కొడుకు ఫేస్‌‌బుక్ అకౌంట్‌‍ను హైజాక్ చేసిన ఓ తల్లి

Posted By:

కొలంబియాకు చెందిన ఇద్దరు దొంగలు ఓ ఇంటర్నెట్ కేఫ్ లో దొంగతనానికి పాల్పడి ఎంచక్కా తప్పించుకున్నామని సంబరపడి పోయారు. సదరు ఇంటర్నెట్ కేఫ్ లో దొంగతానికి పాల్పడే ముందు ఫేస్ బుక్ అకౌంట్ లలోకి లాగిన్ అయిన ఆ ఇద్దరిలో ఒకరు సైన్ అవుట్ చేయటం మరిచిపోయారు. ఈ క్లూ ఆధారంగా పోలీసలు ఆ బుర్ర తక్కువ దొంగను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కుపంపించారు.

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ మనందరి జీవితాల్లో ఒక భాగమైపోయింది. సోషల్ నెట్‌వర్కింగ్ వినియోగం మరింతగా విస్తరించిన నేపధ్యంలో సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయి. డేటా అపహరణ.. చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి నేరపరమైన అంశాలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో హెచ్చుమీరుతున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఫేస్‌బుక్‌తో సంబంధం కలిగి ఉన్న పలు విలక్షణమైన నేరాలును మీకు వివరించటం జరుగుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్‌లో వెర్రి చేష్టలు

ఫ్లోరిడాకు చెందిన ఓ 19 సంవత్సరాల అమ్మ తన చిన్నారికి సంబంధించిన అసభ్యకర ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి లీగల్ చిక్కులను ఎదుర్కొవల్సి వచ్చింది.

ఫేస్‌బుక్‌లో వెర్రి చేష్టలు

ఓ చిన్నారి హత్యకు సంబంధించిన కీలక ఆధారం పేస్‌బుక్‌లో దొరకటంతో పోలీసులు చకచక ఆ కేసును చేధించగలిగారు. బిత్తరపోయే వాస్తవమేటంటే ఈ చిన్నారిని హత్య చేసింది స్వయానే ఆమె తండ్రే.

ఫేస్‌బుక్‌లో వెర్రి చేష్టలు

జోనాథన్ జి.పార్కర్ అనే నేరస్థుడు, తాను నేరానికి పాల్పిన ఇంట్లోని వ్యక్తికి సంబంధించిన కంప్యూటర్‌లో ఫేస్‌బుక్ అకౌంట్‌లో లాగినై, లాగ్ అవుట్ చేయటం మర్చిపోయాడు. పోలీసులకు ఇదే పెద్ద ఆధారమై సదరు నేరస్థుడిని పట్టించింది.

ఫేస్‌బుక్‌లో వెర్రి చేష్టలు

లెబనీస్ అధ్యక్షుడిని టార్గెట్ చేస్తూ పలువురు ఆకతాయులు 'Slanderous' పేరుతో ఓ ఫేస్ బుక్ పేజీని సృష్టించనుందుకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఫేస్‌బుక్‌లో వెర్రి చేష్టలు

అరుదైన ఉడుమును ఆహారంగా తీసుకుని ఆ దృశ్యాలున ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినందుకుగాను ఓ జంటను బహామియన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఫేస్‌బుక్‌లో వెర్రి చేష్టలు

కొడుకు ఫేస్‌‌బుక్ అకౌంట్‌‍ను హైజాక్ చేసిన ఓ తల్లి న్యాస్థానం ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది.

ఫేస్‌బుక్‌లో వెర్రి చేష్టలు

ఫేక్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసినందుకుగాను మొరాకో చెందిన ఓ వ్యక్తికి 4 సంవత్సరాలు జైలు శక్లి పడింది.

ఫేస్‌బుక్‌లో వెర్రి చేష్టలు

అమెరికాకు చెందిన వనీసా స్టార్ ఇంకా అలెగ్జాండర్ డేనియల్ దంపతులు జంతు సంరక్షణా చట్టాన్నిఉల్లంగిస్తూ జంతువులను హింసించిన దృశ్యాలను ఫేస్ బుక్ పోస్ట్ చేసినందుగు గాను జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది.

ఫేస్‌బుక్‌లో వెర్రి చేష్టలు

నైజీరియాకు చెందిన ఓ 23 ఏళ్ల యువతి తన మాజీ భర్తను నైజీరియాకు చెందిన ఉగ్రవాదిగా అభిర్ణిస్తూ ఫేస్‌బుక్‌లో ఓ ఫోటోను పోస్ట్ చేసింది. దింతో సదురు వ్యక్తి పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
These People Arrested Over Facebook. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot