ఈ స్మార్ట్‌టీవీ వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్ షాకిచ్చింది

By Gizbot Bureau
|

కొన్ని రకాల స్మార్ట్ టీవీలకు నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ బిగ్ షాక్ ఇచ్చింది. పాత స్మార్ట్ టీవీలు మరియు ఫస్ట్-జెన్ స్ట్రీమింగ్ ప్లేయర్‌లకు నెట్‌ఫ్లిక్స్ మద్దతు ఇవ్వడం మానేసింది. ప్రత్యేకంగా పాత మోడళ్లలో శామ్‌సంగ్, విజియో మరియు రోకుల వంటి తదితర కంపెనీ విభాగాలలో నెట్‌ఫ్లిక్స్ మద్దతు ఇవ్వడం తగ్గించింది. 2011 మరియు అంతకుముందు సంవత్సరంలో రిలీజ్ అయిన శామ్‌సంగ్ స్మార్ట్ టీవీని ఉపయోగిస్తున్న వారికి డిసెంబరు నుండి నెట్‌ఫ్లిక్స్ సర్వీస్ ను యాక్సెస్ చేయకుండా నిలిపివేయడం ప్రారంభించింది.వీటితో పాటు విజియో స్మార్ట్‌టీవీను ఉపయోగిస్తున్న వారు కూడా ఈ సర్వీస్ ను యాక్సిస్ చేయడం కుదరదు.

Roku వీడియో స్ట్రీమింగ్ ప్లేయర్‌లకు
 

వీడియో స్ట్రీమింగ్ ప్లేయర్ లలో కొంతమంది కూడా నెట్‌ఫ్లిక్స్ ను యాక్సిస్ చేయలేరు. ఇందులో Roku వీడియో స్ట్రీమింగ్ ప్లేయర్‌లకు యాక్సిస్ ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. శాంసంగ్‌ స్మార్ట్‌ టీవీ వినియోగదారులకు 2019 డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి 'నెట్‌ఫ్లిక్స్‌' లో వచ్చే సినిమాలు, వెబ్ సిరీసులు ఇతర కార్యక్రమలు రావు. సాంకేతిక పరిమితుల వల్లన ఓల్డ్ టెలివిజన్ లో తమ ప్రసారాలను చూడలేరని నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది.

నూతన సెటాప్‌ బాక్స్‌

పాస్‌వర్డ్‌ షేరింగ్‌ను పరిమితం చేస్తున్నందునా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. దీని వలన తక్కువ సంఖ్యలో శాంసంగ్‌ వినియోగదారులకు మాత్రమే అవాంతరం కలుగుతోందని తెలిపింది.నెట్‌ఫ్లిక్స్‌ కార్యక్రమాలు రానివారు చూడాలంటే నూతన సెటాప్‌ బాక్స్‌ను అమర్చుకోవాలని తెలిపింది. ఆపిల్‌ టీవీ, గేమ్‌ కన్సోల్స్‌, క్రోమ్‌క్యాస్ట్, ఇతర టాప్‌ బాక్సుల్లో కార్యక్రమాలను చూడొచ్చని ఆ సంస్థ పేర్కొంది.

ఏ మోడల్స్..?

అయితే శాంమ్సంగ్ కు చెందిన టీవీల్లో నెట్‌ఫ్లిక్స్‌ కార్యక్రమాలు రావని చెప్పిన యాజమాన్యం, టువంటి టీవీ మోడళ్లలో నెట్‌ఫ్లిక్స్‌ కార్యక్రమాలు వస్తామో, రావో ఆ సంస్థ పూర్తి వివరాలు వెల్లడించలేదు. నెట్‌ఫ్లిక్స్‌ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపై శాంసంగ్ టీవీ యాజమాన్యం ఇంకా స్పందించలేదు. ఇది 'సాంకేతిక పరిమితులకు' లోబడి ఉందని కంపెనీ పేర్కొంది మరియు తక్కువ సంఖ్యలో ప్రజలు మాత్రమే ప్రభావితమవుతారని చెప్పారు.

2011 తరువాత ఉత్పత్తి చేయబడిన టీవీలు
 

ఈ మార్పు యుఎస్ మరియు కెనడాలో విక్రయించబడిన 2010 మరియు 2011 శామ్సంగ్ స్మార్ట్ టివి మోడళ్లను ప్రభావితం చేస్తుంది. ప్రభావిత పరికరాలు ఈ మార్పును ప్రతిబింబించే నోటిఫికేషన్ను అందుకుంటాయని కంపెనీ తెలిపింది. 2011 తరువాత ఉత్పత్తి చేయబడిన అన్ని ఇతర శామ్సంగ్ స్మార్ట్ టివి మోడల్స్ ఈ మార్పు వలన ప్రభావితం కావు," సౌత్ కొరియా టెక్ దిగ్గజం గత నెలలో ఒక ప్రకటనలో తెలిపింది.ఏ నమూనాలు ప్రభావితమవుతాయో ఇది ఖచ్చితంగా పేర్కొనలేదు, వినియోగదారులకు మాత్రమే తెలియజేయబడింది. అదనంగా, పాత విజియో స్మార్ట్ టీవీలు కూడా నెట్‌ఫ్లిక్స్ను కోల్పోతాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
These smart TVs cannot stream your Netflix shows anymore

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X