LinkedInలో ఈ ఫీచర్ల గురించి మీకు తెలుసా

  ప్రొఫెషనల్స్ కోసం రూపొందించబడిన ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సర్వీస్ లింకిడ్‌ఇన్ (LinkedIn) ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లతో దూసుకుపోతోంది. ఈ సర్వీస్ ద్వారా లక్షలాది మంది జాబ్ ప్రొఫెషనల్స్ తమకు నచ్చిన కంపెనీలతో కనెక్ట్ కాగలుగుతున్నారు.

  LinkedInలో ఈ ఫీచర్ల గురించి మీకు తెలుసా

  అయితే, మనలో చాలా మంది యూజర్లు లింకిడ్‌ఇన్ సర్వీసును కేవలం రిక్వెస్ట్ మెయిల్ ఇంకా రిక్రూటింగ్ కోసం మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. దీంతో చాలా ఫీచర్లను వీరు మిస్ అవుతున్నారు. లింకిడ్‌ఇన్ అందిస్తోన్న పలు ముఖ్యమైన ఫీచర్లను ఇప్పుడు తెలుసుకుందాం..

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  కీవర్డ్స్ (Keywords)

  లింకిడ్‌ఇన్ సర్వీసులోని కీవర్డ్స్ ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ద్వారా మీ కంటెంట్‌కు సంబంధించిన సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మరింత మెరుగుపడుతుంది. దీంతో మీరిచ్చే హెడ్‌లైన్, సమరీ, ఇంటరెస్ట్స్, జాబ్ టైటిల్స్, జాబ్ డిస్క్రిప్షన్స్, స్కిల్స్ మరింత ఎఫెక్టివ్గా కనిపించే అవకాశం ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే లింకిడ్‌ఇన్‌లో మీ ఎదుగుదలకు ఈ ఫీచర్ మరింతగా తోడ్పడుతుంది.

  పబ్లిషింగ్ లాంగ్ కంటెంట్ (Publish long content)

  ఈ ఫీచర్ ద్వారా సుదీర్ఘ వ్యాసాలతో మిమ్మల్ని మీరు లింకిడ్‌ఇన్‌లో పరిచయం చేసుకునే వీలుంటుంది. ఈ ఫీచర్ అందించే ఈజీ-టు-యూజ్ ఎడిటర్ ద్వారా మీ ప్రొఫైల్ నిమిత్తం ఆర్టికల్స్‌ను పోస్ట్ చేసుకునే వీలుంటుంది. ఇలా చేయటం వల్ల మీ కంటెంట్‌ను, మీ కనెక్షన్స్ మాత్రమే కాకుండా బయట వ్యక్తులు కూడా చూసే వీలుంటుంది.

  ప్రొఫెషనల్ గ్యాలరీ (professional gallery)

  ఈ ఫీచర్ ద్వారా మీ ప్రొఫైల్ పేజీకి ప్రొజెక్ట్ ఉదాహరణలతో పాటు ఇమేజెస్, ఎంబెడెడ్ వీడియోస్ ఇంకా స్లైడ్ షేర్ ప్రెజంటేషన్స్‌ను యాడ్ చేసుకోవచ్చు. దీంతో మీరు మరింత మందికి రీచ్ అయ్యే వీలుంటుంది.

  భారీగా తగ్గిన గూగుల్ పిక్సల్ 2 ఎక్స్ఎల్ ధర

  సేవ్ సెర్చ్ అలర్ట్స్ (Save search alerts)

  ఈ సెర్చ్ ఫీచర్ ద్వారా మీ ప్రొఫెషన్‌కు సంబంధించిన ఇంట్రస్టింగ్ జాబ్ రిజల్ట్స్‌ను ఎప్పటికప్పుడు పొందే వీలుంటుంది. సెర్చ్ అలర్ట్ బటన్‌ను లింకిడ్‌ఇన్ సెర్చ్ పేజ్ రైట్ సైడ్ భాగంలో క్రియేట్ చేసుకోవటం ద్వారా అలర్ట్స్‌ను ఎప్పటికప్పుడు పొందే వీలుంటుంది.

  జాయిన్ గ్రూప్స్ (Join groups)

  ఈ ఫీచర్ ద్వారా మీ ప్రొఫైల్‌తో పాటు మీ పర్సనల్ బ్రాండింగ్‌ను పెంచుకోవచ్చు. మీ ఇండస్ట్రీకి సంబంధించిన గ్రూప్‌లలో జాయన్ అవ్వటం మీ ఆలోచనలను ఇతర లింకిడ్ ఇన్ గ్రూపులతో షేర్ చేసుకోవటం వంటివి చేయవచ్చు.

  ఇన్‌స్టెంట్ మెసేజింగ్ (Instant messaging)

  లింకిడ్‌ఇన్ పేజీలోని చాట్ విడ్జెట్ ద్వారా ఇన్‌స్టెంట్ మెసేజింగ్‌ను మీరు నిర్వహించుకునే వీలుంటుంది. స్ర్కీన్ కుడి దిగువన కనిపించే మెసేజింగ్ బటన్ పై క్లిక్ చేయటం ద్వారా మీ కనెక్షన్‌లతో చాట్ చేసుకునే వీలుంటుంది.

  ప్రైవేట్ కనెక్షన్స్..

  మీ లింకిడ్‌ఇన్ అకౌంట్‌లోని కనెక్షన్‌లను మరింత గోప్యంగా ఉంచేందుకు ఈ ఫీచర్ ఉపయోగడపతుంది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలంటే ముందు ప్రొఫైల్ పిక్షర్ పై క్లిక్ చేయవల్సి ఉంటుంది. ఆ తరువాత సెట్టింగ్స్ అండ్ ప్రైవసీని సెలక్ట్ చేసుకుని ప్రైవసీ టాబ్‌లో Who can see your connectionsను Only youకు మార్చుకుంటే సరిపోతుంది.

  డౌన్‌లోడ్ ఎక్స్‌టెన్షన్ (Download extension)

  లింకిడ్‌ఇన్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌ను మీ పీసీ లేదా మొబైల్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవటం ద్వారా మీ లింక్‌డిన్ అకౌంట్ నుంచి ప్రతి నోటిఫికేషన్‌ను మిస్ అవ్వకుండా రిసీవ్ చేసుకోవచ్చు.

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  Read more about:
  English summary
  LinkedIn is one of the worlds largest professional-oriented platform that connects millions of sales rep, marketers and you can also follow your favorite business professionals. Today, we have compiled a list of features that you should know about.
  దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more