ఇండియాలో ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్‌ని అందుకుంటున్న నగరాలు ఇవే

By Gizbot Bureau
|

ఇండియాలో డేటా వినియోగం పెరుగుతున్న కొద్ది బ్రాడ్‌బ్యాండ్‌ వేగం కూడా పెరుగుతూ వస్తోంది. ఇంతకుముందు బ్రాడ్‌బ్యాండ్‌ వేగం 16.5%గా ఉంటే అది ఇప్పుడు కాస్తా 34.07Mpbs అయింది. ఇండియన్ టెలికం మార్కెట్లో ఈ మధ్య ఇది చాలా ట్రెండ్ అయింది కూడా. ఇండియన్ టెలికం మార్కెట్ Q2-Q3 2019 లో బ్రాడ్‌బ్యాండ్‌ వేగం చాలా పెరిగింది. ఈ విషయాన్ని broadband and mobile network intelligence Ookla రిపోర్ట్ చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో కొన్ని నగరాలు ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్‌ని అందుకుంటున్నాయని తెలిపింది. ఈ నగరాలను ఓ సారి పరిశీలిస్తే..

 

 ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్‌ని అందుకుంటున్న నగరాలు

ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్‌ని అందుకుంటున్న నగరాలు

తమిళనాడు రాజధాని చెన్నై ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్‌ని అందుకుంటున్న నగరాల్లో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. దీని సరాసరి వేగం 51.07Mpbsగా ఉంది. పాస్టెస్ట్ అంటే డౌన్లోడ్ స్పీడ్ అనే అర్థంలో వస్తుంది. తరువాత కర్ణాటక రాజధాని బెంగుళూరు 42.50 Mbpsతో రెండవ స్థానంలో ఉంది. అలాగే తెలంగాణా రాజధాని హైదరాబాద్ 41.68 Mbpsతో మూడవ స్థానంలో నిలిచింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో యావరేజ్ స్పీడ్ 32.39గా ఉంది. అలాగే లక్నో విషయానికి వస్తే 8.94Mbpsతో అత్యంత స్లో గా ఉన్న నగరంగా నిలిచింది.

టాప్ లో యాక్ట్ 

టాప్ లో యాక్ట్ 

ఈ రిపోర్ట్ ప్రకారం యాక్ట్ ఫైబర్ నెట్ టాప్ ప్లేసులో నిలిచింది. broadband download speed స్పీడు విభాగంలో మూడవ క్వార్టర్2019లో ఈ రికార్డును నమోదు చేసింది.ఈ కంపెనీ download speed 45.31 to 47.74 Mbps మధ్యన ఆఫర్ చేస్తోంది. Hathway and Airtel కూడా ఇదే ఫాలో అవుతున్నాయి. 

జియో, ఎయిర్‌టెల్
 

జియో, ఎయిర్‌టెల్

కాగా రిలయన్స్ జియో fixed broadbandలో ఫాస్టెస్ట్ ప్రొవైడర్ గా నిలిచింది. Q2-Q3 2019లో ఇండియాలోని 5 నగరాల్లో ఈ రికార్డును నమోదు చేసింది. ఇక ఎయిర్‌టెల్ విషయానికి వస్తే నాగ్ పూర్ లో highest Speed Scoreని సాధించింది. భారత టెలికాం నియంత్రణ సంస్థ(ట్రాయ్‌) విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2019 సెప్టెంబర్‌లో సెకనుకు 21 మెగాబైట్ల సగటు డేటా డౌన్‌లోడ్ వేగాన్ని జియో నమోదు చేసింది. భారతి ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ సగటు డౌన్‌లోడ్ వేగం 8.3 ఎంబీపీఎస్‌ను నమోదు చేసింది. వొడాఫోన్ 6.9 ఎంబీపీఎస్‌, ఐడియా సెల్యులార్ 6.4 ఎంబీపీఎస్‌ డౌన్‌లోడ్ వేగాన్నినమోదు చేసింది. ఈ వివరాలను తాజాగా విడుదల చేసింది. వొడాఫోన్‌, ఐడియాలు విలీనమైనప్పటికీ నెట్‌వర్క్‌ల విషయంలో వేర్వేరుగానే ఉండటంతో వాటి వేగాలను కూడా ప్రత్యేకంగా వెల్లడిస్తోంది ట్రాయ్‌. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ 3జీ మాత్రమే కలిగి ఉంది.

అప్‌లోడ్‌

అప్‌లోడ్‌

అప్‌లోడ్‌ విషయానికి వస్తే 5.4 ఎంబీపీఎస్‌తో ఐడియా, 5.2 ఎంబీపీఎస్‌తో వొడాఫోన్‌ కంపెనీలు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. 4.2 ఎంబీపీఎస్‌తో జియో మూడో స్థానంలో ఉండగా, 3.1 ఎంబీపీఎస్‌తో ఎయిర్‌టెల్‌ నాలుగో స్థానంలో నిలిచింది. ఇది ఇలా వుంటే ప్రైవేట్‌ మొబైల్‌ డేటా అనలిటిక్స్‌ సంస్థ 'ఓపెన్‌ సిగ్నల్‌' లెక్కలప్రకారం ఎయిర్‌టెల్‌ డౌన్‌ లోడ్‌ వేగంలో టాప్‌లో ఉంది. టెలికాం కంపెనీల ఇంటర్నెట్‌ వేగ గణన సర్వే వివరాలను నిన్న(అక్టోబర్ 22, మంగళవారం) వెల్లడించింది. 2019 జూన్‌-ఆగస్టు కాలానికి ఎయిర్‌టెల్‌ కంపెనీయే అత్యధిక స్పీడ్‌ను నమోదు చేసినట్టు తెలిపింది. అయితే ట్రాయ్‌ సర్వేలో మాత్రం జియోనే మళ్లీ మొదటి స్థానంలో రావడం గమనార్హం. మై స్పీడ్‌ అప్లికేషన్‌ ఆధారంగా ట్రాయ్‌ ఇంటర్నెట్‌ సరాసరి వేగాల్ని గణించే విషయం తెలిసిందే.

Best Mobiles in India

English summary
These Indian cities get the fastest broadband speed

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X