5G స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలలో వీరే టాప్
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హువాయి గత ఏడాది ప్రపంచంలోనే 5G ఫోన్ విక్రేతలలో మొదటి స్థానంలో నిలిచింది. స్ట్రాటజీ అనలిటిక్స్ యొక్క రీసెర్చ్ ప్రకారం 2019 లో ప్రపంచవ్యాప్తంగా 16 మిలియన్ 5G ఎనేబుల్డ్ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అయ్యాయి.

ఇందులో హువాయి సంస్థ 6.9 మిలియన్ 5G స్మార్ట్‌ఫోన్‌లను అమ్మకాలు చేసింది. ఈ అమ్మకాలతో ప్రపంచవ్యాప్తంగా 37% స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. ఈ జాబితాలో రెండవ స్థానాన్ని 36% మార్కెట్ వాటాతో శామ్సంగ్ కంపెని స్వాధీనం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా శామ్సంగ్ కంపెనీ 6.7 మిలియన్ 5G ఎనేబుల్డ్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది.

చైనా యొక్క మరొక స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో ఈ జాబితాలో మూడవ స్థానాన్ని ఆక్రమించింది. వివో సంస్థ ప్రపంచవ్యాప్తంగా 5G ఎనేబుల్డ్ స్మార్ట్‌ఫోన్‌లను మొత్తంగా 2 మిలియన్ ఫోన్ల అమ్మకాలను చేసి మొత్తం మార్కెట్ వాటాలో 11%ను కైవసం చేసుకున్నది. వివో సంస్థ 5G ఫోన్లతో ఎక్కువగా చైనా యొక్క మార్కెట్ మీద దృష్టిని పెట్టింది.

ఇండియాలో స్మార్ట్‌ఫోన్ రంగంలో బాగా పాపులర్ అయిన షియోమి సంస్థ కూడా ఈ జాబితాలో నాలుగవ స్థానంలో ఉంది. షియోమి Mi Mix 5G వంటి ఫోన్ల విక్రయాలు 1.2 మిలియన్లకు చేరుకోవడంతో కంపెనీ యొక్క మార్కెట్ వాటా 6%కు చేరుకున్నది.

మొదటిగా 5G స్మార్ట్‌ఫోన్లను ప్రారంభించిన LG సంస్థ కూడా ప్రపంచం మొత్తం మీద 0.5 మిలియన్ 5G ఎనేబుల్డ్ స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలతో 5% మార్కెట్ వాటాతో ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉంది. ఆపిల్ మరియు ఇతర ప్రముఖ బ్రాండ్ల నుండి రాబోయే 5G స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్‌లతో ఈ వాటా యొక్క నంబర్స్ పూర్తిగా మారవచ్చు అని నివేదిక పేర్కొంది.

స్ట్రాటజీ అనలిటిక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీల్ మాస్టన్ మాట్లాడుతూ ఆపిల్ ఐఫోన్ మరియు ఇతర పెద్ద బ్రాండ్ల నుండి రాబోయే 5G మోడల్స్ ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 5G అత్యంత రసవత్తరంగా మారబోతున్నది. ఏదేమైనా ఇటీవలి కరోనావైరస్ భయం ప్రస్తుతం చైనాలోని కొన్ని ప్రాంతాలలో వాణిజ్యాన్ని పరిమితం చేస్తోంది. 2020 మొదటి అర్ధభాగంలో ఆసియా లేదా ప్రపంచవ్యాప్తంగా 5G సరఫరా లేదా డిమాండ్ మందగించడానికి కారణం ఇది కూడా కావచ్చు అని తెలిపారు.


Click it and Unblock the Notifications








