Home
News

ఈ శాంసంగ్ ఫోన్లకు, ఆండ్రాయిడ్ 14 అప్డేట్ చేయలేరు! ఫోన్ల లిస్ట్! 

By Maheswara

శాంసంగ్ బ్రాండ్ గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో బాగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం, ఆండ్రాయిడ్ 14 ప్రివ్యూను రూపొందించడానికి గూగుల్ యొక్క మొదటి డెవలపర్ వెర్షన్ రాకతో, శామ్‌సంగ్ తన వన్ UI 6.0 అప్‌డేట్ యొక్క బీటా టెస్టింగ్‌ను మొదలుపెట్టింది. శాంసంగ్ ఈ సంవత్సరం జూలై లేదా ఆగస్టు నాటికి స్థిరమైన అప్డేట్ ను విడుదల చేస్తుందని భావిస్తున్నారు.

These Samsung Smartphones Will Not Get Android 14 OS Update. Smartphones List Here

ఇటీవల, ట్విట్టర్ లీక్ స్టార్ అయిన సామీ(@Thesammyfans), తన అభిమానులకు ఆండ్రాయిడ్ 14 ఆధారంగా One UI 6.0 అప్‌డేట్‌ను అందుకోలేని శాంసంగ్ గెలాక్సీ ఫోన్ల లిస్ట్ గురించి పోస్ట్ చేసారు.

ఇంకా, ఈ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా One UI 6.0 అప్‌డేట్ పొందలేని శాంసంగ్ గెలాక్సీ ఫోన్ల లిస్ట్ ను ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఫోన్ల యొక్క వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి గమనించండి. శాంసంగ్ కంపెనీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ విధానం ప్రకారం ఈ ఫోన్ల లిస్ట్ ను తయారు చేయడం జరిగింది.

* శాంసంగ్ గెలాక్సీ S20
* శాంసంగ్ గెలాక్సీ S20 +
* శాంసంగ్ గెలాక్సీ S20 అల్ట్రా
* శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్
* శాంసంగ్ గెలాక్సీ S20 FE
* శాంసంగ్ గెలాక్సీ నోట్ 20
* శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా
* శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 2 5G
* శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్
* శాంసంగ్ గెలాక్సీ S10 లైట్
* శాంసంగ్ గెలాక్సీ A51
* శాంసంగ్ గెలాక్సీ A71

These Samsung Smartphones Will Not Get Android 14 OS Update. Smartphones List Here

ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేసే One UI 6.0 అప్‌డేట్‌ను అందుకోలేని ఈ గెలాక్సీ ఫోన్లను తెలుసుకోవడం ముఖ్యమైన విషయం. అయితే, ఈ పైన పేర్కొన్న గెలాక్సీ పరికరాల జాబితా ఆండ్రాయిడ్ 13 OS ఆధారంగా One UI 5.0 అప్‌డేట్‌ను పొందుతుంది. ఈ గెలాక్సీ ఫోన్లు ఇప్పటివరకు మూడవ ప్రధాన అప్డేట్ లను అందుకున్నారు.

ఈ ఆండ్రాయిడ్ 14-ఆధారిత అప్‌డేట్‌లో భాగంగా బ్యాటరీ, భద్రత,ప్రైవసీ మరియు ఇతర అంశాలకు సంబంధించిన అనేక కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.

These Samsung Smartphones Will Not Get Android 14 OS Update. Smartphones List Here

ఇంకా, శాంసంగ్ గెలాక్సీ S21 సిరీస్ వంటి ఫోన్లు ఈ బ్రాండ్ యొక్క కొత్త గెలాక్సీ పరికరాలు ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్‌ను అందుకోనున్నాయి. మీరు వీలైనంత త్వరగా ఆండ్రాయిడ్ 14ని వాడటానికి ఆసక్తిగా ఉంటే, మీరు సరికొత్తగా లాంచ్ అయిన శాంసంగ్ S23 ని కొనుగోలు చేయవచ్చు.

ఇది ఇలా ఉండగా,శాంసంగ్ గెలాక్సీ A54 5G గత కొంతకాలంగా వార్తల్లో ఉంది. శాంసంగ్ గెలాక్సీ S23 వంటి డిజైన్‌తో వస్తుందని అణచన్లు ఉన్నాయి.ఈ లీక్ అయిన అంచనాలకు స్మార్ట్‌ఫోన్ కోసం శామ్‌సంగ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ లాంచ్ ఇప్పటికే పూర్తయింది మరియు ఇప్పుడు కొత్త ఫోన్ యొక్క లాంచ్ గురించి పుకార్లు వస్తున్నాయి, శాంసంగ్ గెలాక్సీ A54 5G త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. లీక్ అయిన వివరాల ప్రకారం, భారతదేశంలో రాబోయే శాంసంగ్ ప్రీమియం మధ్య-శ్రేణి పరికరం యొక్క తాత్కాలిక లాంచ్ టైమ్‌లైన్ మరియు ధర వివరాలను అందించింది. భారతదేశంలో వచ్చే నెలలో శామ్‌సంగ్ గెలాక్సీ A54 5Gని లాంచ్ చేయవచ్చని నివేదిక సూచిస్తుంది. ఈ ఫోన్ దేశంలో 2023 మార్చి మధ్యలో లేదా చివరిలో సేల్ కు వచ్చే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. అయితే, ఈ బ్రాండ్ ఈ స్మార్ట్‌ఫోన్ వివరాలను ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

Best Mobiles in India

English summary
These Samsung Smartphones Will Not Get Android 14 OS Update. Smartphones List Here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X