2020 లో మొబైల్ యూజర్లు అధిక మొత్తంలో ఖర్చు చేసిన స్మార్ట్‌ఫోన్ యాప్ లు ఇవే...

|

ఆపిల్ యాప్ స్టోర్ మరియు గూగుల్ ప్లే స్టోర్ రెండింటిలోనూ మొబైల్ యాప్ లు మరియు గేమ్ల కోసం ఎక్కువ మొత్తం ఖర్చు చేసినందున 2020 సంవత్సరంలో సరి కొత్త రికార్డులను పొందింది. ప్రతి డాలర్‌లో 65 సెంట్స్ ఆపిల్ డివైస్లకు వెళ్లడంతో ఆపిల్ డివైస్లు యాప్ యొక్క ఆదాయాన్ని శాసించాయి. గూగుల్ ప్లే స్టోర్ యొక్క యాప్ ఆదాయం కూడా 30% పెరిగింది. ఐఫోన్ వినియోగదారులు ఎక్కువగా గేమ్స్, ఫోటో, వీడియో యాప్ లతో పాటుగా సోషల్ నెట్‌వర్కింగ్ యాప్ లను అధికంగా వినియోగించడం జరిగింది. అలాగే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు కూడా సహజంగా గేమ్స్, వినోదం వంటి సామాజిక యాప్ లను అధికంగా వినియోగించారు. కొన్నినివేదిక ప్రకారం 2020 లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు కింద ఉన్న ఈ యాప్ ల కోసం అధికంగా ఖర్చు చేసారు. వీటి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 
These Smartphone Apps That Consumers Will Spend The Most Money on in 2020

** ఎక్కువ జనాదరణ పొందిన డేటింగ్ యాప్ టిండర్ ఈ జాబితాలో అన్నిటితో పోలిస్తే అగ్రస్థానంలో ఉంది. పోటిన్సెల్ మ్యాచ్లను కనుగొనడానికి వినియోగదారుల ప్రొఫైల్‌ల ద్వారా వెళ్ళడానికి ఈ యాప్ వినియోగదారులను అనుమతిస్తుంది.

 

** చైనీస్ వీడియో షేరింగ్ సోషల్ నెట్‌వర్కింగ్ సర్వీస్ యాప్ టిక్‌టాక్ ఈ జాబితాలో 2 వ స్థానంలో ఉంది. 15 సెకన్ల వీడియోలను డబ్ స్మాష్ రూపంలో తయారు చేయడానికి మరియు వాటిని సోషల్ మీడియాలలో షేర్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. అయితే ఇండియాలో టిక్‌టాక్ యాప్ ను బ్యాన్ చేసింది. యూజర్ల యొక్క వ్యక్తిగత విషయాలను లీక్ చేస్తున్న కారణంతో దీనిని తొలగించడం జరిగింది.

These Smartphone Apps That Consumers Will Spend The Most Money on in 2020

** గూగుల్ యాజమాన్యంలోని వీడియో ప్లాట్‌ఫాంలో గల యూట్యూబ్ యాప్ ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉంది. దీనిని ప్రస్తుతం అన్ని రకాల స్మార్ట్‌ఫోన్లలోను మరియు ఐఫోన్లలో ముందుగానే ఇంస్టాల్ చేయబడి వస్తున్నాయి.

** డిస్నీ సంస్థ తన స్ట్రీమింగ్ సర్వీసులలో కొత్తగా విడుదల చేసిన డిస్నీ+ యాప్ ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉంది. ఇది డిస్నీ, పిక్సర్, మార్వెల్, స్టార్ వార్స్ మరియు నేషనల్ జియోగ్రాఫిక్ యొక్క కంటెంట్‌ను అందిస్తుంది. దీనిని ఎక్కువగా చిన్న పిల్లల కోసం ఉపయోగించడం గమనార్హం.

** చైనీస్ వీడియో స్ట్రీమింగ్ యాప్ టెన్సన్ట్ వీడియో యాప్ ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉంది. ఈ యాప్ అధికంగా సినిమాలు, డ్రామాలు మరియు వైవిధ్య షోల కంటెంట్‌ ఎంపికలతో వస్తుంది. ఈ యాప్ గురించి ఇండియాలో తెలియకపోవచ్చు కానీ చైనాలో అధికంగా దీనిని ఉపయోగిస్తూ ఉంటారు.

** ప్రపంచం మొత్తం మీద వీడియో ప్లాట్‌ఫాంలో ఉత్తమమైన వీడియో స్ట్రీమింగ్ సర్వీసులను అందించే నెట్‌ఫ్లిక్స్ యాప్ ఈ జాబితాలో 6 వ స్థానంలో ఉంది.

Best Mobiles in India

English summary
These Smartphone Apps That Consumers Will Spend The Most Money on in 2020

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X