూకోమీటర్లను సులభంగా పొందవచ్చు.

మెడికల్ అలర్ట్ సిస్టమ్

మెడికల్ అలర్ట్ సిస్టమ్

మెడికల్ అలర్ట్ సిస్టమ్ అనేది మీ ఇంట్లో పెద్దలకు ఉపయోగపడే అతి ముఖ్యమైన పరికరం. వారు అసౌకర్యంగా అనిపించినప్పుడల్లా మీ యొక్క సాయం కోసం ఒక బటన్ నొక్కడంతో మిమ్మల్ని పిలవడానికి వీలుగా ఉంటుంది. వైద్య అత్యవసర పరిస్థితుల్లో ఫోన్‌ను కనుగొని, నంబర్‌ను డయల్ చేయడం కంటే ఒకరి మెడలో వేలాడుతున్న పరికరం నుండి సహాయం కోసం కాల్ చేయడానికి ఒక బటన్‌ను నొక్కడం చాలా సులభం. మెడికల్ అలర్ట్ సిస్టమ్స్ మెడికల్ ప్రొఫెషనల్‌లకి ముఖ్యమైన గాడ్జెట్.

పెయిన్ రిలీఫ్ గాడ్జెట్స్

పెయిన్ రిలీఫ్ గాడ్జెట్స్

ప్రస్తుత సమయంలో మీ యొక్క ఇంట్లో పెయిన్ రిలీఫ్ గాడ్జెట్స్ ను కలిగి ఉండటం అనేది ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. హాట్ ప్యాడ్స్, మసాజర్స్ మరియు నరాల స్టిమ్యులేటర్లు వంటి అనేక రకాల పెయిన్ రిలీఫ్ గాడ్జెట్స్ అందుబాటులో ఉన్నాయి. మీ అవసరాలకు అనుగుణంగా సరైన పరికరాన్ని పొందడానికి మీ వైద్యుడిని సంప్రదించండి.

కాంటాక్ట్‌లెస్ IR థర్మామీటర్

కాంటాక్ట్‌లెస్ IR థర్మామీటర్

మీ యొక్క శరీర ఉష్ణోగ్రతను తరచూ చెక్ చేసుకోవడం కోసం కాంటాక్ట్‌లెస్, ఇన్‌ఫ్రా-రెడ్ థర్మామీటర్ ప్రస్తుతం చాలా అవసరమైన పరికరం. ఐఆర్ థర్మామీటర్ల గురించి సిఫారసుల కోసం వైద్య నిపుణులను అడగండి.

Best Mobiles in India

English summary
These are The Medical Gadgets You Need to Know About Your Health Time to Time
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X