Home
News

ఇకపై గూగుల్ మ్యాప్ నుంచి రివార్డ్స్, డిస్కౌంట్లు పొందవచ్చు

By Gizbot Bureau

గూగుల్ మ్యాప్ వాడే వారికి గూగుల్ శుభవార్తను అందించింది. టెక్ గెయింట్ గూగుల్ కొన్ని కొత్త ఫీచర్లను గూగుల్ మ్యాప్ లో యాడ్ చేసింది. business owners కోసం గూగుల్ మ్యాప్ లో ఈ ఫీచర్లను యాడ్ చేసినట్లు గూగుల్ వెల్లడించింది. గూగుల్ మ్యాప్ లో ఈ మధ్య ఫుడ్ బుకింగ్ ఫీచర్ ని ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే.

ఇకపై గూగుల్ మ్యాప్ నుంచి రివార్డ్స్, డిస్కౌంట్లు పొందవచ్చు

ఈ ఫీచర్ ద్వారా పుడ్ ఆర్డర్ చేసిన యూజర్లకు గూగుల్ మ్యాప్ ద్వారా కొన్ని రివార్డులను , డిస్కౌంట్లను పొందే అవకాశాన్ని గూగుల్ కల్పిస్తోంది. గూగుల్ మై బిజినెస్ యాప్ అయిదు సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. గ్లోబల్ వైడ్ గా 150 మిల్లియిన్ కస్టమర్ల ఈ ఈయాప్ ద్వారా ఆన్ లైన్ లో కనెక్ట్ అవుతున్నారు. వీరందరి కోం గూగుల్ ఈ కొత్త ఫీచర్లను అందించాలని నిర్ణయం తీసుకుంది.

న్యూ డిజైన్

న్యూ డిజైన్

మొబైల్ యూజర్ల కోసం గూగుల్ కొత్త డిజైన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ అప్ డేట్ అందరికీ వర్తిస్తుంది. యూజర్లు గూగుల్ మ్యాప్ ద్వారా బిజినెస్ ని చాలా తేలికగా చేరుకునేందుకు ఈ డిజైన్ అవకాశం కల్పిస్తుంది. వారి మొబైల్ ఫోన్లో గూగుల్ మ్యాప్ లో బిజినెస్ కి సంబంధించి చిన్నగా యుఆర్ ఎల్ కనిపిస్తుంది. ఎక్కువ స్సేస్ తీసుకోకుండా ఇది యూజర్లకు కనిపిస్తుంది.

  short name and URL

short name and URL

గూగుల్ మ్యాప్ ద్వారా వ్యాపారాన్ని చేయాలనుకునే వ్యాపారులు తమ బిజినెస్ కి సంబంధించిన పేరు అలాగే URL ను చిన్న అక్షరాలుగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలా చిన్నగా ఉండటం వల్ల యూజర్లకి అది త్వరగా చేరుతుందని, కస్టమర్లు తమకు కావాల్సింది వెతుక్కునేందుకు చాలా ఈజీ అవుతుందని గూగుల్ తెలిపింది. తద్వారా తమ ప్రొఫైల్ నుండి బుకింగ్ కాని లేక లేటెస్ట్ అప్ డేట్లను కాని రివ్యూలు రాయడం కాని చాలా తేలిక అవుతుంది.

రివార్డ్స్, డిస్కౌంట్స్

రివార్డ్స్, డిస్కౌంట్స్

గూగుల్ మ్యాప్స్ ద్వారా కస్టమర్లు రివార్డులు, అలాగే డిస్కౌంట్లు పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. వ్యాపారస్తులు ఈ గూగుల్ మ్యాప్ ద్వారా యూజర్లకు welcome offers, discounts and rewards అని అందించవచ్చు. తద్వారా వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని మరింతగా పెంచుకోవచ్చు. బిజినెస్ చేసే వ్యాపారస్తులు, అలాగే కస్టమర్లు తమ ప్రొఫైల్లో ఫోటోని పెట్టుకునేలా ఆప్సన్ కల్పిస్తోంది. తద్వారా బిజినెస్ చేసే కస్టమర్లు అలాగే వ్యాపారస్తులకు ఇది మంచి అవకాశంగా మారుతుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

 క్యాప్సన్ ఇతర వివరాలుః

క్యాప్సన్ ఇతర వివరాలుః

ప్రొపైల్ ఫోటో ద్వారా బిజినెస్ కి సంబంధించిన వివరాలను , అలాగే క్యాప్సన్ ఇంకా ప్రొడక్ట్ కి సంబంధించిన వివరాలను ప్రమోట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందించడం వారికి డెలివరీ విషయంలో ఎటువంటి అంతరాయం కలగకుండా చూడటం, మంచి అనుభవాన్ని అందించడం లాంటి వాటి కోసం గూగుల్ ఈ కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. లోకల్ గా టాప్ 5 లో ఒకటిగా నిలిచేందుకు గూగుల్ కసరత్తు చేస్తోంది. తద్వారా వ్యాపారస్తులకు తమ వ్యాపారంలో మంచి ఉన్నత స్థితిని కల్పించాలని లక్ష్యంగా గూగుల్ పెట్టుకుంది.

Best Mobiles in India

English summary
These Google Maps users can now earn rewards, discounts
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X