Home
News

ఇటీవల భారీగా ధర తగ్గింపును అందుకున్న ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు ఇవే...

ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని వేచి చూస్తున్న వారికి ఇప్పుడు సరైన మరియు సువర్ణ అవకాశ సమయం వచ్చింది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారులు శామ్‌సంగ్, వన్‌ప్లస్ మరియు ఇతర సంస్థలు అధిక రెసొల్యూషన్ కెమెరా, 8GB మరియు 12GB ర్యామ్ వరకు మరియు 256GB, 512GB స్టోరేజ్ ఫీచర్స్ గల తమ హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ల యొక్క ధరలను భారీగా తగ్గించారు. ఇండియాలో ఇటీవల కాలంలో భారీగా ధర తగ్గింపును అందుకున్న 8 ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మోటో రేజర్ స్మార్ట్‌ఫోన్ మీద రూ.20,000 భారీ తగ్గింపు

మోటో రేజర్ స్మార్ట్‌ఫోన్ మీద రూ.20,000 భారీ తగ్గింపు

మోటరోలా సంస్థ నుండి లభించిన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు రెండవ సారి ధర తగ్గింపును అందుకుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను మొదట రూ.1,24,999 ధర వద్ద లాంచ్ చేశారు. గత ఏడాది దీని యొక్క ధర మీద రూ.30,000 తగ్గించిన తరువాత రూ.94,999 వద్ద అమ్మబడుతోంది. ఇప్పుడు మళ్ళీ దీని మీద రూ.20,000 వరకు ధరను తగ్గించారు. ఇది ఇప్పుడు 74,999 రూపాయల ధర వద్దనే కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ క్లామ్‌షెల్ డిజైన్‌ను కలిగి ఉండి హింజ్ మెకానిజం సహాయంతో స్క్రీన్ సగం వరకు మూసివేయడానికి వీలుగా ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతూ నీటి-నిరోధక పూతతో స్ప్లాష్ ప్రూఫ్‌తో లభిస్తుంది.

మోటో ఎడ్జ్ +స్మార్ట్‌ఫోన్ మీద రూ.10,000 భారీ తగ్గింపు

మోటో ఎడ్జ్ +స్మార్ట్‌ఫోన్ మీద రూ.10,000 భారీ తగ్గింపు

మోటరోలా సంస్థ గత సంవత్సరం విడుదల చేసిన మోటో ఎడ్జ్ + స్మార్ట్‌ఫోన్ యొక్క ధరను కూడా ఇప్పుడు తగ్గించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ యొక్క ధర మీద ఇప్పుడు రూ.10,000 వరకు ధరను తగ్గించింది. కంపెనీ మోటో ఎడ్జ్ + స్మార్ట్‌ఫోన్‌ను రూ.74,999 ధర వద్ద భారతదేశంలో విడుదల చేసింది. అయితే ఇప్పుడు వినియోగదారులు ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.64,999 కు కొనుగోలు చేయవచ్చు. మోటో ఎడ్జ్ + 108 ఎంపి ప్రధాన సెన్సార్, 16 ఎంపి అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 8 ఎంపి టెలిఫోటో కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో 25MP సెల్ఫీ షూటర్ కెమెరాను కలిగి ఉంది.

LG వింగ్ స్మార్ట్‌ఫోన్ మీద రూ.10,000 భారీ తగ్గింపు

LG వింగ్ స్మార్ట్‌ఫోన్ మీద రూ.10,000 భారీ తగ్గింపు

LG వింగ్ రొటేటబుల్ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్ మీద కూడా రూ .10,000 భారీ ధరల తగ్గింపును అందుకుంది. ఈ సంస్థ స్మార్ట్‌ఫోన్‌ను రూ.69,990 వద్ద లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు దీనిని రూ.59,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ డ్యూయల్ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్‌ను స్వివెల్ మోడ్‌లో ఉపయోగించవచ్చు. దీని ముందు భాగంను సవ్యదిశలో 90 డిగ్రీలు తిరుగుతుంది. ఇది ఆండ్రాయిడ్ 10తో రన్ అవుతూ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765G ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.

వన్‌ప్లస్ 8 ప్రో మీద రూ.5,000 భారీ తగ్గింపు

వన్‌ప్లస్ 8 ప్రో మీద రూ.5,000 భారీ తగ్గింపు

వన్‌ప్లస్ 8 ప్రోను గత ఏడాది ఏప్రిల్‌లో భారతదేశంలో లాంచ్ చేశారు. ఈ స్మార్ట్ఫోన్ 8 జిబి ర్యామ్ మరియు 12 జిబి ర్యామ్ వంటి రెండు వేరియంట్లలో వరుసగా రూ.54,999 మరియు రూ.59,999 ధర వద్ద విడుదల అయింది. అయితే ధర తగ్గిన తరువాత మీరు 8 జీబీ ర్యామ్ వెర్షన్‌ను రూ.50,999 వద్ద మరియు 12 జీబీ వేరియంట్‌ను రూ.55,999 తగ్గింపు ధర వద్ద పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ వార్ప్ ఛార్జ్ 30T ఫాస్ట్ ఛార్జింగ్ (5v / 6a), 30w వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ మరియు వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్, 4150mAh బ్యాటరీ ఫీచర్స్ ఉన్నాయి. అలాగే వన్‌ప్లస్ 8T మీద రూ.3,000 వరకు ధర తగ్గింపును అందుకుంది.

Best Mobiles in India

English summary
These Premium Smartphones Have Received Huge Price Slashed Recently in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X