Home
News

ZEE5 సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే...

భారతదేశంలో అతిపెద్ద ఓవర్-ది-టాప్ (OTT) కంటెంట్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన ZEE5 సబ్స్క్రిప్షన్ ఇప్పుడు ఎంచుకున్న కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లతో దేశంలోని వినియోగదారులు ఉచితంగా పొందుతున్నారు. వోడాఫోన్ ఐడియా (Vi) మరియు ఎయిర్‌టెల్ టెలికాం ఆపరేటర్లు తమ వినియోగదారులకు కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌తో ఉచితంగా ZEE5 సభ్యత్వాన్ని అందిస్తున్నాయి. భారతి ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ఒకదానితో మాత్రమే ZEE5 ను అందిస్తున్నది. అయితే Vi మాత్రం 5 ప్రీపెయిడ్ ప్లాన్‌లతో అందిస్తున్నది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ZEE5 సబ్స్క్రిప్షన్ తో భారతి ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు

ZEE5 సబ్స్క్రిప్షన్ తో భారతి ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు

భారతీ ఎయిర్‌టెల్ టెలికాం ఆపరేటర్ ZEE5 సబ్స్క్రిప్షన్ ను తన వినియోగదారులకు రూ .289 ఒకే ఒక ప్రీపెయిడ్ ప్లాన్‌తో అందిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు 1.5GB రోజువారీ డేటాతో పాటుగా రోజుకు 100SMSలు మరియు భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్‌ ప్రయోజనాలను అందిస్తుంది. వీటితో పాటుగా వినియోగదారులకు ఎయిర్టెల్ థాంక్స్ ప్రయోజనాలతో పాటు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ లను ఉచితంగా కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది.

ZEE5 సభ్యత్వంతో వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ప్రణాళికలు

ZEE5 సభ్యత్వంతో వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ప్రణాళికలు

వోడాఫోన్ ఐడియా యొక్క 5 ప్రీపెయిడ్ ప్లాన్‌లు ZEE5 చందాను ఉచితంగా అందిస్తున్నాయి. ఇందులో మొదటి ప్లాన్ రూ.405. ఇది మొత్తం 90GB డేటాతో పాటు అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలతో వస్తుంది. వీటితో పాటుగా వినియోగదారులు 1 సంవత్సరం చెల్లుబాటుతో ఉచితంగా Vi మూవీస్ & టీవీకి యాక్సిస్ ను పొందుతారు. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.

తదుపరిది రూ.555 ప్లాన్ 56 రోజుల చెల్లుబాటుతో 2GB రోజువారీ డేటాతో లభిస్తుంది. ఇది వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్, 100 SMS / day మరియు ZEE5 సభ్యత్వాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్ కొన్ని వారాల క్రితం Vi ప్రవేశపెట్టిన వీకెండ్ డేటా రోల్‌ఓవర్ ఆఫర్‌తో కూడా వస్తుంది.

 

డేటా ప్యాక్‌

తరువాత రెండు అపరిమిత వాయిస్ మరియు డేటా ప్యాక్‌లలో రూ .795, రూ .2,595 ప్లాన్ లు ఉన్నాయి. వీటిలో రూ.795 ప్యాక్ రూ.595 ప్లాన్‌కు సమానమైన అన్ని రకాల ప్రయోజనాలను కలిగి ఉంటుంది. కాకపోతే ఇది 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు ఒక సంవత్సరం చెల్లుబాటు కాలానికి ZEE5 యొక్క ఉచిత సభ్యత్వాన్ని పొందుతారు.

అలాగే రూ.2,595 ప్లాన్ కూడా వీకెండ్ డేటా రోల్ఓవర్ ఆఫర్‌తో సహా రూ.795 మరియు రూ.595 ప్లాన్ యొక్క ప్రయోజనాలతో వస్తుంది అయితే ఈ ప్లాన్ 1 సంవత్సరం (365 రోజులు) చెల్లుబాటు కాలంతో వస్తుంది. ఇది 1 సంవత్సరం విలువైన ZEE5 సభ్యత్వంను ఉచితంగా అందిస్తుంది.

ZEE5 చందాతో వచ్చే Vi నుండి చివరి ప్రీపెయిడ్ ప్యాక్ 355 రూపాయల ప్యాక్. కానీ ఇది డేటా ప్యాక్. ఇది వినియోగదారులకు 50GB డేటాను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది.

 

Best Mobiles in India

English summary
These are The Prepaid Plans Offers ZEE5 Subscription at Free of Cost
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X