ఈ ఇంటర్నెట్ బ్రౌజర్లు మీ డేటా హ్యాక్ కాకుండా కాపాడతాయి

By Gizbot Bureau
|

మీరు ఇంటర్నెట్ వాడుతున్నారా..అయితే ఇది కొన్ని సార్లు చాలా ప్రమాదకరంగా మారుతూ ఉంటుంది. ఇంటర్నెట్ ద్వారా అనేక ఉపయోగాలు ఉన్నా యూజర్ల డేటా విషయంలో ఇది చాలా ప్రమాదకరంగా మారుతోంది. యూజర్ల వ్యక్తిగత డేటాకు అసలు రక్షణ ఉండటం లేదు. హ్యకర్లు వినియోగదారుల డేటాను ఎప్పటికప్పుడు హ్యాక్ చేసి వారి సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. ఇక సోషల్ మీడియా వచ్చిన తరువాత హ్యాకింగ్ అనేది మరీ ప్రమాదకరంగా తయారయ్యింది. ఆ మధ్య ఫేస్ బుక్ కేంబ్రిడ్జీ ఎనాలటికా స్కాం బయటకు రావడంతో యూజర్లు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. WannaCry and Petya ransomwareలు యూజర్ల డివైస్ లను టార్గెట్ చేస్తూ ఃాగించిన హ్యాకింగ్ దెబ్బకు కంపెనీలు కుదేలయ్యాయి కూడా. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ వాడకం అనేది సెక్యూర్డ్ గా ఉంచుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. మరి ఎలా సెక్యూర్డ్ గా ఉంచుకోవాలనే దానిపై ఓ లుక్కేయండి. ఈ ఇంటర్నెట్ బ్రౌజర్లు మీ డేటా హ్యాక్ కాకుండా కాపాడతాయి.

Mozilla’s Firefox 70

Mozilla’s Firefox 70

ఇది లేటెస్ట్ గా వచ్చిన బ్రౌజర్. ఇందులో మీకు కొన్ని రకాల కొత్త ఫీచర్లు యాడ్ అయ్యాయి. ఈ ఫీచర్లు ఎప్పటికప్పుడే మీ డేటాను కాపాడుతుంటాయి. డేటా లీక్ కాకుండా పాస్ వర్గ్ ప్రొటక్షన్ మరింత సెక్యూర్డ్ గా ఉంచుతాయి. ఇందులో ప్రధానంగా ట్రాకింగ్ ప్రొటెక్షన్ ఫీచర్ యాడ్ అయింది. దీని ద్వారా మీ డేటా హ్యక్ అయితే వెంటనే తెలిసిపోతుంది. 

Chrome 78

Chrome 78

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కూడా క్రోమ్ లో కొత్త ఫీచర్లను యాడ్ చేసింది. ఇందులో కొత్తగా Password Checkup toolని యాడ్ చేశారు. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ డేటాను చాలా సెక్యూర్డ్ గా ఉంచుకోవచ్చు.

మొజిల్లా ఫైర్ ఫోక్స్

మొజిల్లా ఫైర్ ఫోక్స్

ఈ మధ్యనే German Federal Office for Information Security సంస్థ మొజిల్లా ఫైర్ ఫోక్స్ మీ డేటాను హ్యాక్ కాకుండా కాపాడటంలో ముందు వరుసలో ఉందని తెలిపింది. Chrome, Edge and Internet Explorer

కన్నా ఇది ఎక్కువ ప్రొటక్షన్ ఇస్తుందని తెలిపింది. అయితే ఈ కంపెనీ దీన్ని ఇతర బ్రౌజర్లు అయిన Safari, Opera ఇంకా ఇతర బ్రౌజర్లతో పోల్చలేదు. 

ఫెయిలైన ఇతర బ్రౌజర్లు

ఫెయిలైన ఇతర బ్రౌజర్లు

ఈ సంస్థ మొజిల్లా ఫైర్ ఫోక్స్ నే వాడమని చెబుతోంది. ఇతర బ్రౌజర్లు అన్నీ యూజర్ల డేటాను రక్షించడంలో ఫెయిల్ అయ్యాయని కాబట్టి ఖచ్చితంగా యూజర్లు మొజిల్లా ఫైర్ ఫోక్స్ వాడాలని చెబుతోంది. మిగతా బ్రౌజర్లు పాస్ వర్డ్ ప్రొటక్షన్ ఇవ్వడంలో చాలా వీక్ గా ఉన్నాయని, బగ్స్ ని బ్లాక్ చేయడం లేదని చెబుతోంది. 

Best Mobiles in India

English summary
These internet browsers will alert you if your data gets stolen

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X